4.Devuniki Devikini - దేవునికి దేవికి
దేవునికి దేవికి తెప్పల కోనెటమ్మ
వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా
...
ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు
ఆర్మిలి నాలుగువేదాలదే నీ దరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీ లోతు వోకోనేరమ్మా
....
తగిని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు
జగతి దేవతలు నీజల జంతులు
గగనపు బుణ్యలోకాలు నీదరిమేడలు
మొగినీచుట్టు మాకులు మునులోయమ్మా
...
వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభారము
యేకడను శ్రీవేంకటెశుడే నీవునికి
దీకొని నీ తీర్థమాడితిమి కావమమ్మా
...
:By Balakrishnaprasad garu:

0 comments:
Post a Comment