Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, September 28, 2006

11.Emuko - ఏముకో


Audio link : PappuVenugopalarao_NedunuriKirshnamurty
Audio link : Sobharaj
Meaning in TeluguBhakti pages:
Archive Page
ఏముకో చిగురు టధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను
భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా
...
కలికి చకోరాక్షికి కడ - కన్నులు కెంపై తోచెనే

చెలువంబిప్పటిదేమో - చింతింపరే చలులు
నలువున ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు
నిలువుగపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా
..
పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల

కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి న నఖ శశి రేఖలు
వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా
..
ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పులు
ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి - కౌగిటి అధరామృతముల

అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా
listen to this song:
:By Shobharaju garu:

from flowers at his feet , explanation by Dr.Pappu venugopalarao , rendered by Sri Nedunuri Krishnamurthy
Pappu Venugopalarao_Nedunuri Krishnamurthy : 
Shobharaj :
 

1 comment:

Sravan Kumar DVN said...

charanam 1 : meaning:
----------------------
ఆమె కంటి కొనలు ఎఱ్ఱగా కనిపించు చున్నవి.ఆమె తన ప్రియునిపై నాటి తిరిగి లాగుకొనినప్పుడు ప్రియుని ఒడలి నుంచి అంటిన నెత్తురు కాదు కదా !
అని చెలికత్తెలు, అమ్మవారిని చూసి హాస్యాలాడుతున్నారు.