శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, September 25, 2006

7.Deva Namo Deva - దేవా నమో దేవా



దేవా నమో దేవా
పావన గుణగణ భావా
...
జగదాకారా చతుర్భుజా

గగననీల మేఘశ్యామా
నిగమపాదయుగ నీరజనాభా
అగణితలావణ్యాననా
...
ఘనవేదాంతైర్గణన ఉదారా

కనక శంఖ చక్ర కరాంకా
దినమణి శశాంక దివ్యవిలోచన
అనుపమ రవి బింబాధరా
...
భావజకంజభవజనకా

శ్రీవనితాహృదయేశా
శ్రీవేంకటగిరి శిఖర విహారా
పావన గుణగణ భావా

daevaa namO daevaa paavana guNagaNa bhaavaa ... jagadaakaaraa chaturbhujaa gagananeela maeghaSyaamaa nigamapaadayuga neerajanaabhaa agaNitalaavaNyaananaa ... ghanavaedaaMtairgaNana udaaraa kanaka SaMkha chakra karaaMkaa dinamaNi SaSaaMka divyavilOchana anupama ravi biMbaadharaa ... bhaavajakaMjabhavajanakaa SreevanitaahRdayaeSaa SreevaeMkaTagiri Sikhara vihaaraa paavana guNagaNa bhaavaa listen to this song :
:By Balakrishnaprasad garu:

0 comments: