Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, April 26, 2007

197.jayamaMgaLamu nIku- జయమంగళము నీకు

ప|| జయమంగళము నీకు సర్వేశ్వర | జయమంగళము నీకుజలజవాసినికి
చ|| శరణాగతపారిజాతమా | పొరి నసురలపాలిభూతమా |
అరుదయిన సౄష్టికి నాదిమూలమా వో- | హరి నమో పరమపుటాలవాలమా
చ|| సకలదెవతాచక్రవర్తి | వెకలిపై నిండినవిశ్వమూర్తి |
అకలంకమైనదయానిధి | వికచముఖ నమో విధికివిధి ||
చ|| కొలిచినవారలకొంగుపైడి | ములిగినవారికి మొనవాడి |
కలిగినశ్రీవెంకటరాయా | మలసి దాసులమైనమాకు విధేయా ||


in english:
pa|| jayamaMgaLamu nIku sarvESvara | jayamaMgaLamu nIkujalajavAsiniki
ca|| SaraNAgatapArijAtamA | pori nasuralapAliBUtamA |
arudayina sRuShTiki nAdimUlamA vO- | hari namO paramapuTAlavAlamA
ca|| sakaladevatAcakravarti | vekalipai niMDinaviSvamUrti |
akalaMkamainadayAnidhi | vikacamuKa namO vidhikividhi ||
ca|| kolicinavAralakoMgupaiDi | muliginavAriki monavADi |
kaliginaSrIveMkaTarAyA | malasi dAsulamainamAku vidhEyA ||

Jayamangalamu - Ma...


video with lyrics :

No comments: