Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, April 22, 2007

191.evvari BAgyaMbeTTunnadO-ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో

ప|| ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో | దవ్వు చేరువకు తానే గురుతు ||
చ|| పరమ మంగళము భగవన్నామము | సురలకు నరులకు శుభకరము |
ఇరువుగ నెరిగిన యెదుటనె వున్నది | వరుసల మరచిన వారికి మాయ ||
చ|| వేదాంత సారము విష్ణు భక్తియిది | అది మునుల మతమైనది |
సాధించు వారికి సర్వసాధనము | కాదని తొలగిన కడు శూన్యంబు ||
చ ||చేతి నిధానము శ్రీవేంకటపతి | ఏతల జూచిన నిందరికి |
నీతియు నిదియే నిజసేవకులకు | పాతకులకు అది భవసాగరము ||


in english:
pa|| evvari BAgyaMbeTTunnadO | davvu cEruvaku tAnE gurutu ||
ca|| parama maMgaLamu BagavannAmamu | suralaku narulaku SuBakaramu |
iruvuga nerigina yeduTane vunnadi | varusala maracina vAriki mAya ||
ca|| vEdAMta sAramu viShNu Baktiyidi | adi munula matamainadi |
sAdhiMcu vAriki sarvasAdhanamu | kAdani tolagina kaDu SUnyaMbu ||
ca ||cEti nidhAnamu SrIvEMkaTapati | Etala jUcina niMdariki |
nItiyu nidiyE nijasEvakulaku | pAtakulaku adi BavasAgaramu ||

ragam:bhairavi

EvvariBhagyambettunnado-Nedunuri -అన్నమాచార్య సంకీర్తన
Hosted by eSnips

No comments: