Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, April 23, 2007

192.vEdamulE nI nivAsamaTa-వేదములే నీ నివాసమట

:పెదతిరుమలాచార్య కీర్తన:


Audio link : AnasuyaMurthy , album: divyasimham namami , composed by TP Chakrapani
book:15 kriti:131

ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహ | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ ||
చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన | నారాయణ రమాథినాయక నగధర నరసింహ |
నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు | ఈరీతి త్రివిక్రమాకౄతి నేచితి నరసింహ ||
చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ | శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు | భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ ||
చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర | వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ |
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన | ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ ||

in english:
pa|| vEdamulE nI nivAsamaTa vimalanArasiMha | nAdapriya sakalalOkapati namOnamO narasiMha ||
ca|| GOrapAtaka niruharaNa kuTiladaityadamana | nArAyaNa ramAthinAyaka nagadhara narasiMha |
nIrUpaMbu iMta aMtayani nijamu teliyarAdu | IrIti trivikramAkRuti nEciti narasiMha ||
ca|| gOviMda guNagaNarahita kOTisUryatEja | SrIvallaBa purANapuruSha SiKasaKa narasiMha |
dEvA mimu brahmAdulakunu teliya nalavikAdu | BAviMcaga prahlAdu neduTa paragiti narasiMha ||
ca|| dAsaparikara sulaBa tapana caMdranEtra | vAsava suramuKa munisEvita vaMdita narasiMha |
BAsuramuga SrIvEMkaTagirini pAyanidaivama vaTugAna | OsarakipuDu EgitiviTla ahObala narasiMha ||

vEdamulE nI nivAsa...


Get this widget | Track details | eSnips Social DNA

No comments: