Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, April 03, 2007

173.maMgAMbudhi hanumaMta-మంగాంబుధి హనుమంత


Audio link :GBKP
Archive link :
Ragam : Dharmavati , Composer : G.Balakrishnaprasad
మంగాంబుధి హనుమంత నీ శరణ
మంగవించిమి హనుమంత ||

బాలార్క బింబము ఫలమని పట్టిన
ఆలరిచేతల హనుమంతా |
తూలని బ్రహ్మాదులచే వరముల
ఓలి చేకొనిన ఓ హనుమంత ||

జలధిదాట నీ సత్వము కపులకు
అలరి తెలిసితివి హనుమంతా |
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళి హనుమంత ||

పాతాళము లోపలి మైరావణు-
ఆతల చంపిన హనుమంతా |
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి-
నీతల కొలిచే హిత హనుమంత ||


in english:
maMgAMbudhi hanumaMta nI SaraNa
maMgaviMchimi hanumaMta ||

bAlArka biMbamu phalamani paTTina
AlarichEtala hanumaMtA |
tUlani brahmAdulachE varamula
Oli chEkonina O hanumaMta ||

jaladhidATa nI satvamu kapulaku
alari telisitivi hanumaMtA |
ilayu nAkasamu nEkamugA naTu
balimi perigitivi bhaLi hanumaMta ||

pAtALamu lOpali mairAvaNu-
Atala chaMpina hanumaMtA |
chEtulu mODchuka SrIvEMkaTapati-
nItala kolichE hita hanumaMta ||

No comments: