Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword)
to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
Audio section under Maintanance
Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9
శ్రీ మల్లాది సూరిబాబుగారి కమనీయ గాత్రానికి శ్రీ సిహెచ్ సోమసుందరరావుగారి రమణీయమైన వీడియో కల్పన.
పల్లవి
హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా
ఓ లక్ష్మీ వల్లభ! వేంకటేశ! కష్టాలు పడలేక హరి హరి అని మేము భయపడటం తప్పించి- ఈ లోకంలో ఇంకేముంది గనక – ( ఏమి లేదని స్వామితో బాధా నివేదనం) స్వామి మాకు బుద్ధి చెప్పు !
01 వ చరణం
ఈ శరీరమనే పాపపు కొంపలో శబ్ద స్పర్శ రస రూప గంధము లను ఐదుగురు మహా పాపాత్ములు ఉన్నారు.
వీటిని ధర్మాసనం పై కూర్చొని అనుసంధానము చేసే ఆరుగురు( కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) తాపిగాండ్లు(అనుసంధానము చేసేవారు) ఉన్నారు.
అన్ని విషయాల లోనూ వీటి గొడవవల్ల చపలత్వము వస్తుంది. నీకు సంబంధించిన నామ సంకీర్తన పనులు ఎలా జరుగుతాయయ్యా! ( చపలత్వం వల్ల నామ సంకీర్తన చేయలేకపోతున్నానని బాధా నివేదన)
02 వ చరణం
ఈ శరీరము అనేక రంధ్రములున్న చేను. ( నవద్వారాలు కన్నులు (2), చెవులు (2), నాసారంధ్రములు (2), 7. నోరు, 8. మూత్రద్వారము, 9. మలద్వారము) ఈ శరీరంతో చేసే కృషి బండ వ్యవసాయం(కష్టంతో కూడుకున్నది)
ఈ వ్యవసాయం చేసే విషయంలో సహకరించే ఒకే ఒక ఎద్దు (మనస్సు) కుంటిది. వంకరటింకరగా నడుస్తుంటుంది. అది నన్ను తొక్కిపెడుతుంది. ఇక ముగ్గురు (సత్వ రజస్తమోగుణాలు) తలారులు(ఉరితీసేవారు) ఈ శరీరంలో ఉన్నారు. వాళ్లతో తగువులాడే 56 తత్వాలు( 1. ప్రకృతి, 2. పురుషుడు మొదలయినవి) ఉన్నాయి. వీటన్నింటి బాధతో సొక్కిపోయి అలిసిపోయి ఉన్న నాకు వీటిని నియంత్రించటానికి- ఆజ్ఞాపించటానికి చోటేదయ్యా !( నావల్ల కాదు నువ్వే రక్షించాలని భావం)
03 వ చరణం
గ్రామదేవతల దగ్గఱ పొంగళ్లు పెట్టుటకు వాడు చిన్న మట్టిపాత్ర పొంగటికుండ ఉంటుంది చూడు! అలా ఈ శరీరము పంచభూతాలు పొంగళ్ళు పెట్టటానికి వాడే చిన్ని మట్టిపాత్ర. దీని ద్వారా పుట్టిన సుఖాల కష్టాల పంటలను చూసుకొంటూ -పంటలు కోయు పదునుకు వచ్చు కోత కాలము వరకు పాప పుణ్య ధాన్యాదిరాసులుండెడి చోటయిన(కొటారు) శ్మశానము ఎదురుచూస్తుంటుంది.
శ్రీ వేంకటేశా! మోక్షానికి అవతల వైపున ఉన్న నన్ను చూసి, ఇవతలకు ( మోక్షానికి)చేర్చే సాధనం తెలిసిన నువ్వు ఈ భక్తుని సంగతులన్నీ విచారించవయ్యా ! నీ చేతిలో పెట్టాను. ఇక నేను చెప్పేది ఏముంది అయ్యా! అన్నీ నీకు తెలుసు.
కొసరినా నిన్నే కాని కోపించినా నిన్నే కాని కసరినా నిన్నే కాని కాదన్న
నిన్నే కాని విసరినా నిన్నే కాని వేసరినా నిన్నే కాని ఇసుమంతైనా అన్య
మెఱుఁగదయ్యా
అలసినా నిన్నే కాని అఁకొన్నా నిన్నేకాని పిలిచినా నిన్నే కాని పేరుకొన్నా
నిన్నే కాని సొలసినా నిన్నే కాని సోకనాడినా నిన్నే కాని కలనైనా తలఁ పెందూ
కలుగదు గదవయ్యా!
కొనియాడినా నిన్నే కాని గుంపించినా నిన్నే కాని పనివినా నిన్నే పాడినా
నిన్నే కాని మనసిచ్చి యలమేలుమంగపతి వేంకటేశ యెనసితివి మాచెలి నింక నేచ
నేమిటకయ్యా |కట| kaTakaTaa ayyO kaaMta niMta yaepuduraa
"నెర బిరుదు" అంటే అతిశయించిన సమర్ధుడు అని అర్థం. అదిగో నీ బంటు వొరసె గగనము (ఆకాశము తాకినాడు) అంటున్నారు అన్నమయ్య. హనుమంతుడు శ్రీవేంకటేశ్వరుని నమ్మిన బంటు అని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుని చేతినిమ్మపండట అంటే కరతలామలకము అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడతాడు. నీ బంటు హుటాహుటి యెగయగా గగనమునవుండే లోకములన్నియు గడగడవణకినవట. ఆయన మందులకొండ దగ్గరకు వెళ్ళి 'కో' యని దాన్ని తెచ్చాడట.
ఓ శ్రీవేంకటేశ్వరా! నీ నమ్మినబంటు అయిన ఈ హనుమంతుడున్నాడే, ఆయన నీ “నెర బిరుదు" బంటు (అతిశయించిన సమర్థుడైన) బంటు. అదిగో ఆకాశంలో నీబంటు ఎలా మెరసిపోతున్నాడో చూడు స్వామీ!
1. ఆయన గగనసీమలో యెగురుటకు తనకాయాన్ని అమితంగా పెంచివేశాడు. అప్పుడు గగనమున కిక్కిరిసిన చుక్కలు (నక్షత్రాలు) ఆయన మొలనూలు వలె (రత్నాలమొలత్రాటివలె) తళతళలాడింది. పెళపెళనార్చి (పెళ పెళమని బొబ్బలు పెట్టి) ఈయన తన కాయమును పెంచాడు. అట్టి భవాండము (బ్రహ్మాండమంతా) పెద్ద ఆర్భాటముతో (మ్రోతతో) నింపివేశాడు. అప్పుడు ఆయన శరీరం బ్రహ్మాండము అంచులు మోసింది.
2. అది చూచి గగనము పైనున్న లోకములన్నీ గడగడ వణికినవి. ఆ లోకములు ఆశ్చర్యంతో చూస్తుండంగానే హుటాహుటి (అతివేగముగా) ఎగిరాడు. మగటిమి మెరయగ (తన వీరత్వము ద్యోతకమవుతుండగా) మందుల కొండకు నిగిడి (వ్యాపించి) "కో"యని అరచినాడు నీ నమ్మినబంటు హనుమంతుడు.
3. ఇమ్ముల (ఇంపుగా) రఘుపతికి హితుడై సీతాదేవి నెమ్మనము (మనశ్శాంతిని) అలరించిన మహానుభావుడే నీ బంటు. కమ్మర (అటుపైన) ఓ శ్రీవేంకటేశ్వరా! నీచే (నీచేతిలోని) నిమ్మపండైనవాడు నీ బంటు. (పూర్వకాలంలో ఎక్కడికన్నా దూరప్రయాణాలు చేయాలంటే దాహానికి వుపశమనంగా నిమ్మకాయ నీళ్ళు తాగేవారు. నిమ్మపండు మన చేతుల్లోనే వుంటే దిగులే లేదు కదా! అప్పటికప్పుడు వాడుకోగలవాటిని 'కరతలామలకం' అంటారు.
Youtube link Annamayya pataku pattabhishekam, tuned by Sri Ramachari, Singer Sri Mruduravali ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య యేలితివి నాఁడెనాఁడె యెరుఁగుదుమయ్యా
Tuned & Sung by Sri Sathiraju Venumadhav , in Ragam Hamsanandi
Youtube link Audio Arvhive link ఉ.
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ! (poem from dasarathi satakam with similar meaning) నేము నీకన్యులమా నీవు మాలో లేవా యీ మేరలనే మమ్ము యేలుకొందు గాక ధర విభీషణుడు మీతల్లి కడవాడా నిరతి ఘంటా కర్ణుడు నీ తండ్రివాడా యిరవై ధృవుడు మీ యిల్లాలి కడవాడా శరణన్న మాటలోనే సరుగఁగాచితివి మున్నిటి శబరి నీకు ముమ్మనుమరాలా మిన్నక ఉద్ధవుడు మీ మేనమామా పన్నిన వుడుత నీకు పాయరాని చుట్టమా యెన్నగ వీరల నెల్ల నింతలో మెచ్చితివి అహల్య నీ కూతురా అకౄరుడు గొడుకా విహరించ నీకు శ్రీ వేంకటేశుడా వహి ముత్తాతలా నీచే వరములు గొన్నవారు మహి నిందులకెపో నీ మఱుగు చొచ్చితిని nEmu nIkanyulamA nIvu mAlO lEvA yI mEralanE mammu yElukoMdu gAka dhara vibhIshaNuDu mItalli kaDavADA nirati ghaMTA karNuDu nI taMDrivADA yiravai dhRvuDu mI yillAli kaDavADA SaraNanna mATalOnE saruga@MgAchitivi munniTi Sabari nIku mummanumarAlA minnaka uddhavuDu mI mEnamAmA pannina vuDuta nIku pAyarAni chuTTamA yennaga vIrala nella niMtalO mechchitivi ahalya nI kUturA akRUruDu goDukA vihariMcha nIku SrI vEMkaTESuDA vahi muttAtalA nIchE varamulu gonnavAru mahi niMdulakepO nI ma~rugu chochchitini