894. idi kallayanarAdu - ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు
Video link from FB page of Sri T. Patanjali
ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు
పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు ॥పల్లవి॥
యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా
వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు
చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు
పదిలముగాఁ జూతు భావించరాదు ॥ఇది॥
అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా
చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు
సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు
మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు ॥ఇది॥
రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా
తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు ॥ఇది॥
idi kallayanaraadu yidi niSchayiMparaadu
padilaana@M goluva@Mgaa pratyakshamayyaevu
yedalO nuMDuduvani yinni vaedaalu cheppagaa
vedaki dhyaanamu saetu vesa ganu@MgoMTa laedu
chedara kaMdae mari jeevu@MDu nunnaa@M DaMduru
padilamugaa@M jootu bhaaviMcharaadu
aMtaTaa nuMduvani prahlaadu@MDu cheppenana@Mgaa
chiMtiMchi paTTa@Mdala@Mtu chaetiki@M jikkuTa laedu
saMtata j~naanaana nee saakaaramunnadaMduru
maMtanaana@M biltu nokamaaTa vina@MbaDadu
ravilO nuMduvani suralu ninnu@M goluva@Mgaa
tavili poojiMchaenaMTae daggari vachchuTa laedu
yivala SreevaeMkaTaadri niravai neevunnaa@MDavu
tiviri saeviMchitimi drishTamaaya maaku
No comments:
Post a Comment