895. soridi mammita dayajUtuvu gAkA - సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
Youtube link: Sri G. Balakrishnaprasad & Smt R. Bullemma
సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
వెరసి మరి యెక్కడా నేమి విన్నవించే మిఁకను -పల్లవి-
తలఁచితి నీరూపము తగిలితి నీపాదాలు
కలసితి నీదాసుల గమిలోనను
చలివాసె భవములు సడిదీరెఁ గర్మములు
యెలమి నీమహిమలు యేమి చెప్పే మిఁకను -సొరి-
నీముద్రలు ధరించితి నీగుణాలు వొగడితి
చేముట్టి పూజించితి శ్రీయంగాలు
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము
గోమున మరేమి నిన్ను కొసరే మిఁకను -సొరి-
తిరుమణి ధరించితి తీర్థపస్రాదాలు గొంటి
విరవైన నీకథలు వీనుల వింటి
పరగ శ్రీవేంకటేశ పరము నిహముఁ గంటి
అరసి యితర మేమి ఆశపడే మిఁకను -సొరి-
soridi mammiTa daya@Mjootuvu gaakaa
verasi mari yekkaDaa naemi vinnaviMchae mi@Mkanu -pallavi-
tala@Mchiti neeroopamu tagiliti neepaadaalu
kalasiti needaasula gamilOnanu
chalivaase bhavamulu saDideere@M garmamulu
yelami neemahimalu yaemi cheppae mi@Mkanu -sori-
neemudralu dhariMchiti neeguNaalu vogaDiti
chaemuTTi poojiMchiti SreeyaMgaalu
taamasamulellaa nooDe tativachche saatvikamu
gOmuna maraemi ninnu kosarae mi@Mkanu -sori-
tirumaNi dhariMchiti teerthapasraadaalu goMTi
viravaina neekathalu veenula viMTi
paraga SreevaeMkaTaeSa paramu nihamu@M gaMTi
arasi yitara maemi aaSapaDae mi@Mkanu -sori-
No comments:
Post a Comment