Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, October 15, 2020

892. hariyariyani veragaMduTagAka - హరిహరియని వెరగందుటఁ గాక

Facebook Video link: Tuned and Subg by Sri Malladi Suribabu garu. 

హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా

పాపపుకొంపలో వారు పంచమహాపాతకులు
కాపులకు పదుగురు కర్త లందుకు
తాపి కాండ్లారుగురు ధర్మాసనమువారు

చాపలమే పనులెట్టు జరగీనయ్యా

పలుకంతల చేను బండ వెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటిపసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి ఆనాజ్ఞ కిదుఁ జోటేదయ్యా

బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోఁతవేఁత చూచుకొని కోరు కొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా

harihariyani veragaMduTa@M gaaka
sirivara maaku buddhi cheppa@Mgadavayyaa

paapapukoMpalO vaaru paMchamahaapaatakulu
kaapulaku paduguru karta laMduku
taapi kaaMDlaaruguru dharmaasanamuvaaru
chaapalamae panuleTTu jarageenayyaa

palukaMtala chaenu baMDa vevasaayamu
balimi@M dokkee@M guMTipasuramu
talavarulu muguru taguvaadu lae@Mbaiyaaru
solasi aanaaj~na kidu@M jOTaedayyaa

bootaala poMgaTikae poDamina paMTalellaa
kO@Mtavae@Mta choochukoni kOru koTaaru
yeetala SreevaeMkaTaeSa yinni vichaariMchi nee-
chae@Mtae nilipiti vi@Mka@M jeppaedae@MTidayyaa

Explanation by Dr. Tadepalli Patanjali garu

హరిహరియని వెరగందుటఁ గాక (అన్నమయ్య కీర్తన)
శ్రీ మల్లాది సూరిబాబుగారి కమనీయ గాత్రానికి శ్రీ సిహెచ్ సోమసుందరరావుగారి రమణీయమైన వీడియో కల్పన.
పల్లవి
హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా
ఓ లక్ష్మీ వల్లభ! వేంకటేశ! కష్టాలు పడలేక హరి హరి అని మేము భయపడటం తప్పించి- ఈ లోకంలో ఇంకేముంది గనక – ( ఏమి లేదని స్వామితో బాధా నివేదనం) స్వామి మాకు బుద్ధి చెప్పు !
01 వ చరణం
ఈ శరీరమనే పాపపు కొంపలో శబ్ద స్పర్శ రస రూప గంధము లను ఐదుగురు మహా పాపాత్ములు ఉన్నారు.
ఈ పాపాత్ములను రక్షించటానికి దశ ఇంద్రియాలు అనే కర్తలు ఉన్నారు.(05 జ్ఞానేంద్రియములు 1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక. 05 కర్మేంద్రియములు) 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.)
వీటిని ధర్మాసనం పై కూర్చొని అనుసంధానము చేసే ఆరుగురు( కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) తాపిగాండ్లు(అనుసంధానము చేసేవారు) ఉన్నారు.
అన్ని విషయాల లోనూ వీటి గొడవవల్ల చపలత్వము వస్తుంది. నీకు సంబంధించిన నామ సంకీర్తన పనులు ఎలా జరుగుతాయయ్యా! ( చపలత్వం వల్ల నామ సంకీర్తన చేయలేకపోతున్నానని బాధా నివేదన)
02 వ చరణం
ఈ శరీరము అనేక రంధ్రములున్న చేను. ( నవద్వారాలు కన్నులు (2), చెవులు (2), నాసారంధ్రములు (2), 7. నోరు, 8. మూత్రద్వారము, 9. మలద్వారము) ఈ శరీరంతో చేసే కృషి బండ వ్యవసాయం(కష్టంతో కూడుకున్నది)
ఈ వ్యవసాయం చేసే విషయంలో సహకరించే ఒకే ఒక ఎద్దు (మనస్సు) కుంటిది. వంకరటింకరగా నడుస్తుంటుంది. అది నన్ను తొక్కిపెడుతుంది. ఇక ముగ్గురు (సత్వ రజస్తమోగుణాలు) తలారులు(ఉరితీసేవారు) ఈ శరీరంలో ఉన్నారు. వాళ్లతో తగువులాడే 56 తత్వాలు( 1. ప్రకృతి, 2. పురుషుడు మొదలయినవి) ఉన్నాయి. వీటన్నింటి బాధతో సొక్కిపోయి అలిసిపోయి ఉన్న నాకు వీటిని నియంత్రించటానికి- ఆజ్ఞాపించటానికి చోటేదయ్యా !( నావల్ల కాదు నువ్వే రక్షించాలని భావం)
03 వ చరణం
గ్రామదేవతల దగ్గఱ పొంగళ్లు పెట్టుటకు వాడు చిన్న మట్టిపాత్ర పొంగటికుండ ఉంటుంది చూడు! అలా ఈ శరీరము పంచభూతాలు పొంగళ్ళు పెట్టటానికి వాడే చిన్ని మట్టిపాత్ర. దీని ద్వారా పుట్టిన సుఖాల కష్టాల పంటలను చూసుకొంటూ -పంటలు కోయు పదునుకు వచ్చు కోత కాలము వరకు పాప పుణ్య ధాన్యాదిరాసులుండెడి చోటయిన(కొటారు) శ్మశానము ఎదురుచూస్తుంటుంది.
శ్రీ వేంకటేశా! మోక్షానికి అవతల వైపున ఉన్న నన్ను చూసి, ఇవతలకు ( మోక్షానికి)చేర్చే సాధనం తెలిసిన నువ్వు ఈ భక్తుని సంగతులన్నీ విచారించవయ్యా ! నీ చేతిలో పెట్టాను. ఇక నేను చెప్పేది ఏముంది అయ్యా! అన్నీ నీకు తెలుసు.

No comments: