862. itaramu linniyu naemiTiki - ఇతరము లిన్నియు నేమిటికి
youtube link
Ragam : saama (సామ)Composed and sung by sri vedavyasa anandabhattar garuCommentary : sri kamisetty srinivasulu garu
ఇతరము లిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుట పరము =పల్లవి=
ఎక్కడిసురపుర మెక్కడివైభవ-
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమునుఁ బుణ్యము
గక్కునఁ జేయఁగఁ గల దిహపరము =ఇత=
యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు
యివ్వలఁ దాఁ సుఖియించుట పరము =ఇత=
యెందరు దైవము లెందరు వేల్పులు
యెంద రిందురును నేమిటికి
కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము =ఇత=
itaramu linniyu naemiTiki
matichaMchalamae maanuTa paramu =pallavi=
ekkaDisurapura mekkaDivaibhava-
mekkaDi vinniyu naemiTiki
yikkaDanae parahitamunu@M buNyamu
gakkuna@M jaeya@Mga@M gala dihaparamu =ita=
yevvaru chuTTamu levvaru baMdhuvu-
levvariMdarunu naemiTiki
ravvagulakshmee ramaNuni@M dala@Mpuchu
yivvala@M daa@M sukhiyiMchuTa paramu =ita=
yeMdaru daivamu leMdaru vaelpulu
yeMda riMdurunu naemiTiki
kaMdu ve~ri@Mgi vaeMkaTagiriramaNuni
chiMdulaeka kolichina dihaparamu =ita=