448.vADe vEMkaTESuDanEvADe vIDu - వాడె వేంకటేశుడనేవాడె వీడు
Click here to listen to this kirtana
Click here to download this kirtana sung by Balakrishnaprasad
వాఁడె వేంకటేశుఁడనేవాఁడె వీఁడు
వాఁడి చుట్టుఁగైదువ వలచేతివాఁడు ॥పల్లవి॥
కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కి
చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి
ఆరడి ముచ్చిమి కూటి కాసపడ్డవాఁడు ॥వాడె॥
పెరియాళువారి బిడ్డ పిసికి పైవేసిన
విరుల దండల మెడవేసినవాఁడు
తరుణి చేయి వేసిన దగ్గరి బుజము చూఁచి
పరవశమై చొక్కి పాయలేని వాఁడు ॥వాడె॥
పామరులఁ దనమీద పాటలెల్లాఁ బాడుమంటా
భూమికెల్లా నోర నూరి పోసినవాఁడు
మామకూఁతురలమేలుమంగ నాచారియుఁ దాను
గీముగానే వేంకటగిరి నుండేవాఁడు ॥వాడె॥
pa|| vADe vEMkaTESuDanEvADe vIDu | vADicuTTugaiduvavalacEtivADu ||
ca|| kArimArasutuni cakkanimATalaku jokki | cUragA vEdAlaguTTu cUpinavADu |
tIrani vEDukatO tirumaMgayALuvAri- | AraDimuccimikUTi kAsapaDDavADu ||
ca|| periyALuvAribiDDa pisiki paivEsina | viruladaMDala meDavEsinavADu |
taruNi cEyivEsina daggari bujamucAci | paravaSamai cokki pAyalEnivADu ||
ca|| pAmarula danamIdi pATalellA bADumaMTA | BUmikellA nOra nUripOsinavADu |
mAmakUturala mElumaMganAcAriyu dAnu | gImugAnE vEMkaTagiri nuMDEvADu ||
No comments:
Post a Comment