447.nIvE mAkudikku ninnE talatumu - నీవే మాకుదిక్కు నిన్నే తలతుము
Click here to listen to this kirtana sung by Balakrishnaprasad
నీవే మాకుదిక్కు నిన్నే తలతుము | కావుమా నేరమెంచక కరుణానిధీ ||
నెట్టన సూర్యు లోని నెలకొన్న తేజమా | గట్టిగా చంద్రుని లోని కాంతి పుంజమా |
పుట్టి రక్ష్మించే యజ్ఞపురుషుని ప్రకాశమా | వొట్టుక దేవతలలో నుండిన శక్తి ||
సిరులు మించినయట్టి జీవులలో ప్రాణమా | గరిమ వేదములలో గల అర్థమా |
పరమపదమునందు పాదుకొన్న బ్రహ్మమా |చరాచరములలో సర్వాధారమా ||
జగములో వెలసేటి సంసారసుఖమా | నిగిడిన మంత్రముల నిజమహిమా |
మిగుల శ్రీవేంకటాద్రి మీద దైవమా |ముగురు వెల్పుల లోని మూలకందమా ||
nIvE mAkudiku ninnE talatumu - kAvumA nErameMchaka karuNAnidhI
neTTana sUryu lOni nelakonna tEjamA - gaTTigA chaMdruni lOni kAMti puMjamA
puTTi rakshmiMchE yaj~napurushuni prakASamA - voTTuka dEvatalalO nuMDina Sakti
sirulu miMchinayaTTi jIvulalO prANamA- garima vEdamulalO gala arthamA
paramapadamunaMdu pAdukonna brahmamA - charAcharamulalO sarwAdhAramA
jagamulO velasETi saMsArasukhamA- nigiDina maMtramula nijamahimA
migula SrIvEMkaTAdri mIda daivamA -muguru velpula lOni mUlakaMdamA
No comments:
Post a Comment