420.eMta manniMchitO - ఎంత మన్నించితో
Audio link (sung by Balakrishnaprasad) , Ragam : Sumanesaranjani , composer : G.Balakrishnaprasad
ఎంత మన్నించితో యీ యింతినిదె నీవు
అంతకంతకు ప్రేమనలరీనిపుడు
పడతి నాట్యశ్రాంతి పవళించి తొల్లి నీ-
తొడలపై నీవు తల దువ్వగాను
కడలేని యిటువంటి కళలు దలచే కదా
విడువని వియోగమున వేగీనిపుడు
ఒనర కుచభారమున నొరగి యీ మలగుపై-
నెనసి నీవాకు మడిచియ్యగాను
వనిత నేడటువంటి వలపుదలచే కదా
ఘనమైన తాపమున కాగీనిపుడు
సిరులు నీ మోముపై చెక్కులొయ్యన చేర్చి
యరమోడ్చి కనురెప్పలలమి యలమి
తిరువేంకటాచలాధిపుడ నినుగూడియే
పరవశానంద సంపద( దేలెనిపుడు
eMta manniMchitO yI yiMtinide nIvu
aMtakaMtaku prEmanalarInipuDu
paDati nATyaSrAMti pavaLiMchi tolli nI-
toDalapai nIvu tala duvvagAnu
kaDalEni yiTuvaMTi kaLalu dalachE kadA
viDuvani viyOgamuna vEgInipuDu
onara kuchabhAramuna noragi yI malagupai-
nenasi nIvAku maDichiyyagAnu
vanita nEDaTuvaMTi valapudalachE kadA
ghanamaina tApamuna kAgInipuDu
sirulu nI mOmupai chekkuloyyana chErchi
yaramODchi kanureppalalami yalami
tiruvEMkaTAchalAdhipuDa ninugUDiyE
paravaSAnaMda saMpada( dElenipuDu
No comments:
Post a Comment