421.vIDugadE SEshuDu - వీడుగదే శేషుడు
Audio Archive link
వీడుగదే శేషుడు శ్రీవేంకటాద్రి శేషుడు - వేడుక గరుడనితో పెన్నుద్దైన సేషుడు
వేయివడిగెలతోడ వెలసిన శేషుడు - చాయమేని తళుకువజ్రాల శేషుడు
మాయని శిరసులపై మాణికాల శేషుడు - యేయెడ హరికి నీడై యేగేటి శేషుడు
పట్టపు వాహనమైన బంగారు శేషుడు - చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు
నట్టుకొన్న రెండువేలు నాలుకల శేషుడు - నెట్టన హరి(బొగడ నేరుపరి శేషుడు
కదిసి పనులకెల్ల గాచుకున్న శేషుడు - మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు
అదె శ్రీవేంకటపతి నలమేలుమంగకును - పదరక యేపొద్దూ పానుపైన శేషుడు
vIDugadE SEshuDu SrIvEMkaTAdri SEshuDu - vEDuka garuDanitO pennuddaina sEshuDu
vEyivaDigelatODa velasina SEshuDu - chAyamEni taLukuvajrAla SEshuDu
mAyani Sirasulapai mANikAla SEshuDu - yEyeDa hariki nIDai yEgETi SEshuDu
paTTapu vAhanamaina baMgAru SEshuDu - chuTTu chuTTukonina miMchula SEshuDu
naTTukonna reMDuvElu nAlukala SEshuDu - neTTana hari(bogaDa nErupari SEshuDu
kadisi panulakella gAchukunna SEshuDu - modala dEvatalellA mokkE SEshuDu
ade SrIvEMkaTapati nalamElumaMgakunu -padaraka yEpoddU pAnupaina SEshuDu
2) Balakrishnaprasad
No comments:
Post a Comment