Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, July 15, 2010

710.koMDavaMTi dEvuDu nEgolichE dEvuDu - కొండవంటి దేవుడు నేగొలిచే దేవుడు వీడే



Audio link : Smitha Madhav, ragamalika
4-496
కొండవంటి దేవుడు నేగొలిచే దేవుడు వీడే నిండుకున్నాడు తలచు నెమ్మదినోమనసా నన్నుఁ బుట్టించే దేవుడు నాలోనున్నాడు దేవుడు కన్నచోటులనే వుండే కాచే దేవుడు వెన్నతోఁబెంచే దేవుడు వివేకమిచ్చే దేవుడు యెన్నని పొగడవచ్చు యీతడే మా దేవుడు సిరులిచ్చిన దేవుడు సేవగొనేటి దేవుడు గురుడై బోధించి చేకొన్న దేవుడు మరిగించిన దేవుడు మాటలాడించే దేవుడు ఇరవై మాయింటనున్నాడీ దేవుడు దాపుదండైన దేవుడు దరిచేర్చిన దేవుడు రూపు చూపె నిదివో బోరున దేవుడు శ్రీపతియైన దేవుడు శ్రీవేంకటాద్రి దేవుడు చేపట్టి మమ్మేలినాడు చేచేతనే దేవుడు koMDavaMTi dEvuDu nEgolichE dEvuDu vIDE niMDukunnADu talachu nemmadinOmanasA nannu@M buTTiMchE dEvuDu nAlOnunnADu dEvuDu kannachOTulanE vuMDE kAchE dEvuDu vennatO@MbeMchE dEvuDu vivEkamichchE dEvuDu yennani pogaDavachchu yItaDE mA dEvuDu sirulichchina dEvuDu sEvagonETi dEvuDu guruDai bOdhiMchi chEkonna dEvuDu marigiMchina dEvuDu mATalADiMchE dEvuDu iravai mAyiMTanunnADIdEvuDu
dApudaMDaina dEvuDu darichErchina dEvuDu rUpu chUpe nidivO bOruna dEvuDu SrIpatiyaina dEvuDu SrIvEMkaTAdri dEvuDu chEpaTTi mammElinADu chEchEtanE dEvuDu

Monday, July 12, 2010

709.mechchula daMpatulAra mIrE gati - మెచ్చుల దంపతులార మీరే గతి

మెచ్చుల దంపతులార మీరే గతి మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీచేతలు తమ్మిలోని మగువా వో ధరణీధరుడా మిమ్మునే నమ్మితి నాకు మీరే గతి నెమ్మది వో యిందిరా నీరజలోచనుడా కమ్మి యేపొద్దును మీరే కలరు నాపాలను పాలజలధి కూతుర భక్తవత్సలుడ హరి మేలిచ్చి రక్షించ నాకు మీరే గతి కేలి నో శ్రీమహాలక్ష్మి కేశవ దయానిధి తాలిమి మీరే నాకు దాపు దండ యెపుడు చెన్నగు రమాకాంత చెందిన వో మాధవ మిన్నక యేపొద్దు మాకు మీరేగతి చిన్ని యలమేలుమంగ శ్రీవేంకటేశుడా యెన్నికె కెక్కించి నన్ను నేలుకొంటి రిదిగో mechchula daMpatulAra mIrE gati mechchiti ninniTa mimmu merase mIchEtalu tammilOni maguvA vO dharaNIdharuDA mimmunE nammiti nAku mIrE gati nemmadi vO yiMdirA nIrajalOchanuDA kammi yEpoddunu mIrE kalaru nApAlanu pAlajaladhi kUtura bhaktavatsaluDa hari mElichchi rakshiMcha nAku mIrE gati kEli nO SrImahAlakshmi kESava dayAnidhi tAlimi mIrE nAku dApu daMDa yepuDu chennagu ramAkAMta cheMdina vO mAdhava minnaka yEpoddu mAku mIrEgati chinni yalamElumaMga SrIvEMkaTESuDA yennike kekkiMchi nannu nElukoMTi ridigO

Saturday, July 10, 2010

708.iMtaTi daivamu lEDu - ఇంతటి దైవము లేడు


Audio link : Smitha Madhav in mohanakalyani ragam 3-411 ఇంతటి దైవము లేడు ఎందుఁ జెప్పి చూపగ వంతులకుఁ గొలిచేటి వారి భాగ్యమికను గక్కన మన్మథునిఁ గన్న తండ్రిగనక యెక్కువ చక్కదనాల కితడే దొడ్డ నిక్కపు సూర్యచంద్రాగ్ని నేత్రుడుగనక దిక్కుల కాంతుల నీదేవుడే దొడ్డ అంచెల లక్ష్మికి మగడైనాడు గనక యెంచరాని సంపదల కితడే దొడ్డ పంచిన చోట చక్రము పంపుచేసీఁగనక మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ దైవికపు పురుషోత్తముడితడు గనక దేవతలకెల్లా నీదేవుడే దొడ్డ వావాత శ్రీవేంకటాద్రి వరము లిచ్చీగనక యేవల దాతలలోన నితడే దొడ్డ iMtaTi daivamu lEDu eMdu@M jeppi chUpaga vaMtulaku@M golichETi vAri bhAgyamikanu gakkana manmathuni@M ganna taMDriganaka yekkuva chakkadanAla kitaDE doDDa nikkapu sUryachaMdrAgni nEtruDuganaka dikkula kAMtula nIdEvuDE doDDa aMchela lakshmiki magaDainADu ganaka yeMcharAni saMpadala kitaDE doDDa paMchina chOTa chakramu paMpuchEsI@Mganaka miMchina pratApAna mikkilini doDDa daivikapu purushOttamuDitaDu ganaka dEvatalakellA nIdEvuDE doDDa vAvAta SrIvEMkaTAdri varamu lichchIganaka yEvala dAtalalOna nitaDE doDDa

Tuesday, July 06, 2010

707.kosaranEla nA guNamulivi - కొసరనేల నా గుణములివి


Audio link : Smitha Madhav, in Hindolam. కొసరనేల నా గుణములివి రసికత నీ విన్నిటా రక్షించుకొనుమా|| నేరమి నాది నేరుపునీదే దూరు నాది బంధుడవు నీవు కోరుదు నేను కొమ్మని యిత్తువు కారుణ్యాత్మక గతి నీవు సుమా || నేను యాచకుడ నీవే దాతవు దీనుడ నే బరదేవుడవు జ్ఞానరహితుడను సర్వజ్ఞనిధివి శ్రీనిధి యిక ననుజేరి కావుమా || అరయ నే జీవుడ నంతర్యామివి యిరవుగ దాసుడ నేలికవు చిరజీవిని నే శ్రీ వేంకటపతివి వరదుడ నను జేవదలకుమా || kosaranEla nA guNamulivi rasikata nI vinniTA rakshiMchukonumA || nErami nAdi nErupunIdE dUru nAdi baMdhuDavu nIvu kOrudu nEnu kommani yittuvu kAruNyAtmaka gati nIvu sumA || nEnu yAchakuDa nIvE dAtavu dInuDa nE baradEvuDavu j~nAnarahituDanu sarvaj~nanidhivi SrInidhi yika nanujEri kAvumA || araya nE jIvuDa naMtryAmivi yiravuga dAsuDa nElikavu chirajIvini nE SrI vEMkaTapativi varaduDa nanu jEvadalakumA ||

Thursday, July 01, 2010

706.saMsAramE mElu sakalajanulakunu - సంసారమే మేలు సకలజనులకును



సంసారమే మేలు సకలజనులకును కంసాంతకుని భక్తి గలిగితే మేలు వినయపు మాటల విద్య సాధించితే మేలు తనిసి యప్పుల లోన దాగకుంటే మేలు మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు వెనుకొన్న కోపము విడిచితే మేలు కోరి వొకరినడిగి కొంచపడకుంటే మేలు సారె సారె జీవులను చంపకుంటే మేలు భారపుటిడుమలను పడకుండితే మేలు కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు పరకాంతల భంగపరచకుంటె మేలు దొరకొని కెళవుల దొక్కకుంటే మేలు అరుదైన శ్రీవేంకటాద్రి విభుని గొల్చి యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు
saMsAramE mElu sakalajanulaku
kaMsAMtakuni bhakti galigitE mElu
vinayapu mATala vidya sAdhiMchitE mElu
tanisi yappula lOna dAgakuMTE mElu
munupanE bhUmi dannu mOchi diMchakuMTE mElu
venukonna kOpamu viDichitE mElu
kOri vokarinaDigi koMchapaDakuMTE mElu
sAre sAre jIvulanu chaMpakuMTE mElu
bhArapuTiDumalanu paDakuMDitE mElu
kAriMchi tiTla koDigaTTakuMTE mElu
parakAMtala bhaMgaparachakuMTe mElu
dorakoni keLavula dokkakuMTE mElu
arudaina SrIvEMkaTAdri vibhuni golchi
yiravai niSchiMtuDaitE ninniTAnu mElu

Sunday, June 27, 2010

705.dEva nI pakshapAtamO tirigE - దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో

3-422

 
Audio link : in raga sindubhairavi
దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా దివములు సరియే దినరాత్రులును సరే యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా భవములు సరియే ప్రాణములు సరియే భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే మునిగేటిజాతిబేధము లివేలయ్యా అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ చింతలు వేవేలైన సిలుగేలయ్యా యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా dEva nI pakshapAtamO tirigE lOkula veltO SrIvibhuDa nIvEkAdA chittamulOnayyA divamulu sariyE dinarAtrulunu sarE yivala sukhadu@hkhAlu hechchukuMdulElayyA bhavamulu sariyE prANamulu sariyE bhuvi puNyapApamula bhOgamu vErElayyA vini kiMdiri kokaTE vishayAlu nokarItE munigETijAtibEdhamu livElayyA anayamu@M jUpokkaTE Akaliyu nokaTE penagETi guNamulu pekkujADa lElayyA
aMtarAtma nIvokkaDa vanniTA SrIvEMkaTESa chiMtalu vEvElaina silugElayyA yiMtasEsI nImAya liMdukE nISaraNaMTE kAMtuDa nanniMdukE kAchitivi nEDayyA

Sunday, June 20, 2010

704.vedakavO chittamA vivEkiMchi nIvu - వెదకవో చిత్తమా వివేకించి నీవు


Audio link : Smitha Madhav , album : nandakam
3-415 వెదకవో చిత్తమా వివేకించి నీవు అదన తదియ్య సేవ అంతకంటే మేలు చూపులెన్నైనా గలవు సూర్యమండలముదాకా చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని తీపులెన్నైనా గలవు తినదిన నాలికెకు తీపు శ్రీహరిపదార్ధమని కోరదు మాటలెన్నైనా గలవు మరిగితే లోకమందు మాటలు శ్రీహరినామము మరపగ్ వలె తేటలెన్నైనా గలవు తీరని చదువులందు తేటగా రామానుజులు తేరిచె వేదములలో చేట లెన్నైనా గలవు సేసేమంటే భూమి చేతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను వ్రాతలెన్నైనా గలవు వనజభవునిముద్ర వ్రాతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు vedakavO chittamA vivEkiMchi nIvu adana tadiyya sEva aMtakaMTE mElu chUpulennainA galavu sUryamaMDalamudAkA chUpulu SrIharirUpu chUDa dorakadu gAni tIpulennainA galavu tinadina nAlikeku tIpu SrIharipadArdhamani kOradu mATalennainA galavu marigitE lOkamaMdu mATalu SrIharinAmamu marapaga vale tETalennainA galavu tIrani chaduvulaMdu tETagA rAmAnujulu tEriche vEdamulalO chETa lennainA galavu sEsEmaMTE bhUmi chEtala SrIvEMkaTESu sEva sEyavalenu vrAtalennainA galavu vanajabhavunimudra vrAtalu chakrAMkitAle vahikekkE mudralu

Friday, June 11, 2010

Annamayya Padamandakini - అన్నమయ్య పదమందాకిని


Sujana Ranjani released an album of 108 annamacharya kirtanas composed in 108 different ragas by Sri SattiRaju Venumadhav. The below play list consists of 6 of them, For the book & CD please contact Sitarama Sarma garu (seetaramasarma@gmail.com)



Powered by eSnips.com

Monday, June 07, 2010

703.mariyeMdU gatilEdu manupa - మరియెందూ గతిలేదు మనుప


మరియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు జరసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు భవసాగరంబులోఁ బడి మునిగిననాకు తివిరి నీనామమనుతేపయే దిక్కు చివికి కర్మంబనెడి చిచ్చు చొచ్చిన నాకు జవళి నాచార్యుకృపాజలధియే దిక్కు ఘనమోహాపాశముల గాలిఁబొయ్యెడినాకు కొనల నీపాదచింతకొమ్మయే దిక్కు కనలి మనసనెడి యాకాసముననున్ననాకు కనుగొనగ నీదాస్య గరుడడే దిక్కు మరిగి సంసారమనెడి మంటికిందటి నాకు ధరభక్తియను బిలద్వారమె దిక్కు యిరవైన శ్రీవేంకటేశ యిన్నిటా నాకు - నరుదైన నీవంతరాత్మవే దిక్కు mariyeMdU gatilEdu manupa nIvE dikku jarasi lakshmISa nI SaraNamE dikku bhavasAgaraMbulO@M baDi muniginanAku tiviri nInAmamanutEpayE dikku chiviki karmaMbaneDi chichchu chochchina nAku javaLi nAchAryukRpAjaladhiyE dikku ghanamOhApASamula gAli@MboyyeDinAku konala nIpAdachiMtakommayE dikku kanali manasaneDi yAkAsamunanunnanaku kanugonaga nIdAsya garuDaDE dikku marigi saMsAramaneDi maMTikiMdaTi nAku dharabhaktiyanu biladwArame dikku yiravaina SrIvEMkaTESa yinniTA nAku - narudaina nIvaMtarAtmavE dikku

Saturday, June 05, 2010

702.OhOhO yaranrO pAri - ఓహోహో యనరో పారి


ఓహోహో యనరో పారి సాహసాన తిరుగరో పారి కోనేటిరాయడు కోరి నిద్రించీ వాడే ఆనకమై జాలీయరో ఆడుబారీ పేనిపట్టి వాకిళ్ళా బీగముద్రలాయ నిడి కానిమ్మని వాయించరో గంట పారి తిరుపణి మణగెను తిరుగరా దెవ్వరికి మరల నెలుగియ్యరో మగపారి పరగ దేవతలెల్ల బడకెళ మున్నారు యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి శ్రీవేంకటేశ్వరుడు చిత్తగించీ లోననిదె కోవర మెన్నికరో కోటిపారి ఆవల బంగారు గుదియలు ఘల్లు రనగా తావుల హనుమంతుని తలారి పారి OhOhO yanarO pAri sAhasAna tirugarO pAri kOnETirAyaDu kOri nidriMchI vADE Anakamai jAlIyarO ADubArI pEnipaTTi vAkiLLA bIgamudralAya niDi kAnimmani vAyiMcharO gaMTa pAri tirupaNi maNagenu tirugarA devvariki marala nelugiyyarO magapAri paraga dEvatalella baDakeLa munnAru yiravAya sUryachaMdru leduru pAri SrIvEMkaTESwaruDu chittagiMchI lOnanide kOvara mennikarO kOTipAri Avala baMgAru gudiyalu ghallu ranagA tAvula hanumaMtuni talAri pAri

note : the lyrics in audio is quite different from that in book, but very similar. I am not able to find the exact lyric in the TTD books.