709.mechchula daMpatulAra mIrE gati - మెచ్చుల దంపతులార మీరే గతి
మెచ్చుల దంపతులార మీరే గతి
మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీచేతలు
తమ్మిలోని మగువా వో ధరణీధరుడా
మిమ్మునే నమ్మితి నాకు మీరే గతి
నెమ్మది వో యిందిరా నీరజలోచనుడా
కమ్మి యేపొద్దును మీరే కలరు నాపాలను
పాలజలధి కూతుర భక్తవత్సలుడ హరి
మేలిచ్చి రక్షించ నాకు మీరే గతి
కేలి నో శ్రీమహాలక్ష్మి కేశవ దయానిధి
తాలిమి మీరే నాకు దాపు దండ యెపుడు
చెన్నగు రమాకాంత చెందిన వో మాధవ
మిన్నక యేపొద్దు మాకు మీరేగతి
చిన్ని యలమేలుమంగ శ్రీవేంకటేశుడా
యెన్నికె కెక్కించి నన్ను నేలుకొంటి రిదిగో
mechchula daMpatulAra mIrE gati
mechchiti ninniTa mimmu merase mIchEtalu
tammilOni maguvA vO dharaNIdharuDA
mimmunE nammiti nAku mIrE gati
nemmadi vO yiMdirA nIrajalOchanuDA
kammi yEpoddunu mIrE kalaru nApAlanu
pAlajaladhi kUtura bhaktavatsaluDa hari
mElichchi rakshiMcha nAku mIrE gati
kEli nO SrImahAlakshmi kESava dayAnidhi
tAlimi mIrE nAku dApu daMDa yepuDu
chennagu ramAkAMta cheMdina vO mAdhava
minnaka yEpoddu mAku mIrEgati
chinni yalamElumaMga SrIvEMkaTESuDA
yennike kekkiMchi nannu nElukoMTi ridigO
No comments:
Post a Comment