Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, February 25, 2007

138.eMta vibhavamu - ఎంత విభవము


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Ragam : Sudhdhasaveri, Composer : G.Balakrishnaprasad

ఎంత విభవము కలిగె నంతయును నాపదని | చింతించినది కదా చెడని జీవనము ||

చలము కోపంబు తను చంపేటి పగతులని | తెలిసినది యది కదా తెలివి ||
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని | తొలగినది యది కదా తుదగన్నఫలము ||

మెఱయు విషయములే తన మెడనున్న వురులుగా | యెరిగినది యది కదా యెరుక ||
పఱివోని ఆస తను బుట్టుకొను భూతమని | వెరచినది యది కదా విజ్ఞాన మహిమ ||

యెనలేని తిరువేంకటేశుడే దైవమని | వినగలిగినది గదా వినికి||
అనయంబు నతని సేవానందపరులయి |మనగలిగినది గదా మనుజులకు మనికి ||


in english:
eMta vibhavamu kalige naMtayunu nApadani |chiMtimchinadi kadA cheDani jIvanamu ||

chalamu kOpambu tanu chaMpETi pagatulani |telisinadi yadi kadA telivi
talakonna paraniMda tanapAli mRtyuvani |tolaginadi yadi kadA tudagannaphalamu ||

me~rayu vishayamulE tana meDanunna vurulugA|yeriginadi yadi kadA yeruka
pa~rivOni Asa tanu buTTukonu bhUtamani |veracinadi yadi kadA vij~nAna mahima ||

yenalEni tiruvEMkaTESuDE daivamani |vinagaliginadi gadA viniki
anayaMbu natani sEvAnaMdaparulayi |managaliginadi gadA manujulaku maniki ||

లోకంలో సర్వసాధారణంగా మానవులు సంపదలపై మోహం పెంచుకుని, అవి వృద్ధి చెందుతున్నప్పుడు వాటిని చూసి గర్వపడతారు; మరియు అహంకారంతో విర్రవీగుతారు. కాని ఇక్కడ అన్నమయ్య ఆ మాయాసిరులన్నీ మన మెడలకు తగులుకొన్న ఉరిత్రాళ్ళుగా వర్ణిస్తున్నారు. మనకు లభించే భౌతిక భోగాలన్నీ అశాశ్వతాలనీ, ఆపదలకు మూలాలనీ తెలుసుకొనటమే నిజమైన జీవితం, అనీ, సత్యదృష్టి అనీ ఈ పాటలో చక్కగా తెలియజేస్తున్నాడు! అరిషడ్వర్గాలను విడిచిపెట్టాలని, పరనింద చేయరాదని, విషయ వాంఛలను విడనాడాలని, ఆశలను ఆమడదూరంలో పెట్టాలని బోధిస్తున్నాడు! వీటన్నిటి యదార్ధ స్వరుపం తెలుసుకున్నవాడు విజ్ఞాని అని, నొక్కి వక్కాణిస్తున్నాడు! తిరుగులేని తిరువేంకటేశ్వరుడు శాశ్వత సత్యమని, దైవమని తెలుసుకొని నిరంతరం ఆ స్వామి సేవలో తరించాలని ఉద్భోధిస్తున్నాడుు మన గురువు అన్నమయ్య!
GB. Sankara Rao gari vivarana from sujanaranjani , siliconandhra.org

విభవము = సంపద;
చలము = మాత్సర్యము;
పగతులు = శత్రువులు
తలకొన్న = కలిగిన;
తుదగన్న ఫలము = పరమావధి నొందిన ఫలము;
విషయములు = శబ్ద స్పర్శ రూపాదులు;
పఱివోని = చీలిపోని, తగ్గని
ఎనలేని = సాటిలేని;
అనయంబు = అత్యంతము, సతతము

3 comments:

rākeśvara said...

విజ్ఞాన మహిమ సరిఁజేయండి

rākeśvara said...

పఱివోని ఆశ

Sravan Kumar DVN said...

Thanks for correction. i have done the first one.

ఆశ కి ఆస వికృతి అనుకుంటా, పుస్తకం చూసి సరిచేస్తాను