Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, June 28, 2009

626.ekkaDi narakamu ekkaDimRutyuvu - ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు



Audio link : composed and sung by Nukala chinasatyanarayana , in Mohana ragam.
ప ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి

చ తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే యమ కింకర భయము లణగి పోయె
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే అమర కాలదండము లవియెల్ల బొలిసె

చ మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే ఘన యామ్య మార్గము కట్టువడియె
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె

చ యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే-
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ అడరి వైకుంఠము మా యరచేత నిలిచె
pa ekkaDi narakamu ekkaDimRutyuvu mAku dakki nIdivya nAmAmRutamu cUragoMTimi

ca tamitO SrIpati dAsula cErinappuDE yama kiMkara Bayamu laNagi pOye
jamaLi nI yAyudha lAMCanamu mOcinappuDE amara kAladaMDamu laviyella bolise

ca munu nI nagaritrOva mogamaina yappuDE Gana yAmya mArgamu kaTTuvaDiye
onara nI tirupati nokarAtri vunnapuDE kanalu kAlasUtrAdi GAtalella pUDe

ca yeDarai nImaMtrajapamu yeMcukonna yapuDE kaDu citraguptuni lekkaluga cE-
vaDigA vEMkaTESvara mISaraNamanaga aDari vaikuMThamu mA yaracEta nilice

Thursday, June 25, 2009

625.namAmyahaM mAnavasiMhaM - నమామ్యహం మానవసింహం



ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||

చ|| దానవదైత్య విదారణ సింహం | నానాయుధకర నరసింహం |
భూనభోంతరాళ పూరిత సింహం | ఆనన వహ్నిలయాంతక సింహం ||

చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖరముఖ ఘోషిత సింహం | తిలకిత బహు రవిదీపిత సింహం ||

చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయసింహం |
కాంతం శ్రీవేంకటగిరి సింహం | చింతిత ఘన సంసిద్ధ నృసింహం ||


pa|| namAmyahaM mAnavasiMhaM | pramadAMka mahObala narasiMhaM ||

ca|| dAnavadaitya vidAraNa siMhaM | nAnAyudhakara narasiMhaM |
BUnaBOMtarALa pUrita siMhaM | Anana vahnilayAMtaka siMhaM ||

ca|| praLaya nRusiMhaM bahumuKa siMhaM | salalita garuDAcala siMhaM |
kuliSa naKaramuKa GOShita siMhaM | tilakita bahu ravidIpita siMhaM ||


ca|| SAMta nRusiMhaM Saurya nRusiMhaM | saMtata karuNA jayasiMhaM |
kAMtaM SrIvEMkaTagiri siMhaM | ciMtita Gana saMsiddha nRusiMhaM ||

Saturday, June 20, 2009

624.mokkarE mokkarE mIru - మొక్కరే మొక్కరే మీరు




album name : Divyasimham namami (SACRED creations)
to purchase contact : tp.chakrapani@gmail.com

మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయలిడి
దక్కి శ్రీవేంకటేశుడే తానైన దేవుడికి

కరములు వేయవే కరములును భయం -
కరనఖాయుధములు కడలేవవే
సిరి తొడపైనదే సింహపునెమ్మోమదె
నరరూపసగమదె నరసింహునికి

వంకరకోరలవే వజ్రపుదంతములవె
సంకుమ చక్రము నిరువంకలా నవె
జంకెల నేత్రము లవె జడలు మూపున నవె
అంకె నభయ హస్తము నదె నరహరికి

నిక్కిలి కర్ణము లవె నీలిమచ్చపురమదె
చుక్కలమొలపూసల నొక్కరూపదె
తొక్కినపాపము లవె తోడనే శ్రీవెంకటాద్రి
పక్కెర నరసింహపు ప్రళయసింహునికి


mokkarE mokkarE mIru muMdu muMdE jayaliDi
dakki SrIvEMkaTESuDE tAnaina dEvuDiki

karamulu vEyavE karamulunu bhayaM -
karanakhAyudhamulu kaDalEvavE
siri toDapainadE siMhapunemmOmade
nararUpasagamade narasiMhuniki

vaMkarakOralavE vajrapudaMtamulave
saMkuma chakramu niruvaMkalA nave
jaMkela nEtramu lave jaDalu mUpuna nave
aMke nabhaya hastamu nade narahariki

nikkili karNamu lave nIlimachchapuramade
chukkalamolapUsala nokkarUpade
tokkinapApamu lave tODanE SrIveMkaTAdri
pakkera narasiMhapu praLayasiMhuniki

Tuesday, June 16, 2009

623.viduruni viMdA vijayIbhava - విదురుని విందా విజయీభవ



Audio link , PS Ranganath
విదురుని విందా విజయీభవ
హృదయేశ్వర విజయీభవ

దైవశిఖామణి దానవమర్దన
వేవేలకు నీకు విజయీభవ
శ్రీ(వ)ల్లభగుణ చింతాసాగర
యీవలనిదె విజయీభవ

జగదేకవిభుడ శతమఖవందిత
వెగటు విజయముల విజయీభవ
నిగమవినుత సర్వనిలయ నారాయణ
యిగిరించె కృప విజయీభవ

జలధిమధన సర్వజంతువిహారక
వెలసె నీ మహిమలు విజయీభవ
కలిత శ్రీవేంకట కామితవరద నిత్య
యిలధర నీకు విజయీభవ


viduruni viMdA vijayIbhava
hRdayESwara vijayIbhava

daivaSikhAmaNi dAnavamardana
vEvElaku nIku vijayIbhava
SrI(va)llabhaguNa chiMtAsAgara
yIvalanide vijayIbhava

jagadEkavibhuDa SatamakhavaMdita
vegaTu vijayamula vijayIbhava
nigamavinuta sarwanilaya nArAyaNa
yigiriMche kRpa vijayIbhava

jaladhimadhana sarwajaMtuvihAraka
velase nI mahimalu vijayIbhava
kalita SrIvEMkaTa kAmitavarada nitya
yiladhara nIku vijayIbhava

Tuesday, June 09, 2009

622.vasudhajUDa pinnavAnivalenunnavADu - వసుధజూడ పిన్నవానివలెనున్నవాడు


Audio link :
వసుధజూడ పిన్నవానివలెనున్నవాడు
వెస నన్నివిద్యలాను వెలసె విట్ఠలుడు
..
పరగ నేడునూటదెబ్బదియేడుగురిచేత-
నిరవై పాడించుకున్నాడీ విట్ఠలుడు
సరస నైదులక్షలిండ్ల జవ్వనపుగొల్లెతల
మరిగించుకొన్నవాడు మరియీ విట్ఠలుడు
...
బత్తితోడ తనమీదిపాటలు వాడితేను
యిత్తల మోమై తిరిగె విట్ఠలుడు
హత్తి తన్నొల్లక పోగా నందరి మేడ దేవళ్ళ
యెత్తి పాదాలందు జూపె నితడే విట్ఠలుడు
..
గట్టిగా పుండరీకుడు కడువేడుకఁ బెట్టిన
యిట్టిక పీటపై నున్నాడీ విట్ఠలుడు
అట్టితానే శ్రీవేంకటాద్రి పాండురంగమున
యెట్టు గొల్చినా వరము లిచ్చీ విట్ఠలుడు

...

vasudhajUDa pinnavAnivalenunnavADu
vesa nannividyalAnu velase viTThaluDu
..
paraga nEDunUTadebbadiyEDugurichEta-
niravai pADiMchukunnADI viTThaluDu
sarasa naidulakshaliMDla javvanapugolletala
marigiMchukonnavADu mariyI viTThaluDu
...
battitODa tanamIdipATalu vA(pA)DitEnu
yittala mOmai tirige viTThaluDu
hatti tannollaka pOgA naMdari mEDa dEvaLLa
yetti pAdAlaMdu jUpe nitaDE viTThaluDu
...
gaTTigA puMDarIkuDu kaDuvEDuka@M beTTina
yiTTika pITapai nunnADI viTThaluDu
aTTitAnE SrIvEMkaTAdri pAMDuraMgamuna
yeTTu golchinA varamu lichchI viTThaluDu


Friday, June 05, 2009

621.mAnarA navvu mAnarA vaddu - మానరా నవ్వు మానరా వద్దు




మానరా నవ్వు మానరా వద్దు మానరా
మాతో మానరా యేల మానరా నీవు
మానకుంటే నిన్ను నిందరు వినగా
మాటలదిట్టక మానరా

వారివీరితోడ వావులు చెప్పంపే వట్టిదోసమేల కట్టేవురా
తేరకొన నన్నుజూచి వట్టియాస - దేర నుస్సురనేటి కి రా
పోరిపోరి నీవే నిజమరి నంటా బొంకుచు నన్నేల ముట్టేవురా
కోరి వూరకున్న వారి కింతేసి - కొడిమె లేటికి వచ్చీరా

చక్కని వారికి నీయెదుట సారెనిలువదటరా
వొక్కమాటలోనే నీవింత గరగి వొళ్ళు చెమరించనేటికిరా
చిక్కనిచన్నులు నాకుగలిగితే చింతబొరలగ నీకేలరా
మొక్కలాన నీవుసేసేరోతలకు మొదలనే నాకు సిగ్గవురా

కారణము లేక ఊరివారితోడ కాలుదొక్కనేల వచ్చేవురా
నీరువంక తుంగవంటివాడవింతే నీతోడిపొందుకు నేనోపరా
కూరిమితోడుత శ్రీవేంకటేశ్వరా కూడితివి నిన్ను నేమందురా
కోరినకోరికలెల్లా తలకూడె గోరనన్ను నూఁదనేటికిరా


mAnarA navvu mAnarA vaddu mAnarA
mAtO mAnarA yEla mAnarA nIvu
mAnakuMTE ninnu niMdaru vinagA
mATaladiTTaka mAnarA

vArivIritODa vAvulu cheppaMpE vaTTidOsamEla kaTTEvurA
tErakona nannujUchi vaTTiyAsa - dEra nussuranETi ki rA
pOripOri nIvE nijamari naMTA boMkuchu nannEla muTTEvurA
kOri vUrakunna vAri kiMtEsi - koDime lETiki vachchIrA

chakkani vAriki nIyeduTa sAreniluvadaTarA
vokkamATalOnE nIviMta garagi voLLu chemariMchanETikirA
chikkanichannulu nAkugaligitE chiMtaboralaga nIkElarA
mokkalAna nIvusEsErOtalaku modalanE nAku siggavurA

kAraNamu lEka UrivAritODa kAludokkanEla vachchEvurA
nIruvaMka tuMgavaMTivADaviMtE nItODipoMduku nEnOparA
kUrimitODuta SrIvEMkaTESwarA kUDitivi ninnu nEmaMdurA
kOrinakOrikalellA talakUDe gOranannu nU@MdanETikirA

Sunday, May 31, 2009

620.jIvAtumai yuMDu chilukA - జీవాతుమై యుండు చిలుకా





జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయమున నుండి నా-చేతనే పెరిగిన చిలుకా
జాతిగా కర్మపు సంకెళ్ళ బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా

భాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంబురెక్కలచాటున నుండి సీతుకోరువ లేని చిలుకా

బెదరి అయిదుగిరికిని భీతి పొందుచు కడు జెదరగ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిగాక ఆడిచి(అదిరి)పడుదువే నీవు చిలుకా

వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు- వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నా తోగూడి మెలగిన చిలుకా

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనైయుందు చిలుకా
శ్రీవెంకటాద్రి పై చిత్తములో నుండి సేవించుకొని గట్టి చిలుకా

దైవమానుషములు తలపించి యెపుడు నా -తలపునఁబాయని చిలుకా
యేవియును నిజముగా విని యేటికవి నాకు నెఱిగించి నటువంటి చిలుకా


jIvAtumai yuMDu chilukA nI-vAvaliki paramAtmuDai yuMDu chilukA

AtumapaMjaramulOna nayamuna nuMDi nA- chEtanE perigina chilukA
jAtigA karmapu saMkeLLa baDi kAla@M jEta@M bEdaitivE chilukA

bhAtigA chaduvulu pagalurElunu nA chEta nErichinaTTi chilukA
rItigA dEhaMburekkalachATuna nuMDi sItukOruva lEni chilukA

bedari ayidugirikini bhIti poMduchu kaDu jedaraga jUtuvE chilukA
adayulayyina SatrulArugurikigAka ADichi(adiri)paDuduvE nIvu chilukA

vadalakiTu yAhAravAMCha naTu padivElu- vadarulu vadarETi chilukA
tudalEni mamatalu tOrammu sEsi nA tOgUDi melagina chilukA

nIvana nevvaru nEnana nevvaru nIvE nEnaiyuMdu chilukA
SrIveMkaTAdri pai chittamulO nuMDi sEviMchukoni gaTTi chilukA

daivamAnushamulu talapiMchi yepuDu nA - talapuna@MbAyani chilukA
yEviyunu nijamugA vini yETikavi nAku ne~rigiMchi naTuvaMTi chilukA

Friday, May 29, 2009

619. unnamATa lika nEla - ఉన్నమాట లిక నేల




ప : ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను


చ : కొంత నా కర్మఫలము కొంత నీ రక్ష కత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంత గాచుట నీపని సేవసేయ నాపని

చ : నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు

చ : మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యికను


pa : unnamATa lika nEla vO dEvA
yennaTi kidEmATa yiMkA niMkAnu


ca : koMta nA karmaPalamu koMta nI rakSha katwamu
yiMtalO reMDu galavA yEmO dEvA
aMtaryAmivi nIvu ADETibommanu nEnu
ceMta gAcuTa nIpani sEvasEya nApani

ca : nE naparAdhi nayyEdi nIvu vahiMcu konEdi
yI nepAlu reMDU nEla yEmO dEvA
mAnaka yiTlayitE nI mahimaku gurutEdi
Ani ciMtiMcE naMdula kapakIrti yanucu

ca : medalE nA yadhamamu mI Ganata yeMci kAvu
yidiyE nA vinnapamu yEmO dEvA
yeduTa SrIvEMkaTESa yinniTA nI baMTu baMTa
padivElu nA nErAlu paTTakumI yikanu

Wednesday, May 27, 2009

618.maMtanAna nADEramma - మంతనాన నాడేరమ్మ



Audio link , composed and sung by TP Chakrapani raga: jhanjhuti
మంతనాన నాడేరమ్మ మధురలో యీసుద్దులు
వింతలాయ వినరమ్మ వీనుల పండుగలు

గక్కన కృష్ణుడు పుట్టె కంసుని మద మడగె
మొక్కిరి దేవతలెల్ల ముదమందుచు
చక్కగా జయంతి నేడు శ్రావణ బహుళాష్టమి
తక్కక దేవకి తల్లి తండ్రి వసుదేవుడు

యమున దాటి యట్టె యశోద యింట బెరిగి
జమళితో బలబద్ర సమేతుడై
సమమై చంద్రోదయము సమకూడె తోడతోడ
రమణ పువ్వులవాన రాసులుగా కురిసె


పనులెల్లా నీడేరే బ్రదికె లోకములెల్లా
నినుపులై ధర్మములు నెలకొనెను
వొనర నలమేల్మంగ నురమున నిడుకొని
ఘన శ్రీవేంకటేశుడై కందువ నిలిచెను


maMtanAna nADEramma madhuralO yIsuddulu
viMtalAya vinaramma vInula paMDugalu

gakkana kRShNuDu puTTe kaMsuni mada maDage
mokkiri dEvatalella mudamaMduchu
chakkagA jayaMti nEDu SrAvaNa bahuLAShTami
takkaka dEVaki talli taMDri vasudEvuDu

yamuna dATi yaTTe yaSOda yiMTa berigi
jamaLitO balabadra samEtuDai
samamai chaMdrOdayamu samakUDe tODatODa
ramaNa puvvulavAna rAsulugA kurise

panulellA nIDErE bradike lOkamulellA
ninupulai dharmamulu nelakonenu
vonara nalamElmaMga nuramuna niDukoni
ghana SrIvEMkaTESuDai kaMduva nilichenu

Sunday, May 24, 2009

617.arimuri hanumaMtuDu - అఱిముఱి హనుమంతుడు



Audio link : Kondaviti Jyotirmayi
అఱిముఱి హనుమంతుడు అట్టి బంటు
వెఱపులేని రఘువీరునికి బంటు

యేలికను దైవముగా నెంచి కొలెచేవాడే బంటు
తాలిమిగలిగినయాతడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాడే బంటు
వేళ గాచుకవుండేటి వెరవరే బంటు

తను మనోవంచన లెంతటా లేనివాడే బంటు
ధనముపట్టున శుధ్ధాత్మకుడే బంటు
అనిశము నెదురు మాటాడనివాడే బంటు
అనిమొన తిరుగనియతడే బంటు

చెప్పినట్లనే నడాచినయాతడే బంటు
తప్పులేక హితుడైనాతడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుడే బంటు


a~rimu~ri hanumaMtuDu aTTi baMTu
ve~rapulEni raghuvIruniki baMTu

yElikanu daivamugA neMchi kolechEvADE baMTu
tAlimigaliginayAtaDE baMTu
pAlumAlaka yEpoddu panisEyuvADE baMTu
vELa gAchukavuMDETi veravarE baMTu

tanu manOvaMchana leMtaTA lEnivADE baMTu
dhanamupaTTuna SudhdhAtmakuDE baMTu
aniSamu neduru mATADanivADE baMTu
animona tiruganiyataDE baMTu

cheppinaTlanE naDAchinayAtaDE baMTu
tappulEka hituDainAtaDE baMTu
meppiMchuka viSwAsAna melaguvADE baMTu
yeppuDunu drOhigAni hituDE baMTu