619. unnamATa lika nEla - ఉన్నమాట లిక నేల
ప : ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను
చ : కొంత నా కర్మఫలము కొంత నీ రక్ష కత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంత గాచుట నీపని సేవసేయ నాపని
చ : నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు
చ : మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యికను
pa : unnamATa lika nEla vO dEvA
yennaTi kidEmATa yiMkA niMkAnu
ca : koMta nA karmaPalamu koMta nI rakSha katwamu
yiMtalO reMDu galavA yEmO dEvA
aMtaryAmivi nIvu ADETibommanu nEnu
ceMta gAcuTa nIpani sEvasEya nApani
ca : nE naparAdhi nayyEdi nIvu vahiMcu konEdi
yI nepAlu reMDU nEla yEmO dEvA
mAnaka yiTlayitE nI mahimaku gurutEdi
Ani ciMtiMcE naMdula kapakIrti yanucu
ca : medalE nA yadhamamu mI Ganata yeMci kAvu
yidiyE nA vinnapamu yEmO dEvA
yeduTa SrIvEMkaTESa yinniTA nI baMTu baMTa
padivElu nA nErAlu paTTakumI yikanu
No comments:
Post a Comment