811.rAmA rAmA rAjIvanayanA - రామా రామా రాజీవనయనా
Archive/Audio link
రామా రామా రాజీవనయనా
కామించి నినుఁ జూచె గక్కన మా చెలియ
యింతి పిలువనంపె నెడమాటలేలా
యింతలో విచ్చేయు ఎన్నికగాక
చెంత నిందులకుగా సెలవి నవ్వేలా
పంతముతో నాకెఁ బాలింతు గాక
తరుణి పూవులు వేసె తలవంచనేలా
సరి నీవు మోహమే చల్లుదుగాక
నిరతి నిందుకుగా నివ్వెరగేలా
మరిగి యాకెను నీవే మన్నింతుగాక
మగువ కాగిటఁ గూడె మరి సిగ్గులేలా
వెగటు రతుల విఱ్రవీగుదుగాక
వగల శ్రీవేంకటేశ వావిలిపాటి రామ
మిగుల సీతతో మెఱతువుగాక
rAmA rAmA rAjIvanayanA
kAmiMchi ninu@M jUche gakkana mA cheliya
yiMti piluvanaMpe neDamATalElA
yiMtalO vichchEyu ennikagAka
cheMta niMdulakugA selavi navvElA
paMtamutO nAke@M bAliMtu gAka
taruNi pUvulu vEse talavaMchanElA
sari nIvu mOhamE challudugAka
nirati niMdukugA nivveragElA
marigi yAkenu nIvE manniMtugAka
maguva kAgiTa@M gUDe mari siggulElA
vegaTu ratula vi~rravIgudugAka
vagala SrIvEMkaTESa vAvilipATi rAma
migula sItatO me~ratuvugAka
No comments:
Post a Comment