Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, March 04, 2014

810.anniTAnu jANakatte vaitivE nIvu - అన్నిటాను జాణకత్తె వైతివే నీవు

Archive link : Balakrishnaprasad
అన్నిటాను జాణకత్తె వైతివే నీవు
కిన్నెరమీటుల నెంత గిలిగించేవే

చెలువము లొకవంక చిరునవ్వు లొకవంకఁ

జిలుకుతా వల పెంత చిమ్మిరేచేవే
తలుపు మాటున నుండి తరితీపులెల్లాఁజేసి
చెలువుని యెదుట సిగ్గులెంతచూపేవే

పొదలుఁజూపుల కొంత బొమ్మజంకెనలఁ కొంత

సదరానఁ బతి నెంతసాదించేవే
వదలుఁబయ్యద చేత వన్నెలమోవిచేత
యెదురెదురనే యంత యెలయించేవే

చిప్పిలుఁజెమట తోడ శిరసువొంపులతోడ

ముప్పిరిఁదమక మెంతమూట గట్టేవే
యిప్పుడే శ్రీవేంకటేశుడేలె నలమేల్మంగవు 
కొప్పుజారె నింకా నెంత కొసరఁజూచేవే

anniTAnu jANakatte vaitivE nIvu
kinneramITula neMta giligiMchEvE

cheluvamu lokavaMka chirunavvu lokavaMka@M
jilukutA vala peMta chimmirEchEvE
talupu mATuna nuMDi taritIpulellA@MjEsi
cheluvuni yeduTa sigguleMtachUpEvE

podalu@MjUpula koMta bommajaMkenala@M koMta
sadarAna@M bati neMtasAdiMchEvE
vadalu@Mbayyada chEta vannelamOvichEta
yedureduranE yaMta yelayiMchEvE

chippilu@MjemaTa tODa SirasuvoMpulatODa
muppiri@Mdamaka meMtamUTa gaTTEvE
yippuDE SrIvEMkaTESuDEle nalamElmaMgavu 
koppujAre niMkA neMta kosara@MjUchEvE

No comments: