809. iTuvaMTi vEDukalu yide nIku@M galigenu - ఇటువంటి వేడుకలు యిదె నీకుఁ గలిగెను
Archive link : Balakrishnaprasad
ఇటువంటి వేడుకలు యిదె నీకుఁ గలిగెను
తటుకన వరమిచ్చి దయసేయవయ్య
కలికి చూపులు నీకు కలువలదండలాయ
సెలవినవ్వులు మంచి సేవం(మం)తులాయ
పిలిచిన యధరము పెనమంకెనపూవాయ
కొలది భారము నిండుఁ బూజలాయను
ముక్కు నిట్టూర్పులు నీకు మొనసి సంపెగలాయ
తక్కక చేసన్నలు తామరలాయ
చెక్కుమీది పులకలు చెలరేగి జాజులాయ
నెక్కొన్నె యీపె చందము నీకుఁ బూజలాయను
మచ్చిక నీపె కాగిలి మరువపు ననలాయ
కొచ్చి కాగిటి రతులు కురివేరాయ
యిచ్చట శ్రీవేంకటేశ యింతి నీవు గూడగాను
పచ్చిదేరి యిన్నిటాను బలు పూజలాయను
iTuvaMTi vEDukalu yide nIku@M galigenu
taTukana varamichchi dayasEyavayya
kaliki chUpulu nIku kaluvaladaMDalAya
selavinavvulu maMchi sEvaM(maM)tulAya
pilichina yadharamu penamaMkenapUvAya
koladi bhAramu niMDu@M bUjalAyanu
mukku niTTUrpulu nIku monasi saMpegalAya
takkaka chEsannalu tAmaralAya
chekkumIdi pulakalu chelarEgi jAjulAya
nekkonne yIpe chaMdamu nIku@M bUjalAyanu
machchika nIpe kAgili maruvapu nanalAya
kochchi kAgiTi ratulu kurivErAya
yichchaTa SrIvEMkaTESa yiMti nIvu gUDagAnu
pachchidEri yinniTAnu balu pUjalAyanu
No comments:
Post a Comment