820.komma nI chakka@Mdanamu kOTi sEsunu - కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును
Archive Audio link : G Anila kumar
కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును
ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే
సెలవి నవ్విన నవ్వు చెక్కిట బెట్టిన చెయ్యి
చెలి నీ మొగమునకు సింగారమాయ
తిలకించి చూచేచూపు తేనెగారేమోవిమాట
కలికితనాల కెల్లా కందువలై తోచెను
మొనచన్నులకదలు మొగిఁగమ్మలతళుకు
వనిత నీవయసుకు వన్నె వచ్చెను
పొనుగులేతసిగ్గులు బొమ్మముడిజంకెనలు
తనివోనియాసలకుఁ దగినగురుతులు
బలుపిరుదులసొంపు పాదపుమట్టెలరొద
అలమేల్మంగ నీరతి కడియాలము
లలి శ్రీవేంకటేశుఁ గలయు నీచేతులగోళ్ళ-
దలకొన్నరాకులు తారుకాణలు
komma nI chakka@Mdanamu kOTi sEsunu
immula nI pati bhAgya meMtani cheppEdE
selavi navvina navvu chekkiTa beTTina cheyyi
cheli nI mogamunaku siMgAramAya
tilakiMchi chUchEchUpu tEnegArEmOvimATa
kalikitanAla kellA kaMduvalai tOchenu
monachannulakadalu mogi@MgammalataLuku
vanita nIvayasuku vanne vachchenu
ponugulEtasiggulu bommamuDijaMkenalu
tanivOniyAsalaku@M daginagurutulu
balupirudulasoMpu pAdapumaTTelaroda
alamElmaMga nIrati kaDiyAlamu
lali SrIvEMkaTESu@M galayu nIchEtulagOLLa-
dalakonnarAkulu tArukANalu