Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, February 09, 2014

801. ArtuDanEnu nI kaDDa meMdunu - ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు


 
Youtube Link:

ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు
మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే

సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు
సర్వసర్వం సహా చక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే

పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు 
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుడ నన్ను సరిఁ గావవే

అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు
ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు

ArtuDanEnu nI kaDDa meMdunu lEdu
mUrti trayAtmaka mogi karuNiMchavE

sarwasAkshivi nIvu sarvAMtaraMguDavu
sarvasarvaM sahA chakravarti
nirvANamUrti nigamAMtakIrti
sarvAparAdhamulu kshamiyiMpavE

paramAtmuDavu nIvu paraMjyOtivi nIvu 
parama parAnaMda paramapurushA
karirAjavaradA kAruNyanilayA
SaraNAgatuDa nannu sari@M gAvavE

aNuvulOpali nIvu Adimahattunu nIvu
praNuta SrIvEMkaTaprachuranilayA
aNimAdivibhavA AdyaMtarahitA
gaNutiMchi nApAla@M galugavE nIvu

No comments: