Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, February 10, 2014

802.chadivi batukarO sarvajanulu meeru - చదివి బతుకరో సర్వజనులు మీరు


Archive page: Balakrishnaprasad
చదివి బతుకరో సర్వజనులు మీరు 
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||

సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు 

వేదవ్యాసులు చదివిన చదువు |
ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే ||

సతతము మునులెల్ల చదివినట్టిచదువు 

వెతదీర బ్రహ్మ చదివిన చదువు |
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు 
గతిగా నారాయణాష్టాక్షర మిదియే  ||

చలపట్టి దేవతులు చదివినట్టిచదువు 

వెలయ విప్రులు చదివేటి చదువు |
పలుమారు శ్రీ వేంకటపతి నామమై భువి 
కలుగు నారాయణాష్టాక్షర మిదియే  ||

chadivi batukarO sarvajanulu meeru 
kadisi naaraayaNaashTaakshara midiyae ||


saadhiMchi munnuSukuDu chadivinaTTichaduvu 
vaedavyaasulu chadivina chaduvu |
aadikaalapu vaishNavulaMdari nOTi chaduvu
gaadili naaraayaNaashTaakshara midiyae ||


satatamu munulella chadivinaTTichaduvu 
veta deera brahma chadivina chaduvu |
jatanamai prahlaaduDu chadivinaTTi chaduvu 
gatigaa naaraayaNaashTaakshara midiyae  ||

chalapaTTi daevatulu chadivinaTTichaduvu 
velayaa vipru lu chadivaeTi chaduvu |
palumaaru Sree vaeMkaTapati naamamai
bhuvi kalugu naaraayaNaashTaakshara midiyae  ||

No comments: