798.rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu - రాముడు లోకాభిరాముడు ఉదయించగాను
YouTube link : G.Balakrishnaprasad
రాముడు లోకాభిరాముడు ఉదయించగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను
తటుకున మారీచుతలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకున తెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయ దైత్యులకు మరి నూరూ నిండెను
తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖరదూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిగె నంతటను
పొరి కుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె
మరలి గండము దాకె మండోదరికి
పరగె(గి) నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీవేంకటేశుచేతలెల్లా దక్కెను
rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu
bhUmilO vAlmIkiki puNyamellA dakkenu
taTukuna mArIchutalapai@M bOya@M garmamu
kuTila SUrpanakha mukkuna@M baMDenu
paTukuna tege daityabhAmala meDatALLu
maTamAya daityulaku mari nUrU niMDenu
tarage rAvaNu pUrvatapamulayAyuShyamu
kharadUshaNAdulaku kAlamu dIre
garima laMkaku navagrahamulu bhEdiMche
sirula niMdrajittAku chinige naMtaTanu
pori kuMbhakarNuniki puTTinadinamu vachche
marali gaMDamu dAke maMDOdariki
parage(gi) nayOdhyaku bhAgyamulu phaliyiMche
chiramai SrIvEMkaTESuchEtalellA dakkenu
రాముడు లోకాభిరాముడు ఉదయించగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను
తటుకున మారీచుతలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకున తెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయ దైత్యులకు మరి నూరూ నిండెను
తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖరదూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిగె నంతటను
పొరి కుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె
మరలి గండము దాకె మండోదరికి
పరగె(గి) నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీవేంకటేశుచేతలెల్లా దక్కెను
rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu
bhUmilO vAlmIkiki puNyamellA dakkenu
taTukuna mArIchutalapai@M bOya@M garmamu
kuTila SUrpanakha mukkuna@M baMDenu
paTukuna tege daityabhAmala meDatALLu
maTamAya daityulaku mari nUrU niMDenu
tarage rAvaNu pUrvatapamulayAyuShyamu
kharadUshaNAdulaku kAlamu dIre
garima laMkaku navagrahamulu bhEdiMche
sirula niMdrajittAku chinige naMtaTanu
pori kuMbhakarNuniki puTTinadinamu vachche
marali gaMDamu dAke maMDOdariki
parage(gi) nayOdhyaku bhAgyamulu phaliyiMche
chiramai SrIvEMkaTESuchEtalellA dakkenu
1 comment:
ఇప్పుడిప్పుడే అన్నమయ్య పాటలు whatsapp ద్వారా జనబాహుళ్యం లోకి చేరుతున్నది. మీ శ్రమ అనిర్వచనీయము. చాల సంతోషము...
వేలమూరి శ్రీ విష్ణు
Post a Comment