Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword)
to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
Audio section under Maintanance
Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9
Audio link : (Temporary) అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు | ఎన్నికగా తుది పదమెక్కితిమి మేలు || కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు- | చెంది కొందరు అట్టే సంతసించినా మేలు | నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు | పొందుగా కొందరు నన్ను పొగడినా మేలు || కోరి నన్ను పెద్దసేసి కొందరు మొక్కినా మేలు | వేరె హీనుడని భావించినా మేలు | కూరిమి కొందరు నన్ను గూడుకుండినా మేలు | మేరతో విడిచి నన్ను మెచ్చుకున్నా మేలు || ఇప్పటికి గలపాటి యెంత పేదయినా మేలు | వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు | యెప్పుడు శ్రీవేంకటేశుకే నిచ్చిన జన్మమిది | తప్పు లేదాతనితోడి తగులమే మేలు ||
anniTaa naapaaliTiki hariyaataDae kalaDu | ennikagaa tudi padamekkitimi maelu ||
Youtube link:ragam:dESakshi [buy Full Version Here From the album "NeevuGaliginaChalu" , tuned and sung by Sri Sathiraju Venumadhav]
మదవికారములు మానేవో, నా యెదురనె నీవు నేడింకాఁజేసేవో నందవ్రజములోన నాడు నీవు గొల్ల మందల మగువల మరగించీనా మందులు మాయలు మఱచితివో, యిప్పు డిందూ నామీద నింకాఁ జేసేవో నలినాప్తకులుడవైనాడు నీవు ఇంతిం గలకాలమెల్ల నంగడిబెట్టినా మలినపు మాటలు మఱచితివో నన్ను నెలయించి కాకల నింకా నేసేవో(నేపేవొ?) నరసింహుడవై నాడు నీవు పెక్కు మురిపెంపు వికారములఁబోయినా తిరువేంకటేశ పొందితివి నన్ను నీ యిరవైన యీ చేత లింకాఁ జేసేవో
Audio link : Tuned & Sung by Sattiraju Venumadhav(to get a copy of album 'annamayya padamandakini' with 108 kirtanas in 108 raga composed by Sri Venumadhav, please contact sujana ranjani : seetaramasarma@gmail.com)
కానకుంటి మిందాకా కంటి మాడకుఁ బోదము కానీలే అందుకేమి కళవళ మేలయ్యా IIపల్లవిII తొంగి చూచెనదె సీత తూరుపునఁ దమ్ముఁడా సంగతి చందురుఁడింతె సతి గాదయ్యా చెంగట నే వెదకగాఁ జేరి నవ్వీఁ జూడరాదా రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా IIకానII పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత అంచెలఁ దీగె ఇంతే అటు గాదయ్యా యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా పెంచపు నెమలి గాని పిలుపు గాదయ్యా IIకానII నిలుచుండి చూచె నదె నిండుఁ గొలఁకులో సీత కలువలింతే ఆపె గాదయ్యా కలికి శ్రీ వెంకటాద్రిఁ గాగిలించె నిదె నన్ను తలపులో నాకె నిన్నుఁ దగిలుండు నయ్యా IIకానII
Meaning by Mallina Narasimharao garu in his blog : http://kastuuritilakam.blogspot.in/2008/06/26-105.html సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు సీతను వెదుకుతున్నప్పుడు రామలక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణా పూర్వకముగా అన్నమయ్య చెప్పిన కీర్తన యిది. ఇటువంటి సంభాషణగా నడిచే వానిని "వాకో వాక్య" రూపమైన కీర్తనలని కూడా అంటారు.ఇటువంటి "వాకో వాక్య"కీర్తనలు చాలానే వున్నవి.
ఈ కీర్తనలో ఒక వాక్యము (లైను)రాముడు, తరువాతి వాక్యము లక్షణుడు అంటున్నట్లుగా సాగుతుంది. ఇంత దాకా సీతను కనుక్కోలేక పోయాము.దూరంగా ఆ కనిపించే చోటికి వెళ్ళి వెదకుదాము-అన్నాడు రాముడు. దానికి జవాబుగా లక్షణుడు-అలాగే కానీ! అందుకోసమై నీకు కళవళ మెందుకయ్యా అన్నాడు. రాము డప్పుడు -అదిగో! తూర్పున సీత తొంగి చూస్తున్నది తమ్ముడా-అంటాడు. జవాబుగా లక్షణుడు-కనిపించే అది చందురుడే ! కాని సీత గాదయ్యా-అంటాడు.
అప్పుడాయన-దగ్గరికెళ్ళి నే వెదగ్గా నను చేరి నా సీత నవ్వుతోంది చూడరాదా-అంటాడు. లక్ష్మణుడు-నువ్వనుకొనే ఆ నవ్వులు రంగులలో మెరిసే వెన్నెలలే ! రామచంద్రా వేరు కాదు, సరిగా చూడ మంటాడు.
పొద చెంత నుండీ చేత్తో నన్ను సీత పిలుస్తోంది! చూడయ్యా-రాముడు అది హంస తీగ ఇంతే కాని అటు పిలవడం కాదయ్యా-లక్ష్మణుడు.
రాముడు-నిండు కొలనిలో నిలచి సీత నన్ను చూస్తోందయ్యా లక్ష్మణుడు- అని కలువపువ్వులయ్యా !ఆమె గాదు. రాముడు- సీత ఈ వేంకటాద్రి మీద ఇదో నన్ను కాగిలించినదయ్యా లక్ష్మణుడు- నీ తలపులో ఆమె నిన్ను తగిలి(కౌగలించుకొని) ఉన్నదయ్యా
ఇలా రామచంద్రమూర్తి సీతా విరహార్తిలో పరిపరి విధములుగా దుఃఖిస్తుండగా లక్ష్మణుడు నిజ పరిస్ధితిని వివరిస్తున్న కీర్తన యిది.
Audio link : composed and sung by Sri Nedunuri Krishnamurthy , in sahana ragam. (recorded by phone from a svbc program) భక్తి నీపై దొకటె పరమ సుఖము యుక్తి జూచిన నిజం బొక్కటే లేదు కులమెంత గలిగె నది కూడించు గర్వంబు చలమెంత గలిగె నది జగడమే రేచు తలపెంత పెంచినాఁ దగిలించు కోరికలు యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు ధనమెంత గలిగె నది దట్టమౌ లోభంబు మొనయుఁ జక్కందనంబు మోహములు రేచు ఘనవిద్యఁ గలిగినను కప్పు పైపై మదము యెనయగ పరమపద మించుకయు లేదు తరుణు లెందరు అయిన తాపములు సమకూడు సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు యిరవయిన శ్రీవేంకటేస నినుఁ గొలువగా పెరిగె నానందంబు బెళకు లికలేవు