790.bhakti nIpai dokaTe parama sukhamu - భక్తి నీపై దొకటె పరమ సుఖము
Audio link : composed and sung by Sri Nedunuri Krishnamurthy , in sahana ragam. (recorded by phone from a svbc program)
భక్తి నీపై దొకటె పరమ సుఖము
యుక్తి జూచిన నిజం బొక్కటే లేదు
కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమే రేచు
తలపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు
ధనమెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేచు
ఘనవిద్యఁ గలిగినను కప్పు పైపై మదము
యెనయగ పరమపద మించుకయు లేదు
తరుణు లెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేస నినుఁ గొలువగా
పెరిగె నానందంబు బెళకు లికలేవు
bhakti nIpai dokaTe parama sukhamu
yukti jUchina nijam bokkaTE lEdu
kulameMta galige nadi kUDiMchu garwaMbu
chalameMta galige nadi jagaDamE rEchu
talapeMta peMchinA@M dagiliMchu kOrikalu
yelami vij~nAnaMbu yEmiTA lEdu
dhanameMta galige nadi daTTamau lObhaMbu
monayu@M jakkaMdanaMbu mOhamulu rEchu
ghanavidya@M galiginanu kappu paipai madamu
yenayaga paramapada miMchukayu lEdu
taruNu leMdaru ayina tApamulu samakUDu
sirulenni galiginanu chiMtalE perugu
yiravayina SrIvEMkaTEsa ninu@M goluvagA
perige nAnaMdaMbu beLaku likalEvu
No comments:
Post a Comment