487.arayaSrAvaNa bahuLAShTami - అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
Audio download link : Balakrishnaprasad
to listen..
ప|| అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన | సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో ||
చ|| వసుదేవుని పాలిట వర తపోధనము | యెసగి దెవకీదెవి యెదపై సొమ్ము |
సురాసుర గొల్లెతల సొంపు మంగళసూత్రము | శిరులై వుదయించె శ్రీకృష్ణుడిదివో ||
చ|| నంద గోపుడుగన్న నమ్మిన నిధానము | పొందగు యశోదకు పూజదైవము |
మందల యావులకును మంచి వజ్రపంజరము | చెంది యుదయించినాడు శ్రీకృష్ణుడిదివో ||
చ|| సేవ సేసే దాసుల చేతిలోని మాణికము | శ్రీవేంకటాద్రినేచిన బ్రహ్మాము |
వోవరి నలమేల్మంగ నురముపై బెట్టుగొని | చేవ దేర నుదయించె శ్రీకృష్ణుడిదివో ||
pa|| arayaSrAvaNa bahuLAShTami caMdrOdayAna | sirulatO nudayiMce SrIkRShNuDidivO ||
ca|| vasudEvuni pAliTa vara tapOdhanamu | yesagi devakIdevi yedapai sommu |
surAsura golletala soMpu maMgaLasUtramu | Sirulai vudayiMce SrIkRShNuDidivO ||
ca|| naMda gOpuDuganna nammina nidhAnamu | poMdagu yaSOdaku pUjadaivamu |
maMdala yAvulakunu maMci vajrapaMjaramu | ceMdi yudayiMcinADu SrIkRShNuDidivO ||
ca|| sEva sEsE dAsula cEtilOni mANikamu | SrIvEMkaTAdrinEcina brahmAmu |
vOvari nalamElmaMga nuramupai beTTugoni | cEva dEra nudayiMce SrIkRShNuDidivO ||
No comments:
Post a Comment