Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, January 19, 2008

395.lalitalAvaNya vilAsamutODa - లలితలావణ్య విలాసముతోడ

Audio link (tuned and sung by Chakrapani)
లలితలావణ్య విలాసముతోడ
నెలత ధన్యత గలిగె నేటితోడ

కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పదోగేటి (గెడి?) చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చను(గవతోడ
దప్పిదేరేటి (రెడి?) మోము)దమ్మితోడ

కులుకు (గబరీభరము కుంతలంబులతోడ
తొల(గ( దోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలకు ముద్దుజూపుల తోడ
పులకలు పొడవైన పొలుపుతోడ

తిరువేంకటాచధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొల (లం?) కెడి చిన్నిసిగ్గుతోడ



lalitalAvaNya vilAsamutODa
nelata dhanyata galige nETitODa

kuppalugA mainasalukonna kastUritODa
toppadOgETi (geDi?) chemaTatODa
appuDaTu SaSirEkhalaina chanu(gavatODa
dappidErETi (reDi?) mOmu)dammitODa

kuluku (gabarIbharamu kuMtalaMbulatODa
tola(ga( dOyani prEmatODa
molakanavvulu dolaku muddujUpula tODa
pulakalu poDavaina poluputODa

tiruvEMkaTAchadhipuni mannanatODa
sarilEni divyavAsanalatODa
parikiMcharAni araviribhAvamutODa
siri dola (laM?) keDi chinnisiggutODa

No comments: