Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, January 12, 2008

389.kolanilOna munu gOpikalu - కొలనిలోన మును గోపికలు

Ragam : kamas, adi talam, composer : Nedunuri Krishnamurty
Audio link : Balakrishnaprasad , in folk styleAudio link : Nityasantoshini

ప|| కొలనిలోన మును గోపికలు | మొలక నవ్వులతో మ్రొక్కిరినీకు ||
చ|| పిరుదులు దాటిన పింఛపు టలకల | తురుములు వీడగ తొయ్యలులు |
అరిది నితంబులందునె దాచుక | మురిపెపు కరముల మ్రొక్కిరినీకు ||
చ|| నిద్దపు మానము నెలతలు లోగుచు | గద్దరి తొడలనె గట్టుచును |
ముద్దుటుంగరంబుల కరములతో | ముద్దులు గునియుచు మ్రొక్కిరినీకు ||
చ|| పాలిండ్ల పెనుభారంబుల | మూలపు మెరుగులు ముంచగను |
వేలపు ప్రియముల వేంకటేశనిను | మూలకుపిలచుచు మ్రొక్కిరినీకు ||


pa|| kolanilOna munu gOpikalu | molaka navvulatO mrokkirinIku ||
ca|| pirudulu dATina piMCapu Talakala | turumulu vIDaga toyyalulu |
aridi nitaMbulaMdune dAcuka | muripepu karamula mrokkirinIku ||
ca|| niddapu mAnamu nelatalu lOgucu | gaddari toDalane gaTTucunu |
mudduTuMgaraMbula karamulatO | muddulu guniyucu mrokkirinIku ||
ca|| pAliMDla penuBAraMbula | mUlapu merugulu muMcaganu |
vElapu priyamula vEMkaTESaninu | mUlakupilacucu mrokkirinIku ||

No comments: