Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, February 08, 2025

923. eMtavADavayya nIvu yekkaDekkaDa - ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ

 Youtube Link : Sri NC Sridevi

ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ

పొంత నీ జాణతనాలు పొగడేము నేము


మాటలనే తేనెలూరీ మంతనాన నోరూరీ

యేట వెట్టే నీ మహిమ లెక్కడ

తేటలు నీచేత విని దేహమెల్లాఁ జెమరించె

మూటలుగా నవ్వితిమి మొక్కేము నీకు


చూపులనే వాఁడి రేఁగీ సొలపుల నాసరేఁగీ

యేపున నీయెమ్మె లివి యెక్కడెక్కడ

తీపుల నీపాలఁ జిక్కి తిద్దుపడె గుణమెల్ల

మోపుగా వలచితిమి మొక్కేము నీకు


కందువల దమి వుట్టె కాఁగిట బీరము వుట్టీ

ఇందులోని నీ నేరుపు లెక్కడెక్కడ

పొ౧దితి శ్రీ వేంకటేశ భోగము రతులకెక్కె

ముందర నింకొకమాఁటు మొక్కేము నీకు


eMtavaa@MDavayya neevu yekkaDekkaDa

poMta nee jaaNatanaalu pogaDaemu naemu


maaTalanae taenelooree maMtanaana nOrooree

yaeTa veTTae nee mahima lekkaDa

taeTalu neechaeta vini daehamellaa@M jemariMche

mooTalugaa navvitimi mokkaemu neeku


choopulanae vaa@MDi rae@Mgee solapula naasarae@Mgee

yaepuna neeyemme livi yekkaDekkaDa

teepula neepaala@M jikki tiddupaDe guNamella

mOpugaa valachitimi mokkaemu neeku


kaMduvala dami vuTTe kaa@MgiTa beeramu vuTTee

iMdulOni nee naerupu lekkaDekkaDa

po~1diti Sree vaeMkaTaeSa bhOgamu ratulakekke

muMdara niMkokamaa@MTu mokkaemu neeku

922. niraMtaraMbunu nImAyE - నిరంతరంబును నీమాయే

 Youtube link : Malladi Brothers

నిరంతరంబును నీమాయే పరం-

పరములాయ పాపవే నీమాయ


మును తల్లిగర్భమున ముంచెను నీమాయ

వెనక జనించినట్టే వెలసె నీమాయ

అనుగు కౌమార బాల్య యవ్వనములు నీమాయ

జనులకు దాఁటరానిజలధి నీమాయ


ఆస నీమాయ అంగము నీమాయ

యీసునఁ గామక్రోధము లివి నీమాయ

వాసుల సంసారమున వలఁబెట్టీ నీమాయ

గాసిఁబడి యిఁక నెట్టు గడచే నీమాయ


యెదురెల్ల నీమాయ యిహమెల్ల నీమాయ

పొదలి స్వర్గ నరక భోగము నీమాయ

అదన శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవె

యిదె నీకే శరణంటి నిఁకనేల మాయ


niraMtaraMbunu neemaayae paraM-
paramulaaya paapavae neemaaya

munu talligarbhamuna muMchenu neemaaya
venaka janiMchinaTTae velase neemaaya
anugu kaumaara baalya yavvanamulu neemaaya
janulaku daa@MTaraanijaladhi neemaaya

aasa neemaaya aMgamu neemaaya
yeesuna@M gaamakrOdhamu livi neemaaya
vaasula saMsaaramuna vala@MbeTTee neemaaya
gaasi@MbaDi yi@Mka neTTu gaDachae neemaaya

yedurella neemaaya yihamella neemaaya
podali svarga naraka bhOgamu neemaaya
adana SreevaeMkaTaeSa aMtaraatmavu neeve
yide neekae SaraNaMTi ni@Mkanaela maaya

Monday, January 13, 2025

921. daivamA O daivamA - దైవమా వో దైవమా

 Youtube Link : Sri Malladi Brothers, 

Tune by Sri Malladi Suribabu garu (??) 

॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా ॥చ1॥ చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా ॥చ2॥ మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను వెగటు లంపటమైతే వేసరుకొందు వగపును నగవును పడి నొక్క మొకమందే తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా ॥చ3॥ మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని సతులంటా సుతులంటా సంసారినైతి గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను


pallavi daivamaa vO daivamaa nannu daya@MjooDa@M dagadaa nae ve~r~rivaa@MDanaitae neevu ve~r~rivaa chavigoMTi netturellaa channu@Mbaalanuchu naenu bhuvi@M dollae nOchiti puTTaenaMTaanu yivala gaDupulOna haeyamautaa@M gooDavutaa niviri nannera@Mganu ninneri@Mgaenaa mogi@M jaavuku veratu muMdara gaana naenu vegaTu laMpaTamaitae vaesarukoMdu vagapunu nagavunu paDi nokka mokamaMdae tagulainavaa@MDa neepai tala@Mpu naakunnadaa mati bhramasiti@M goMta mannu naaku raajyamani satulaMTaa sutulaMTaa saMsaarinaiti gatiyai SreevaeMkaTaeSa kaachiti viMtaTilOnae yitaru@MDa niMtae neeku naemi baa@Mti naenu


Monday, June 17, 2024

920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము

tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani

archive link 

 ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము

ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥

తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు
పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన ॥ఒక॥

దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు
భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన ॥ఒక॥

సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు
అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన ॥ఒక॥

okaTi suj~naanamu okaTi aj~naanamu
prakaTiMchi vokaTi chaepaTTarO vivaekulu
tanu@M dalachukoMTaenu takkina daehabhOgaalu
panikiraavu avi prakRti gaana
ghanamaina lOkabhOgamulatO lOlu@MDaitae
tanu@M gaanaraadu jeevatatvamu gaana

daivamu ne~ri@Mgitaenu tana kaamyakaryamulu
bhaaviMchi ma~ravavale baMdhaalu gaana
kaaviMchaeTi tana kaamyakarmaala@M gaTTuvaDitae
daivamu lOnu gaa@MDu svataMtru@MDu gaana

sarimOkshamu gOritae svargamu teruvu gaadu
araya svargamu teru vala mOkshaanaku
paraga nalamaelmaMgapati SreevaeMkaTaeSuni
SaraNaagatiye sarvasaadhanamu gaana

Monday, January 23, 2023

919. talacharO janlu Itani punya nAmamulu - తలచరో జనులు యీతని పుణ్య నామములు

Ragam: revati ( రేవతి)

Composed and sung by : శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారు

youtube link: 

meaning available in this page: 

॥పల్లవి॥తలఁచరో జనులు యీతని పుణ్య నామములు

సులభముననే సర్వశుభములు గలుగు


॥చ1॥హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుఁడు

వనధి లంఘన శీల వైభవుఁడు

దనుజాంతకుఁడు సంజీవనీ శైల సాధకుఁడు

ఘనుఁడు కలశాపుర హనుమంతుఁడు


॥చ2॥లంకా సాధకుఁడు లక్ష్మణ ప్రబోధకుఁడు

శంకలేని సుగ్రీవ సచివుఁడు

పొంకపు రాముని బంటు భూమిజసంతోష దూత

తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు


॥చ3॥చటులార్జున సఖుఁడు జాతరూప వర్ణుఁడు

ఇటమీఁద బ్రహ్మ పట్ట మేలేటి వాఁడు

నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు

పటు కలశాపుర ప్రాంత హనుమంతుఁడు


-----తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన

రాగము: గౌళ,రేకు: 0383-02,సంపుటము: 4-483




pallavitala@McharO janulu yeetani puNya naamamulu

sulabhamunanae sarvaSubhamulu galugu


cha1hanumaMtuDu vaayuju@M DaMjanaa tanayu@MDu

vanadhi laMghana Seela vaibhavu@MDu

danujaaMtaku@MDu saMjeevanee Saila saadhaku@MDu

ghanu@MDu kalaSaapura hanumaMtu@MDu


cha2laMkaa saadhaku@MDu lakshmaNa prabOdhaku@MDu

SaMkalaeni sugreeva sachivu@MDu

poMkapu raamuni baMTu bhoomijasaMtOsha doota

teMkinae kalaSaapura daeva hanumaMtuDu


cha3chaTulaarjuna sakhu@MDu jaataroopa varNu@MDu

iTamee@Mda brahma paTTa maelaeTi vaa@MDu

naTana Sree vaeMkaTaeSu nammina saevaku@MDu

paTu kalaSaapura praaMta hanumaMtu@MDu


-----taaLlapaaka annamaachaarya aadhyaatma saMkeertana

raagamu: gauLa,raeku: 0383-02,saMpuTamu: 4-483


Ragam: revati ( raevati)

Composed and sung by : Sree sattiraaju vaeNumaadhav^ gaaru

Saturday, January 21, 2023

918. నవనారసింహ నమో నమో - navanaarasiMha namO namO

Tuned & composed by Sri T.P. Chakrapani , in Ragam: Bilahari

నవనారసింహ నమో నమో

భవనాశితీర యహోబలనారసింహ


సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ

వితతవీరసింహవిదారణా

అతిశయకరుణ యోగానంద నరసింహ

మతి శాంతపు కానుగుమాని నారసింహ


మరలి బీభత్సపు మట్టెమళ్ల నరసింహ

నరహరి భార్గోటి నారసింహ

పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ

సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ


వదనభయానకపు వరాహనరసింహ

చెదరని వైభవాల శ్రీనరసింహ

అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి

పదివేలు రూపముల బహునారసింహ


navanaarasiMha namO namO
bhavanaaSiteera yahObalanaarasiMha

satataprataaparaudrajvaalaanaarasiMha
vitataveerasiMhavidaaraNaa
atiSayakaruNa yOgaanaMda narasiMha
mati SaaMtapu kaanugumaani naarasiMha

marali beebhatsapu maTTemaLla narasiMha
narahari bhaargOTi naarasiMha
paripoorNaSRMgaara prahlaadanarasiMha
sirula nadbhutapu lakshmeenaarasiMha

vadanabhayaanakapu varaahanarasiMha
chedarani vaibhavaala SreenarasiMha
adana SreevaeMkaTaeSa aMdu niMdu niravaiti
padivaelu roopamula bahunaarasiMha

Friday, December 02, 2022

917. EmI neragani nannu niMta sEsiti - ఏమీ నెఱఁగని నన్ను నింత సేసితి

 


ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువ సేసి

పామరుల దొడ్డఁ జేసె భాష్యకారులు


గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి

అతని కరుణచేత నన్నియుఁ గని

గతిలేకపోయిన కలియుగమున వచ్చి

ప్రతిపాలించఁగలిగె భాష్యకారులు


లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి

ఆకుమీఁదఁ దేలిన యతని కృప

కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే

పైకొనఁగఁ గరుణించె భాష్యకారులు


పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁ బరమిచ్చిన-

వేంకటేశు కృపతోడ వెలయఁ దానే

తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన

పంకమెల్లఁ బోఁ గడిగె భాష్యకారులు


aemee ne~ra@Mgani mammu nekkuva saesi
paamarula doDDa@M jaese bhaashyakaarulu

gatachannavaedaalu kamalajunaku nichchi
atani karuNachaeta nanniyu@M gani
gatilaekapOyina kaliyugamuna vachchi
pratipaaliMcha@Mgalige bhaashyakaarulu

lOkamella velli@MbO@Mgaa lOnanae surala@M gaachi
aakumee@Mda@M daelina yatani kRpa
kaakarimatamulella gaali@Mbuchchi para miTTae
paikona@Mga@M garuNiMche bhaashyakaarulu

paMkajapu@M jaeyi chaa@Mchi paadapu@M baramichchina-
vaeMkaTaeSu kRpatODa velaya@M daanae
teMkinae voDayavarai tirumaMtradvayaana
paMkamella@M bO@M gaDige bhaashyakaarulu

Video by Sri Malladi Brothers, Tune by Sri Malladi Suribabu raga:VarALi
source : https://www.youtube.com/@tallapaka-annamacharya
link : https://www.youtube.com/watch?v=_kIE55yxpSo

Tuesday, November 29, 2022

916. పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము - paramAtma ninnu golchi bradikEmu

 Ragam : sahana (శహన)

Composer & Singer Smt.Seshulata : Youtube link

॥పల్లవి॥పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము

విరసపు జాలిఁ జిక్కి వెతఁబడనోపము ॥చ1॥మగఁడు విడిచినా మామ విడువనియట్లు నగి నామనసు రోసినా లోకులు మానరు తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగమోటలను నేను మోసపోవనోపను ॥చ2॥పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు విసిగి నే విడిచినా విడువరు లోకులు కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడల నేనోపను ॥చ3॥నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను (రాగము: ముఖారి,రేకు: 0238-05,సంపుటము: 3-220) ------తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన



Tuesday, September 13, 2022

915. vaTTi laMpaTamu vadala nEradu gAna - వట్టి లంపటము వదల నేరదు గాన

Youtube link : Sri P Ranganath, in raga Malayamarutam

॥పల్లవి॥వట్టి లంపటము వదల నేరదు గాన

పుట్టించిన హరి బుద్దిలోనె కాఁడా ॥చ1॥దేహాభిమానములు తెగి విడిచినఁ గాని యీహల దేవుఁడు తన్ను నేల మెచ్చీనీ సాహసించి కోరికెల సంగము మానకుండితే వోహో పరమపద మూర కేల కలుగు ॥చ2॥నిచ్చలును వైరాగ్యనిష్ఠుడు గాకుండితేను యెచ్చిన జన్మాదు లెల్ల యేల కడచు కొచ్చి కొచ్చి తనలోని కోపముడుగ కుండితే అచ్చపు బ్రహ్మానంద మది యేల కలుగు ॥చ3॥శ్రీ వేంకటాద్రి మీఁది శ్రీపతిఁ గొల్వకుండితే సోవల నా దేవుఁ డిట్టె సులభుఁడవునా భావించి తనలోని భక్తి నిలుపకుండితే తావుల నన్నిటాను సంతత పుణ్యుఁ డవునా (రాగము: భూపాళం,రేకు: 0027-03,సంపుటము: 15-155) ---తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన

vaTTi laMpaTamu vadala naeradu gaana puTTiMchina hari buddilOne kaa@MDaa daehaabhimaanamulu tegi viDichina@M gaani yeehala daevu@MDu tannu naela mechcheenee saahasiMchi kOrikela saMgamu maanakuMDitae vOhO paramapada moora kaela kalugu nichchalunu vairaagyanishThuDu gaakuMDitaenu yechchina janmaadu lella yaela kaDachu kochchi kochchi tanalOni kOpamuDuga kuMDitae achchapu brahmaanaMda madi yaela kalugu Sree vaeMkaTaadri mee@Mdi Sreepati@M golvakuMDitae sOvala naa daevu@M DiTTe sulabhu@MDavunaa bhaaviMchi tanalOni bhakti nilupakuMDitae taavula nanniTaanu saMtata puNyu@M Davunaa


Saturday, August 20, 2022

914. mA iMTiki rAvOyi mAdhavA - మా ఇంటికి రావోయి మాధవా

 Tuned and sung by Sri Parupalli Ranganath

మా ఇంటికి రావోయి మాధవా మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా౹ మత్తు చల్లేవు వలపు మాధవా మచ్చికలెల్ల జేసితివి మాధవ మచ్చెము నీపై నదే మాధవా ఇంక మచ్చరపు చూపులేల మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మరుగేల ఇక నీకు మాధవ మరి నాకు దక్కితివి మాధవ మరచేవా నీ చేతలు మాధవ మాటు మరతుమంటేమనేవు మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మట్టులేని శ్రీవేంకట మాధవ కట్టు మట్టుతో మము కూడితి మాధవ మట్టేవు మా కాళ్ళు పట్టి మాధవా మా మట్టె లియ్యంగదవోయి మాధవా౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ ౹౹


maa iMTiki raavOyi maadhavaa maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhavaa౹ mattu challaevu valapu maadhavaa machchikalella jaesitivi maadhava machchemu neepai nadae maadhavaa iMka machcharapu choopulaela maadhava౹౹ maa iMTiki raavOyi maadhavaa nee maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhava marugaela ika neeku maadhava mari naaku dakkitivi maadhava marachaevaa nee chaetalu maadhava maaTu maratumaMTaemanaevu maadhava౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava maTTulaeni SreevaeMkaTa maadhava kaTTu maTTutO mamu kooDiti maadhava maTTaevu maa kaaLLu paTTi maadhavaa maa maTTe liyyaMgadavOyi maadhavaa౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava ౹౹