922. niraMtaraMbunu nImAyE - నిరంతరంబును నీమాయే
Youtube link : Malladi Brothers
నిరంతరంబును నీమాయే పరం-
పరములాయ పాపవే నీమాయ
మును తల్లిగర్భమున ముంచెను నీమాయ
వెనక జనించినట్టే వెలసె నీమాయ
అనుగు కౌమార బాల్య యవ్వనములు నీమాయ
జనులకు దాఁటరానిజలధి నీమాయ
ఆస నీమాయ అంగము నీమాయ
యీసునఁ గామక్రోధము లివి నీమాయ
వాసుల సంసారమున వలఁబెట్టీ నీమాయ
గాసిఁబడి యిఁక నెట్టు గడచే నీమాయ
యెదురెల్ల నీమాయ యిహమెల్ల నీమాయ
పొదలి స్వర్గ నరక భోగము నీమాయ
అదన శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవె
యిదె నీకే శరణంటి నిఁకనేల మాయ
No comments:
Post a Comment