Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, March 12, 2007

147.parama yOgISvarula - పరమ యోగీశ్వరుల పద్ధతియిది


Audio link : G.BalaKrishnaPrasad
Archive link :

ప|| పరమ యోగీశ్వరుల పద్ధతియిది | ధరణిలో వివేకులు దలపోసుకొనుట ||
చ|| మొదలనాత్మ జ్ఞానము దెలిసి పిమ్మట | హృదయములోని హరినెరుగుట |
వుదుటైన యింద్రియాల నొడిసి వంచుకొనుట | గుదిగొన్న తనలో కోరికలుడుగుట ||
చ|| తన పుణ్యఫలములు దైవముకొసగుట | పనివడి యతనిపై భక్తి చేసుట |
తనివితో నిరంతర ధ్యాన యోగపరుడౌట | మనసుతో ప్రకృతి సంబంధము మరచుట ||
చ|| నడమ నడమ విఙ్ణానపు కథలు వినుట | చిడిముడినాచార్య సేవసేయుట |
యెడయక శ్రీ వేంకటేశుపై భారమువేసి | కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట ||
in english:
pa|| parama yOgISvarula paddhatiyidi | dharaNilO vivEkulu dalapOsukonuTa ||
ca|| modalanAtma ~mNAnamu delisi pimmaTa | hRdayamulOni harineruguTa |
vuduTaina yiMdriyAla noDisi vaMcukonuTa | gudigonna tanalO kOrikaluDuguTa ||
ca|| tana puNyaPalamulu daivamukosaguTa | panivaDi yatanipai Bakti cEsuTa |
tanivitO niraMtara dhyAna yOgaparuDauTa | manasutO prakRti sambaMdhamu maracuTa ||
ca|| naDama naDama vi~mNAnapu kathalu vinuTa | ciDimuDinAcArya sEvasEyuTa |
yeDayaka SrI vEMkaTESupai BAramuvEsi | kaDu vaiShNavula kRupa galigi suKiMcuTa ||


Friday, March 09, 2007

146.chAladA mAjanmamu-చాలదా మాజన్మము


Audio link :PriyaSisters
Archive link :
ప|| చాలదా మాజన్మము నీ- | పాలింటివారమై బ్రదుకగగలిగె ||
చ|| కమలాసనాదులుగాననినీపై | మమకారముసేయ మార్గము గలిగె |
అమరేంద్రాదులకందరానినీ- | కొమరైన నామము కొనియాడగలిగె ||
చ|| సనకాదులును గానజాలనినిన్ను | తనివోవ మతిలొన దలపోయగలిగె |
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- | నిను సంతతమును వర్ణింపగలిగె ||
చ|| పరమమై భవ్యమై పరగిననీ- | యిరవిట్టిదని మాకు నెర్కుగంగగలిగె |
తిరువేంకటాచలాధిప నిన్ను యీ- | ధరమీద బలుమారు దరిసింపగలిగె ||


in english:
pa|| cAladA mAjanmamu nI- | pAliMTivAramai bradukagagalige ||
ca|| kamalAsanAdulugAnaninIpai | mamakAramusEya mArgamu galige |
amarEMdrAdulakaMdarAninI- | komaraina nAmamu koniyADagalige ||
ca|| sanakAdulunu gAnajAlanininnu | tanivOva matilona dalapOyagalige |
GanamunIMdrulaku nagamyamaivunna- | ninu saMtatamunu varNiMpagalige ||
ca|| paramamai Bavyamai paraginanI- | yiraviTTidani mAku nerxugaMgagalige |
tiruvEMkaTAcalAdhipa ninnu yI- | dharamIda balumAru darisiMpagalige ||

Thursday, March 08, 2007

145.chAladA brahmamidi-చాలదా బ్రహ్మమిది


Audio link :G.BalaKrishnaPrasad
Audio link :MohanaKrishna
Archive link :
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
in english:
pa|| cAladA brahmamidi saMkIrtanaM mIku | jAlella naDagiMcu saMkIrtanaM ||
ca|| saMtOSha karamaina saMkIrtanaM | saMtApa maNagiMcu saMkIrtanaM |
jaMtuvula rakShiMcu saMkIrtanaM | saMtatamu dalacuDI saMkIrtanaM ||
ca|| sAmajamu gAMcinadi saMkIrtanaM | sAmamuna kekkuDI saMkIrtanaM |
sAmIpya miMdariki saMkIrtanaM | sAmAnyamA viShNu saMkIrtanaM ||
ca|| jamubAri viDipiMcu saMkIrtanaM | sama buddhi voDamiMcu saMkIrtanaM |
jamaLi sauKyamuliccu saMkIrtanaM | SamadamAdula jEyu saMkIrtanaM ||
ca|| jalajAsanuni nOri saMkIrtanaM | caligoMDa sutadalacu saMkIrtanaM |
caluva gaDu nAlukaku saMkIrtanaM | calapaTTi talacuDI saMkIrtanaM ||
ca|| saravi saMpadaliccu saMkIrtanaM | sarilEni didiyapO saMkIrtanaM |
sarusa vEMkaTa viBuni saMkIrtanaM | sarugananu dalacuDI saMkIrtanaM ||
youtube link : G.Balakrishna prasad
 

Wednesday, March 07, 2007

144.pApapuNyamula pakva - పాపపుణ్యముల పక్వ మిదెరుగను


Audio link :PB Srinivas
Audio link :BombaySisters
Archive link :
ప|| పాపపుణ్యముల పక్వ మిదెరుగను | నా పాలిటి హరి నమో నమో ||
చ|| మానస వాచక కర్మంబుల | తానకముగ నీ దాసుడను |
పూని త్రిసంధ్యల భోగ భాగ్యముల | నానా గతులను నమో నమో ||
చ|| వలనుగ జాగ్రద్స్వప్న సుషుప్తుల | ఇలలో నీకే హితభటుడ |
వెలుపల లోపల వేళావేళల | నలినాక్ష నీకె నమో నమో ||
చ|| పుట్టుక తొలుతను పుట్టిన మీదట | అట్టె నీ శరణాగతుడ |
గట్టిగ శ్రీ వేంకటపై నీకౄప | నట్ట నడుమైతి నమో నమో ||

in english:
pa|| pApapuNyamula pakva mideruganu | nA pAliTi hari namO namO ||
ca|| mAnasa vAcaka karmaMbula | tAnakamuga nI dAsuDanu |
pUni trisaMdhyala BOga BAgyamula | nAnA gatulanu namO namO ||
ca|| valanuga jAgradsvapna suShuptula | ilalO nIkE hitaBaTuDa |
velupala lOpala vELAvELala | nalinAkSha nIke namO namO ||
ca|| puTTuka tolutanu puTTina mIdaTa | aTTe nI SaraNAgatuDa |
gaTTiga SrI vEMkaTapai nIkRupa | naTTa naDumaiti namO namO ||

Tuesday, March 06, 2007

143.teliya cIkaTiki dIpamettaka - తెలియ చీకటికి దీపమెత్తక


Audio link :G.BalaKrishnaPrasad
Audio link :MBalaMuraliKrishna
Archive link :
ప|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా ||
చ|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా |
వరుత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని
తివియ(గ దానేలా ||
చ|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా |
అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా ||
చ|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా |
ధౄతిహీను గౄపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||

in english:
pa|| teliya cIkaTiki dIpamettaka, pedda | velugu lOpaliki velugElA ||
ca|| araya nApannuni kaBaya mIvalegAka | iravaina suKi gAvanElA |
varuta bOyeDuvAnivaDi dIyavale gAka | darivAni diviyaga dAnElA ||
ca|| GanakarmAraMBuni kaTlu viDavale gAka | yenasi muktuni gAvanElA |
anayamu durbaluni kanna miDavalegAka | tanisina vAniki dAnElA ||
ca|| mitilEni pApakarmiki dAvale gAka | hita merugu puNyuniki nElA |
dhRutihInu gRupajUci tiruvEMkaTESvaruDu | tati gAvakuMDina tAnElA ||

142.dibbalu veTTucu - దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ప|| దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
చ|| అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||
చ|| పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||
చ|| తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||

in english:
pa|| dibbalu veTTucu dElina didivO | ubbu nITipai noka haMsa ||
ca|| anuvuna gamala vihArame nelavai | onariyunna dide oka haMsa |
maniyeDi jIvula mAnasa sarasula | vuniki nunna dide oka haMsa ||
ca|| pAlu nIru nErparaci pAlalO | nOlalADe nide yoka haMsa |
pAlupaDina yI paramahaMsamula | Oli nunna dide yoka haMsa ||
ca|| taDavi rOmaraMdhraMbula gruDla | nuDugaka podigI noka haMsa |
kaDu vEDuka vEMkaTagiri mIdaTa | noDalu peMcenide yoka haMsa ||

141.Edi tuda dInikEdi modalu - ఏది తుద దీనికేది మొదలు


Audio link : G. Balakrishnaprasad
Archive link :
ప|| ఏది తుద దీనికేది మొదలు | పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||
చ|| ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు | యెన్నివేదనలు మరియెన్ని దుహ్ఖములు |
యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు | యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు ||
చ|| యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు | యెన్నియాసలు మరియు నెన్ని మోహములు |
యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి | యిన్నియును దలప మరి యెన్నైన గలవు ||
చ|| యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు | నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు |
యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ | నెన్ని చూచినను దానెవ్వడును గాడు ||


in english:
pa|| Edi tuda dInikEdi modalu | pAdukonu harimAya baragu jIvuniki ||
ca|| ennibAdhalu danaku nenni laMpaTamulu | yennivEdanalu mariyenni duHKamulu |
yenniparitApaMbu lennidalapOtalu | yenni cUcina mariyu nennainagalavu ||
ca|| yennikoluvulu danaku nenniyanucaraNalu | yenniyAsalu mariyu nenni mOhamulu |
yennigarvamulu danakenni dainyaMbulivi | yinniyunu dalapa mari yennaina galavu ||
ca|| yenniTiki jiMtiMcu nennaTiki harShiMcu | nenniTiki nAsiMcu nenniTiki dirugu |
yinniyunu diruvEMkaTESulIlalu gAga | nenni cUcinanu dAnevvaDunu gADu ||

GB Sankara Rao gari vivarana , fron sujanaranjani
అనంత కాలగమనంలో, జనన మరణ చక్ర భ్రమణంలో ఏది ముగింపు? ఏది మొదలు? ఇదంతా శ్రీహరి మాయే అంటున్నాడు అన్నమయ్య! ఈ పాటలోని మూడు చరణల్లో అన్నమ్య్య చాలా చక్కగా జీవుడు అనుభవించిన సుఖాలు దుఃఖాలు విపులంగా తెలియజేసినాడు. ఈ పాటలోని పల్లవి, చరణాల లోని పది పాదలు ఒక ఎత్తు కాగా, చివరి చరణంలోని రెండు పాదాలు వీటన్నిటిని మించి ఉత్కృష్టమైన సత్యాన్ని, పరమార్ధాన్ని తెలియజేస్తూ యిన్నియును తిరువేంకటేశు లీలలు కాగా అంటే పైన చెప్పినవన్నీ ఆ భగవంతుని లీలలే అంటూ ఎన్ని చూసినను తానెవ్వడును కాడు! ఇక్కడ ఆత్మతత్త్వం ప్రతిపాదించబడింది. పైన చెప్పిన అశాశ్వత విషయాలలో శాశ్వత స్వరూపుడైన ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి జీవుడు శాశ్వత తత్త్వమైన ఆత్మ స్వరూపాన్ని (భగవంతుని రూపాన్నే) ఎరిగి, అశాశ్వతమైన భౌతిక విషయ్ల పట్ల విముఖుడు కావాలన్నది ఇందున్న సందేశం!
పాదుకొను = నెలకొను;
లంపటము= వదలని బంధం;
కొలువు = సేవ;
అనుచరణ = ఆచరించుట; ఒనరించుట, అనుసరించుట

140.ekkaDi mAnuSha janmaM - ఎక్కడి మానుష జన్మం


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Raga : bouli , composer : M.Balamuralikrishna
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||


pa|| ekkaDi mAnuSha janmaM bettina PalamE munnadi |
nikkamu ninnE nammiti nI cittaMbikanu ||
ca|| maravanu AhAraMbunu maravanu saMsAra suKamu |
maravanu yiMdriya BOgamu mAdhava nI mAya |
maraceda su~mNAnaMbunu maraceda tattva rahaSyamu |
maraceda guruvunu daivamu mAdhava nI mAya ||
ca|| viDuvanu pApamu puNyamu viDuvanu nA durguNamulu |
viDuvanu mikkili yAsalu viShNuDa nImAya |
viDiceda ShaTkarmaMbulu viDiceda vairAgyaMbunu |
viDiceda nAcAraMbunu viShNuDa nImAya ||
ca|| tagileda bahu laMpaTamula tagileda bahu baMdhamula |
tagulanu mOkShapu mArgamu talapuna yeMtainA |
agapaDi SrI vEMkaTESvara aMtaryAmivai |
nagi nagi nanu nIvEliti nAkA yImAya ||

:: శ్రీమద్భగవద్గీత – విజ్ఞాన యోగము :: from 
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ 14 ॥
దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యము కలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నా యొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. అయినను ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారు ఈ మాయను దాటివేయగలరు.

Video :


Dr.Patanjali gari vyakhyanam :


video : priya sisters


in another tune : rendered by Rayaprolu Sowmya

Tuesday, February 27, 2007

139.palumaru uTla-పలుమరు ఉట్ల్ల


Audio link :S.Janaki
Audio link :SJanaki
Archive link :
ప|| పలుమరు ఉట్ల్ల పండగను | చిలుకు చిడక్కని చిందగను ||
చ|| ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు | తాళ్ళు తెగిపడ తన్నగను |
పెళ్ళు కఠిల్లు పెఠిళ్ళు చిఠిల్లని | పెళ్ళుగ మ్రోసె పెనురవము ||
చ|| బంగరు బిందెల పాలు పెరుగులు | ముంగిట నెగయుచు మోదగను |
కంగు కళింగు కఠింగు ఖణింగని | రంగు మీర పెనురవములై ||
చ|| నిగ్గగు వేంకట నిలయుడిటు పా | లగ్గలిక పగుల అడువగను |
బగ్గు బగ్గిలని పరమామౄతములు | గుగ్గిలి పదనుగ గురియగను ||

pa|| palumaru uTla paMDaganu | ciluku ciDakkani ciMdaganu ||
ca|| ULLa vIdhula uTla kRShNuDu | tALLu tegipaDa tannaganu |
peLLu kaThillu peThiLLu ciThillani | peLLuga mrOse penuravamu ||
ca|| baMgaru biMdela pAlu perugulu | muMgiTa negayucu mOdaganu |
kaMgu kaLiMgu kaThiMgu KaNiMgani | raMgu mIra penuravamulai ||
ca|| niggagu vEMkaTa nilayuDiTu pA | laggalika pagula aDuvaganu |
baggu baggilani paramAmRutamulu | guggili padanuga guriyaganu ||

Sunday, February 25, 2007

138.eMta vibhavamu - ఎంత విభవము


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Ragam : Sudhdhasaveri, Composer : G.Balakrishnaprasad

ఎంత విభవము కలిగె నంతయును నాపదని | చింతించినది కదా చెడని జీవనము ||

చలము కోపంబు తను చంపేటి పగతులని | తెలిసినది యది కదా తెలివి ||
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని | తొలగినది యది కదా తుదగన్నఫలము ||

మెఱయు విషయములే తన మెడనున్న వురులుగా | యెరిగినది యది కదా యెరుక ||
పఱివోని ఆస తను బుట్టుకొను భూతమని | వెరచినది యది కదా విజ్ఞాన మహిమ ||

యెనలేని తిరువేంకటేశుడే దైవమని | వినగలిగినది గదా వినికి||
అనయంబు నతని సేవానందపరులయి |మనగలిగినది గదా మనుజులకు మనికి ||


in english:
eMta vibhavamu kalige naMtayunu nApadani |chiMtimchinadi kadA cheDani jIvanamu ||

chalamu kOpambu tanu chaMpETi pagatulani |telisinadi yadi kadA telivi
talakonna paraniMda tanapAli mRtyuvani |tolaginadi yadi kadA tudagannaphalamu ||

me~rayu vishayamulE tana meDanunna vurulugA|yeriginadi yadi kadA yeruka
pa~rivOni Asa tanu buTTukonu bhUtamani |veracinadi yadi kadA vij~nAna mahima ||

yenalEni tiruvEMkaTESuDE daivamani |vinagaliginadi gadA viniki
anayaMbu natani sEvAnaMdaparulayi |managaliginadi gadA manujulaku maniki ||

లోకంలో సర్వసాధారణంగా మానవులు సంపదలపై మోహం పెంచుకుని, అవి వృద్ధి చెందుతున్నప్పుడు వాటిని చూసి గర్వపడతారు; మరియు అహంకారంతో విర్రవీగుతారు. కాని ఇక్కడ అన్నమయ్య ఆ మాయాసిరులన్నీ మన మెడలకు తగులుకొన్న ఉరిత్రాళ్ళుగా వర్ణిస్తున్నారు. మనకు లభించే భౌతిక భోగాలన్నీ అశాశ్వతాలనీ, ఆపదలకు మూలాలనీ తెలుసుకొనటమే నిజమైన జీవితం, అనీ, సత్యదృష్టి అనీ ఈ పాటలో చక్కగా తెలియజేస్తున్నాడు! అరిషడ్వర్గాలను విడిచిపెట్టాలని, పరనింద చేయరాదని, విషయ వాంఛలను విడనాడాలని, ఆశలను ఆమడదూరంలో పెట్టాలని బోధిస్తున్నాడు! వీటన్నిటి యదార్ధ స్వరుపం తెలుసుకున్నవాడు విజ్ఞాని అని, నొక్కి వక్కాణిస్తున్నాడు! తిరుగులేని తిరువేంకటేశ్వరుడు శాశ్వత సత్యమని, దైవమని తెలుసుకొని నిరంతరం ఆ స్వామి సేవలో తరించాలని ఉద్భోధిస్తున్నాడుు మన గురువు అన్నమయ్య!
GB. Sankara Rao gari vivarana from sujanaranjani , siliconandhra.org

విభవము = సంపద;
చలము = మాత్సర్యము;
పగతులు = శత్రువులు
తలకొన్న = కలిగిన;
తుదగన్న ఫలము = పరమావధి నొందిన ఫలము;
విషయములు = శబ్ద స్పర్శ రూపాదులు;
పఱివోని = చీలిపోని, తగ్గని
ఎనలేని = సాటిలేని;
అనయంబు = అత్యంతము, సతతము