శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, March 06, 2007

140.ekkaDi mAnuSha janmaM - ఎక్కడి మానుష జన్మం

Raga : bouli , composer : M.Balamuralikrishna
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||


pa|| ekkaDi mAnuSha janmaM bettina PalamE munnadi |
nikkamu ninnE nammiti nI cittaMbikanu ||
ca|| maravanu AhAraMbunu maravanu saMsAra suKamu |
maravanu yiMdriya BOgamu mAdhava nI mAya |
maraceda su~mNAnaMbunu maraceda tattva rahaSyamu |
maraceda guruvunu daivamu mAdhava nI mAya ||
ca|| viDuvanu pApamu puNyamu viDuvanu nA durguNamulu |
viDuvanu mikkili yAsalu viShNuDa nImAya |
viDiceda ShaTkarmaMbulu viDiceda vairAgyaMbunu |
viDiceda nAcAraMbunu viShNuDa nImAya ||
ca|| tagileda bahu laMpaTamula tagileda bahu baMdhamula |
tagulanu mOkShapu mArgamu talapuna yeMtainA |
agapaDi SrI vEMkaTESvara aMtaryAmivai |
nagi nagi nanu nIvEliti nAkA yImAya ||

Ekkadi Manusha.mp3


Video :

6 comments:

Murali said...

labelsలో కీర్తన మొదటి అక్షరం కూడా పెడితే ఆకారాది క్రమంలో చూడటానికి వీలవుతుంది.

radhika said...

చాలా పోస్టులున్నాయి.
చాలా మంచి ప్రయత్నం.మెచ్చదగినది.

Sravan Kumar DVN said...

మురళి గారు, మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు !
ఈ బ్లాగ్ చూడండి
http://dvnsravan.wordpress.com/

Sravan Kumar DVN said...

మురళి గారి సలహా ప్రకారం, బ్లాగులో కీర్తనలన్ని అక్షర క్రమంగా వర్గీకరించబడ్డాయి.
-శ్రవణ్

Geetha Bharathi said...

Hi Sravan ..Thanks for the great work...It would be really nice to have the meaning given for each of the master piece ..to a basic level ..although the depth of divine name is infinite.

vidhyasaras said...

Hi,

I have listened to some of Annamacharya's songs-
Ekkadi manusha janmam, Kattedura vaikunta, Govinda Govinda koluvara.
Awesome.
I really regret for not learning Telugu, beautiful wordings.
Brings the Bhakthi facto out from the person..