Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, April 19, 2020

868. chakkani sarasapu SiSuvu - చక్కని సరసపు శిశువు

Tune by Sri Ramesh Nayudu
Sung by Smt P. Suseela
 Audio archive link
Video link


చక్కని సరసపు శిశువు
పెక్కుమాయల పెనుశిశువు    =పల్లవి=

చిమ్మెడి విషములు చేఁపిన రొమ్ములు
కొమ్మని యిచ్చినఁ గుడిచేని
బొమ్మర పోవఁడు పూతకిఁ బొరిగొని
అమ్మరో గయ్యాళి శిశువు    =చక్కని=

చుట్టమువలెనే సుడిగాలినిఁ గని
బెట్టుగఁ గౌఁగిట బిగించేని
పుట్టఁడు వొడమఁడు బూమెలే చేసీ
పట్టరే పసి బాల శిశువు    =చక్కని=

పాదము చాఁ చటు బండి జాతురకు
ఆదిగొనుచు తా నలరీని
వేదవేద్యుఁ డగు వేంకటగిరిపై
మోద మందిన మున్నిటి శిశువు    =చక్కని=


chakkani sarasapu SiSuvu
pekkumaayala penuSiSuvu    =pallavi=

chimmeDi vishamulu chae@Mpina rommulu
kommani yichchina@M guDichaeni
bommara pOva@MDu pootaki@M borigoni
ammarO gayyaaLi SiSuvu    =chakkani=

chuTTamuvalenae suDigaalini@M gani
beTTuga@M gau@MgiTa bigiMchaeni
puTTa@MDu voDama@MDu boomelae chaesee
paTTarae pasi baala SiSuvu    =chakkani=

paadamu chaa@M chaTu baMDi jaaturaku
aadigonuchu taa nalareeni
vaedavaedyu@M Dagu vaeMkaTagiripai
mOda maMdina munniTi SiSuvu    =chakkani=

No comments: