Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, April 15, 2020

866. anuchu niddarunaaDE ramaDalavalenE - అనుచు నిద్దరునాడే రమడలవలెనే


Audio archive link : Tuned and Sung by Sri Sathiraju Venumadhav in Brindavani

youtube video lession by Sri Venumadhav
అనుచు నిద్దరునాడే రమడలవలెనే
మొనసి యివెల్లాఁ జూచి మొక్కిరి బ్రహ్మాదులు    =పల్లవి=

రాముఁడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముఁడఁ గాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందిరాకృష్ణుఁడా    =అను=

యెక్కిన వుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కునఁ బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిఁడికాళ్ళకు వోరి
అక్కతోఁ జెప్పేఁ గాని అందుకొనే రారా    =అను=

యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయఁడనేరా అయితే-
యివ్వల నీకంటేఁ బెద్ద యిది నీ వెఱఁగవా    =అను=


anuchu niddarunaaDae ramaDalavalenae
monasi yivellaa@M joochi mokkiri brahmaadulu    =pallavi=

raamu@MDa paMDlu naaku raMDu veTTaraa
yaemiraa yiTlaane naaku yittuvaa neevu
praemaputammu@MDa@M gaana pinnanae neeku
yeemaaTa ma~ravaku yiMdiraakRshNu@MDaa    =anu=

yekkina vuTTipai nannu nekkiMcharaa vOri
vukkuna@M baDaevu raaku vadduraa neevu
pakkuna mokkaeraa neepayi@MDikaaLLaku vOri
akkatO@M jeppae@M gaani aMdukonae raaraa    =anu=

yevvaru voDavO sari niTu nilutamuraa vOri
nivvaTilla neeviMta nikkavodduraa
ravvala SreevaeMkaTaadriraaya@MDanaeraa ayitae-
yivvala neekaMTae@M bedda yidi nee ve~ra@Mgavaa    =anu=

No comments: