871. aadimunula siddhaaMjanamu - ఆదిమునుల సిద్ధాంజనము
ఆదిమునుల సిద్ధాంజనము
యే దెసఁ జూచిన నిదివో వీఁడే =పల్లవి=
నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే =ఆది=
కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే =ఆది=
పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే =ఆది=
aadimunula siddhaaMjanamu
yae desa@M joochina nidivO vee@MDae =pallavi=
nagina selavi@M baDu naalugujagamulu
mogamuna@M joopae mOhanamu
nigiDi yaSOdaku nidhaanaMbai
pogaDoMdee gRhamuna nide vee@MDae =aadi=
kanuderachina nalugaDa namRtamu laTu
anuvuna@M gurasee napaaramu
vanitalu naMdavrajamuna@M jela@Mga@Mga
manikiki niravai malasee vee@MDae =aadi=
paramunakunu@M daa@M baramai velasina-
paripoorNa paraatparu@MDu
sarusa rukmiNiki satyabhaamakunu
varu@MDagu vaeMkaTavaradu@MDu vee@MDae =aadi=