Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, February 28, 2014

808.Emi maMdu gadde yiMtulAla yI - ఏమి మందు గద్దె యింతులాల

Audio/Archive link : Anuradha Sriram, Bullemma
ఏమి మందు గద్దె యింతులాల యీ
రామ కు తిరుపతి రాముడే మందు

వెలసెటి విరహాన వేగేటి యింతికి

చెలియలాల యేమి సేతమే
చలివేడివలపుల చవిగన్న యీపెకు
వలపించిన తనవరుడే మందు

పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు

చెదరక మమమేమి సేతమే
వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగడే మందు

పొల్లవోని యాస బొరలెటి మగువకు

చెల్లఁబోమన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు
నల్లని శ్రీవేంకటనాథుడే మందు

Emi maMdu gadde yiMtulAla yI
rAma ku tirupati rAmuDE maMdu

velaseTi virahAna vEgETi yiMtiki

cheliyalAla yEmi sEtamE
chalivEDivalapula chaviganna yIpeku
valapiMchina tanavaruDE maMdu

podigonna tamakAna@M boraleTi kAMtaku

chedaraka mamamEmi sEtamE
vuduTa@M gOrikala nonareTi yIpeku
madilOpali tanamagaDE maMdu

pollavOni yAsa boraleTi maguvaku

chella@MbOmana mEmi sEtamE
kollagA rati niMti@M gUDinA@M DIpeku
nallani SrIvEMkaTanAthuDE maMdu


807.Emani pogaDudumE yIcheli chakkadanamu - ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము


Archive page : G.Anila kumar
ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర శింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె

బిసములు శంఖమును పెనుచక్రవాకములా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక అలమేలుమంగ మేనై నిలిచె

అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

Emani pogaDudumE yIcheli chakkadanamu
yImETi yalamElmaMga yekkuvaitAniliche

arachaMdruDu@M jakOrAladdAlu saMpegayu
dhara SiMgiNulu SrIlu talirulunu
arudugA@M dummidalu naMdamugA gUDagAnu
marutalli yalamElumaMgamOmai niliche

bisamulu SaMkhamunu penuchakravAkamulA
kasamu nIlapu@MjEru karikuMbhAlu
posaga vivellA noka pODimai niluvagAnu
masalaka alamElumaMga mEnai niliche

anaTulaMpapodulu nabjamulu muttElu
vonari varusa@M gUDi vuMDagAnu
ghanuDaina SrIvEMkaTESunuramumIda
panupaDalalamElmaMga pAdamulai niliche

Interpreataton of Sri Mallina Narasimharao garu in his blog

Tuesday, February 25, 2014

806.pacchigA teliyakuMTE bahumukhamai - పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచు


Archive link : G.Balakrishnaprasad
పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచు - అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే

కొందరుఁ దిట్టుదురూ కొందరు దీవింతురు - 
చందపుసంసారపు జాడలివి


కందువ రేయిఁ బగలు కాలము నడచినట్టె - అందరిలోఁగలుగు శ్రీహరికల్పితములే


కొన్నిటిపై కోపము కొన్నిటిపై వేడుక - 
వున్నతి దేహధారుల వోజలివి


పన్ని కాయ పండు దొండపంటియందె తోచినట్టు - అన్నియుఁ బుట్టింఛిన శ్రీహరికల్పితములే


కొంతచోట మనుజులు కొంతచోట దేవతలు - 
అంతా శ్రీవేంకటనాథు నాజ్ఞలివి


చెంత చప్పనయఁ దీపు చెఱకందె వుండినట్టు - కాంతుడైన శ్రీహరికల్పితములే


pacchigA teliyakuMTE bahumukhamai tOchu

achchamai yinniyunu SrIhari kalpitamulE

koMdaru@M diTTudurU koMdaru dIViMturu

chaMdapusaMsArapu jADalivi
kaMduva rEyi@M bagalu kAlamu naDachinaTTe
aMdarilO@Mgalugu SrIharikalpitamulE

konniTipai kOpamu konniTipai vEDuka

vunnati dEhadhArula vOjalivi
panni kAya paMDu doMDapaMTiyaMde tOchinaTTu
anniyu@M buTTiMChina SrIharikalpitamulE

koMtachOTa manujulu koMtachOTa dEVatalu

aMtA SrIvEMkaTanAthu nAj~nalivi
cheMta chappanaya@M dIpu che~rakaMde vuMDinaTTu
kAMtuDaina SrIharikalpitamulE

Monday, February 24, 2014

805.ballidulu nIkaMTe parulunnArA - బల్లిదులు నీకంటెఁ బరులున్నారా

Archive link : G Anila kumar
బల్లిదులు నీకంటెఁ బరులున్నారా నన్నుఁ
దొల్లిటిబారి నింకఁ దోయకు మోయయ్య

చిక్కుల భవములఁ జెరఁజిక్కి వోపలేక
నిక్కి నీమరఁగు చొచ్చి నిలిచితివి
అక్కజమై యల్లనాడే అప్పులకర్మములెట్ల
ఇక్కడనె చుట్టిముట్టీ నేమిసేతునయ్యా

లచ్చి సంసారమునకు లగ్గమచ్చి తీరలేక
యిచ్చట నిన్నుఁగొలిచి యెక్కువైతిని
పొచ్చముల నల్లనాటిపూటఁ దీరదని కొన్ని 
బచ్చనబంధాలు వచ్చెఁ బాపగదవయ్య

అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక
ముంచి నీపాదాలకు మొరవెట్టితి
పొంచిన శ్రీవేంకటేశ భువన రక్షకుడవు 
పంచల నున్నాడ నన్నుఁ బాలించవయ్యా

ballidulu nIkaMTe@M barulunnArA nannu@M
dolliTibAri niMka@M dOyaku mOyayya

chikkula bhavamula@M jera@Mjikki vOpalEka
nikki nImara@Mgu chocchi nilichitivi
akkajamai yallanADE appulakarmamuleTla
ikkaDane chuTTimuTTI nEmisEtunayyA

lacchi saMsAramunaku laggamacchi tIralEka
yichchaTa ninnu@Mgolichi yekkuvaitini
pochchamula nallanATipUTa@M dIradani konni 
bachchanabaMdhAlu vachche@M bApagadavayya

aMchala niMdriyamula kariveTTi peTTalEka
muMchi nIpAdAlaku moraveTTiti
poMchina SrIvEMkaTESa bhuvana rakshakuDavu 
paMchala nunnADa nannu@M bAliMchavayyA

Friday, February 21, 2014

804. modalivElpa mA mo~ra yAliMchave - మొదలివేల్ప మా మొఱ యాలించవె


Archive link : G.Anila kumar
మొదలివేల్ప మా మొఱ యాలించవె
యెదుటఁ గావు మము నిదివో దేవా

ధరపై తపసుల తపములు చెరచెను
నిరతపుణ్యముల నీరుసేసెనదె
పరకామినులను భంగపెట్టెనదె
హిరణ్యకశిపుడిదివో దేవా

మునులజడ లవిగో మోపులకొలదులు
ఇనచంద్రాదుల నెక్కువగెలిచెను
చనవరి యింద్రుని స్వర్గము చేకొనె
యెనగొని హిరణ్యుడిదివో దేవా

పలుదిక్పాదులఁ బారగఁ దోలెను
బలిమినే ప్రహ్లాదుఁ బరచీని
యెలమిని శ్రీవేంకటేశ నీవలన
యిల కశిపుడు చెడె నిదివో దేవా

 modalivElpa mA mo~ra yAliMchave
yeduTa@M gAvu mamu nidivO dEvA

dharapai tapasula tapamulu cherachenu
niratapuNyamula nIrusEsenade
parakAminulanu bhaMgapeTTenade
hiraNyakaSipuDidivO dEvA

munulajaDa lavigO mOpulakoladulu
inachaMdrAdula nekkuvagelichenu
chanavari yiMdruni swargamu chEkone
yenagoni hiraNyuDidivO dEvA

paludikpAdula@M bAraga@M dOlenu
baliminE prahlAdu@M barachIni
yelamini SrIvEMkaTESa nIvalana
yila kaSipuDu cheDe nidivO dEvA


Tuesday, February 11, 2014

803.akhilalOkaikavaMdya hanumaMtuDA - అఖిలలోకైకవంద్య హనుమంతుడా

Archive link:  Tune by G.Balakrishnaprasad
అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి

అంబోధి లంఘించితివి హనుమంతుడ

కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి

అంజనీదేవ కుమార హనుమంతుడ

కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడ
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుఁడవైతివి

అట లంకసాధించిన హనుమంతుడ

చటుల సత్వసమేత జయహనుమంతుడ
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ
దటుకన బంటవై ధరణి నిల్చితివి

akhilalOkaikavaMdya hanumaMtuDA sIta-
SikhAmaNi rAmuniki@M jEkoni techchitivi

aMbOdhi laMghiMchitivi hanumaMtuDa

kuMbhinIjadUtavaiti guruhanumaMtuDa
gaMbhIrapratApamuna@M gaDagitivi
jaMbhArichE varamulu chayyana naMditivi

aMjanIdEva kumAra hanumaMtuDa

kaMjAptaphalahasta ghana hanumaMtuDa
saMjIvani dechchina SauryuDavu
raMjita vAnarakula rakshaku@MDavaitivi

aTa laMkasAdhiMchina hanumaMtuDa

chaTula satwasamEta jayahanumaMtuDa
ghaTana nalamElmaMgakAMtu SrIvEMkaTESuku@M
daTukana baMTavai dharaNi nilchitivi

Monday, February 10, 2014

802.chadivi batukarO sarvajanulu meeru - చదివి బతుకరో సర్వజనులు మీరు


Archive page: Balakrishnaprasad
చదివి బతుకరో సర్వజనులు మీరు 
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||

సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు 

వేదవ్యాసులు చదివిన చదువు |
ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే ||

సతతము మునులెల్ల చదివినట్టిచదువు 

వెతదీర బ్రహ్మ చదివిన చదువు |
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు 
గతిగా నారాయణాష్టాక్షర మిదియే  ||

చలపట్టి దేవతులు చదివినట్టిచదువు 

వెలయ విప్రులు చదివేటి చదువు |
పలుమారు శ్రీ వేంకటపతి నామమై భువి 
కలుగు నారాయణాష్టాక్షర మిదియే  ||

chadivi batukarO sarvajanulu meeru 
kadisi naaraayaNaashTaakshara midiyae ||


saadhiMchi munnuSukuDu chadivinaTTichaduvu 
vaedavyaasulu chadivina chaduvu |
aadikaalapu vaishNavulaMdari nOTi chaduvu
gaadili naaraayaNaashTaakshara midiyae ||


satatamu munulella chadivinaTTichaduvu 
veta deera brahma chadivina chaduvu |
jatanamai prahlaaduDu chadivinaTTi chaduvu 
gatigaa naaraayaNaashTaakshara midiyae  ||

chalapaTTi daevatulu chadivinaTTichaduvu 
velayaa vipru lu chadivaeTi chaduvu |
palumaaru Sree vaeMkaTapati naamamai
bhuvi kalugu naaraayaNaashTaakshara midiyae  ||

Sunday, February 09, 2014

801. ArtuDanEnu nI kaDDa meMdunu - ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు


 
Youtube Link:

ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు
మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే

సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు
సర్వసర్వం సహా చక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే

పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు 
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుడ నన్ను సరిఁ గావవే

అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు
ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు

ArtuDanEnu nI kaDDa meMdunu lEdu
mUrti trayAtmaka mogi karuNiMchavE

sarwasAkshivi nIvu sarvAMtaraMguDavu
sarvasarvaM sahA chakravarti
nirvANamUrti nigamAMtakIrti
sarvAparAdhamulu kshamiyiMpavE

paramAtmuDavu nIvu paraMjyOtivi nIvu 
parama parAnaMda paramapurushA
karirAjavaradA kAruNyanilayA
SaraNAgatuDa nannu sari@M gAvavE

aNuvulOpali nIvu Adimahattunu nIvu
praNuta SrIvEMkaTaprachuranilayA
aNimAdivibhavA AdyaMtarahitA
gaNutiMchi nApAla@M galugavE nIvu