764.inni chaMdAlaku guri yI vanitayai unnadi - ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది
Audio link : Sri Balakrishnaprasad
ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది
యెన్నుకొని వేడుకతో నేలుదువుగాని
చేరి నీవు పెంచిన చిలుక కాదు సుమీ
పేరుకొని నీ దేవులు పిలిచీఁగానీ
కూరిమి నీ వనములలో కోవిల కాదు సుమీ
సారెకు నాకె నిన్నుఁగొసరి పాడీనీ
తొలుత నీ కొలఁకుల తొమ్మిదలు గావు సుమీ
సొలసి చూచిన యాపె చూపులు గాని
చలాన నీపై వాలిన జక్కవలు గావు సుమీ
కులికి నిన్నొరసేటి గుబ్బలు ఘాని
తతి నీపావురాల రొద లివి గావు సుమీ
రతినాపె మదనమంత్రములు గాని
యితవుగా శ్రీవేంకటేశ యింతిగూడితివి
మతకారి గాదుసుమీ మంచి రాయంచగాని
inni chaMdAlaku guri yI vanitayai unnadi
yennukoni vEDukatO nEluduvugAni
chEri nIvu peMchina chiluka kAdu sumI
pErukoni nI dEvulu pilichii@MgAnI
kUrimi nI vanamulalO kOvila kAdu sumI
sAreku nAke ninnu@Mgosari pADInI
toluta nI kola@Mkula tommidalu gAvu sumI
solasi chUchina yApe chUpulu gAni
chalAna nIpai vAlina jakkavalu gAvu sumI
kuliki ninnorasETi gubbalu GAni
tati nIpAvurAla roda livi gAvu sumI
ratinApe madanamaMtramulu gAni
yitavugA SrIvEMkaTESa yiMtigUDitivi
matakAri gAdusumI maMchi rAyaMchagAni
2 comments:
శ్రావణ్ గారు... ఈ లింకులో ఈ సంకీర్తనకు వీడియో ఉంది..
http://www.youtube.com/watch?v=hv48YYg5g_Q
Sai garu, thanks for sharing.
i have embedded the video.
thanks,
Sravan
Post a Comment