756.తినరాని కొనరాని దేవలోకపు పండు - tinarAni konarAni dEvalOkapu paMDu
youtube video link : Explanation by Dr.Patanjali , sung by sri Sattiraju Venumadhav
తినరాని కొనరాని దేవలోకపు పండు
మనసునఁదలచితే మరిగించే పండు
పంటకెక్కి పాలవెల్లి పండిన పాలపండు
తొంటి గొల్లెతల మోవి దొండ పండు
అంటుకొన్న మేనిచాయ అల్లునేరేడుపండు
ముంటిసింహపుగోళ్ళ ముండ్ల పండు
ఇచ్చల వేదశాస్త్రాలు దెచ్చిన పేరీత పండు
తచ్చిన దైత్యమారి దేవదారు పండు
పచ్చిదేర మెరసిన బండిగురువిందపండు
యిచ్చవలెనన్న వారి యింతనంటిపండు
తెమ్మగా మునులపాలి తియ్యని చింతపండు
తె(తి?)మ్మల సిరివలపు తేనెపండు
యిమ్ముల శ్రీవేంకటాద్రి నింటింటిముంగిటిపండు
కొమ్మల పదారువేల గొప్ప మామిడి పండు
tinarAni konarAni dEvalOkapu paMDu
manasuna@MdalachitE marigiMchE paMDu
paMTakekki pAlavelli paMDina pAlapaMDu
toMTi golletala mOvi doMDa paMDu
aMTukonna mEnichAya allunErEDupaMDu
muMTisiMhapugOLLa muMDla paMDu
ichchala vEdaSAstrAlu dechchina pErIta paMDu
tachchina daityamAri dEvadAru paMDu
pachchidEra merasina baMDiguruviMdapaMDu
yichchavalenanna vAri yiMtanaMTipaMDu
temmagA munulapAli tiyyani chiMtapaMDu
te(ti?)mmala sirivalapu tEnepaMDu
yimmula SrIvEMkaTAdri niMTiMTimuMgiTipaMDu
kommala padAruvEla goppa mAmiDi paMdu
1 comment:
అద్భుతమైన వివరన ఇచ్చారు, దాక్టర్ పతంజలి గారు :)
Post a Comment