Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, October 28, 2011

764.inni chaMdAlaku guri yI vanitayai unnadi - ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది


Audio link : Sri Balakrishnaprasad
ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది
యెన్నుకొని వేడుకతో నేలుదువుగాని


చేరి నీవు పెంచిన చిలుక కాదు సుమీ
పేరుకొని నీ దేవులు పిలిచీఁగానీ
కూరిమి నీ వనములలో కోవిల కాదు సుమీ
సారెకు నాకె నిన్నుఁగొసరి పాడీనీ


తొలుత నీ కొలఁకుల తొమ్మిదలు గావు సుమీ
సొలసి చూచిన యాపె చూపులు గాని
చలాన నీపై వాలిన జక్కవలు గావు సుమీ
కులికి నిన్నొరసేటి గుబ్బలు ఘాని


తతి నీపావురాల రొద లివి గావు సుమీ
రతినాపె మదనమంత్రములు గాని
యితవుగా శ్రీవేంకటేశ యింతిగూడితివి 
మతకారి గాదుసుమీ మంచి రాయంచగాని



inni chaMdAlaku guri yI vanitayai unnadi
yennukoni vEDukatO nEluduvugAni


chEri nIvu peMchina chiluka kAdu sumI
pErukoni nI dEvulu pilichii@MgAnI
kUrimi nI vanamulalO kOvila kAdu sumI
sAreku nAke ninnu@Mgosari pADInI


toluta nI kola@Mkula tommidalu gAvu sumI
solasi chUchina yApe chUpulu gAni
chalAna nIpai vAlina jakkavalu gAvu sumI
kuliki ninnorasETi gubbalu GAni


tati nIpAvurAla roda livi gAvu sumI
ratinApe madanamaMtramulu gAni
yitavugA SrIvEMkaTESa yiMtigUDitivi 
matakAri gAdusumI maMchi rAyaMchagAni

Tuesday, October 25, 2011

763. mA duritamulu vApi mammugAchuTarudA - మా దురితములు వాపి మమ్ముగాచుటరుదా


Audio link : Sri Balakrishnaprasad
మా దురితములు వాపి మమ్ముగాచుటరుదా 
శ్రీదేవీరమణుడా శ్రీవేంకటేశ 


అంబరీషు పైకొన్న ఆపదలన్నియు బాపి
బెంబడి గాచె నీచే పెను చక్రము
అంబరాననున్న ధృవు నజ్ఞానమెల్ల బాపె
పంబి నీచేతనుండిన పాంచజన్యము


పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పె నీచేగద
తొక్కి హిరణ్యకశిపుఁ దునిమి ప్రహ్లాదుగాచె 
నిక్కి నిక్కి మెరిచేటి నీ ఖడ్గము


వెడ రావణుని జంపి విచీషణుని గాచె 
చిడుముడి పడక నీచే శార్ఙ్గము
యెడమీక శ్రీవేంకటేశ నేడు నన్నుగాచె
బడిబడి నీనామ పఠన నేడిదిగో


 mA duritamulu vApi mammugAchuTarudA 
SrIdEvIramaNuDA SrIvEMkaTESa 


aMbarIShu paikonna Apadalanniyu bApi
beMbaDi gAche nIchE penu chakramu
aMbarAnanunna dhRvu naj~nAnamella bApe
paMbi nIchEtanuMDina pAMchajanyamu


pakkana jarAsaMdhu balamella nuggADi
nikkamu madhuranilpe nIchEgada
tokki hiraNyakaSipu@M dunimi prahlAdugAche 
nikki nikki merichETi nI khaDgamu


veDa rAvaNuni jaMpi vichIShaNuni gAche 
chiDumuDi paDaka nIchE SAr~mgamu
yeDamIka SrIvEMkaTESa nEDu nannugAche
baDibaDi nInAma paThana nEDidigO



Monday, October 24, 2011

762.mudamalara kAlamula mIriTu mOsapOka - ముదమలర కాలముల మీరిటు మోసపోక


Audio link : Sri Balakrishnaprasad
ముదమలర కాలముల మీరిటు మోసపోక
హృదయమలర భజింపరో మీరిటు 
ధనుర్మాసముల విధులన్


వేగనాలుగు ఘడియలనగా 
వేదవేద్యులు లేచి సరగున
నాగమోక్తవిధులను తమదేహానుగుణములుగా
వేగమున సంధ్యాదులొగిఁ గా
వించి విమలాంబోధిశయనుని
బాగుగ పూజించరో యెడ
పక ధనుర్మాసముల విధులనె ఘనులు


పరగు చీనాంబరములను నతి
పరిమళమ్ముల బుష్పముల కడు
వెరవుగా వేంకటాపతి (కినై) వేద్య సంగతుల
అరుదుగా ధూపముల బహుదీ
పాదులను తాంబూల విధులను
పరగ పూజింపుడు సమస్త
ప్రభు ధనుర్మాసమున విధులన్(నె) ఘనులు



mudamalara kAlamula mIriTu mOsapOka
hRdayamalara bhajiMparO mIriTu dhanurmAsamula vidhulan


vEganAlugu ghaDiyalanagA 
vEdavEdyulu lEchi saraguna
nAgamOktavidhulanu tamadEhAnuguNamulugA
vEgamuna saMdhyAdulogi@M gA
viMchi vimalAMbOdhiSayanuni
bAguga pUjiMcharO yeDa
paka dhanurmAsamula vidhulane ghanulu


paragu chInAMbaramulanu nati
parimaLammula bushpamula kaDu
veravugA vEMkaTApati (kinai) vEdya saMgatula
arudugA dhUpamula bahudI
pAdulanu tAMbUla vidhulanu
paraga pUjiMpuDu samasta
prabhu dhanurmAsamuna vidhulan(ne) ghanulu



Saturday, October 22, 2011

761. vAsivaMtu viDichinavADE yOgi - వాసివంతు విడిచినవాడే యోగి


Audio link : Smt Shobharaju
వాసివంతు విడిచినవాడే యోగి
ఆసలెల్లా విడిచిన ఆతడే యోగి


గద్దించి పారెడు తురగము వంటి మనసు
వద్దని మరలించినవాడె యోగి
వొద్దనే కొండలవంటి వున్నతదేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాడే ధీరుడైన యోగి


ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుగనట్టివాడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారజల్లువాడే తత్త్వమైనయోగి


వెగటు కామాదుల వెళ్ళగొట్టి శాంతుడై
వగలుడిగినయట్టివాడే యోగి
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుడై భక్తిఁ
దగిలి నిలుపువాడే ధన్యుడైనయోగి

vAsivaMtu viDichinavADE yOgi
AsalellA viDichina AtaDE yOgi


gaddiMchi pAreDu turagamu vaMTi manasu
vaddani maraliMchinavADe yOgi
voddanE koMDalavaMTi vunnatadEhaguNAlu
diddi maTTupeTTuvADE dhIruDaina yOgi


muMchukonna yiMdriyapu mOhajaladhilOna
vaMchana munuganaTTivADE yOgi
poMchi puNyapApamulu poTTuvaMTi karmamulu
daMchi pArajalluvADE tattwamainayOgi


vegaTu kAmAdula veLLagoTTi SAMtuDai
vagaluDiginayaTTivADE yOgi
nigiDi SrIvEMkaTapati nijadAsuDai bhakti@M
dagili nilupuvADE dhanyuDainayOgi






Wednesday, October 19, 2011

760.chUDachinnadAVanaviMtE suddulu - చూడచిన్నదానవింతే సుద్దులు


Audio link  : Sri G Balakrishnaprasad


Audio download link 
చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి


సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి


కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి



chUDachinnadAVanaviMtE suddulu kOTAna@MgOTi
yEDEDa nEruchukoMTivE vO kaliki


kinneramITulalOni giligiMtalu , nI 
vannela kanuchUpula valavaMtalu
yennarAni yichchakapu TelayiMtalu
yennaDu nEruchukoMTivE vO kaliki


sAreku neDavAyani sarasamulu , nI
tArukANa sannala tamakamulu
gAraviMchi bujjagiMchE gamakamulu
yErIti nEruchukoMTivE vO kaliki


kaMduva SrIvEMkaTESu kalayikalu , nI
yaMdamaina samarati yalayikalu
poMdula munumuMgili polayikalu
yeMdeMdu nEruchukoMTivE vO kaliki

Tuesday, October 18, 2011

759.idivO mAyiMTa nEDu yiMta sEse kRShNuDu - ఇదివో మాయింట నేడు యింత సేసె కృష్ణుడు

Audio link : NC Sridevi (?)
ఇదివో మాయింట నేడు యింత సేసె కృష్ణుడు
అదివో మాయింటాను అంత సేసె కృష్ణుడు


గంట వాగకుండా నిండఁ గసవు దురిగి మా-
యింతివారు నిద్దురించ నిల్లు జొచ్చెను
అంటివచ్చి నొకదూడ ఆవూరి మేసితేను
గంట గణగణా వాగె గక్కన మేల్కంటిమి


వొక్కరోలు దాపు వెట్టి వుట్టియెక్కి ఆందుమీది -
చక్కెరల్ల మెసగి మా చంటివానిని
వుక్కఁబట్టి వుట్టిమీద నినుచి రోలుదీసె
చొక్కి తా నెందున్నాడో చొప్పు ఇదే కంటిమి


ఆవుల వెళ్ళ విడిచె నవి నే తోలిదేబోతే
నీవల దూడలఁ దెచ్చి యింటిలో గట్టె(ను)
దావతి నింతా వెదకి తలుపు దెరచితేను
శ్రీవేంకటేశునిమాయఁజిక్కి లోన నున్నవి


idivO mAyiMTa nEDu yiMta sEse kRShNuDu
adivO mAyiMTAnu aMta sEse kRShNuDu


gaMTa vAgakuMDA niMDa@M gasavu durigi mA-
yiMtivAru nidduriMcha nillu jochchenu
aMTivachchi nokadUDa AvUri mEsitEnu
gaMTa gaNagaNA vAge gakkana mElkaMTimi


vokkarOlu dApu veTTi vuTTiyekki AMdumIdi -
chakkeralla mesagi mA chaMTivAnini
vukka@MbaTTi vuTTimIda ninuchi rOludIse
chokki tA neMdunnADO choppu idE kaMTimi


Avula veLLa viDiche navi nE tOlidEbOtE
nIvala dUDala@M dechchi yiMTilO gaTTe(nu)
dAvati niMtA vedaki talupu derachitEnu
SrIvEMkaTESunimAya@Mjikki lOna nunnavi

Get this widget | Track details | eSnips Social DNA

Tuesday, October 11, 2011

758.SishTulanu manniMchE SiSuvItaDu - శిష్టులను మన్నించే శిశువీతడు

Audio link : 
శిష్టులను మన్నించే శిశువీతడు
దుష్టులనణచి భూమిఁ దుదకెక్కు నీతడు


దేవకీదేవి వసుదేవులకు జనియించె
భావించ కృష్ణుడు పరబ్రహ్మము
శ్రావణ బహుళాష్టమి సమకూడె నడురేయి
యీవేళ రోహిణి యిన్నిటను మంచిది


గండముతో పుట్టెనదె కంసునికి మేనల్లుడు
పాండవులకందరికి బావమరిది
దుండగపు భూభారము తొలగదొబ్బునీతడు
యెండనీడ కన్నులవాడిక నింతా మంచిది


ఆవులీతనిపేరిట నచ్చివచ్చు లెంచి చూడ
వేవేలు గొల్లెతలకు విటుడవును
శ్రీవేంకటాద్రి నున్నాడు చేరి అలమేల్మంగతో
యీవల పెద్దలు చెప్పిరిక నింతౌ మంచిది


SishTulanu manniMchE SiSuvItaDu
dushTulanaNachi bhUmi@M dudakekku nItaDu


dEvakIdEvi vasudEvulaku janiyiMche
bhAviMcha kRshNuDu parabrahmamu
SrAvaNa bahuLAshTami samakUDe naDurEyi
yIvELa rOhiNi yinniTanu maMchidi


gaMDamutO puTTenade kaMsuniki mEnalluDu
pAMDavulakaMdariki bAvamaridi
duMDagapu bhUbhAramu tolagadobbunItaDu
yeMDanIDa kannulavADika niMtA maMchidi


AvulItanipEriTa nachchivachchu leMchi chUDa
vEvElu golletalaku viTuDavunu
SrIvEMkaTAdri nunnADu chEri alamElmaMgatO
yIvala peddalu cheppirika niMtau maMchidi


Get this widget | Track details | eSnips Social DNA

Sunday, October 09, 2011

757.సారెనేలే జగడము సారెనేలే సణగులు - sArenElE jagaDamu sArenElE saNagulu

Audio link :
సారెనేలే జగడము సారెనేలే సణగులు
సారెనేలే పతితో పంతము సారెనేలే 


పెదవులు గొణగుచు బీరములాడుచు
కొదలు తిట్లనే కొసరుచును


నెలవులు నవ్వేవు చేతులు చాచేవు
సళువుజూపులనే చల్లేవు


చిడుముడిపడకువె శ్రీవేంకటపతి 
కడప రాయడయి కయికొనెను

sArenElE jagaDamu sArenElE saNagulu
sArenElE patitO paMtamu sArenElE 

pedavulu goNaguchu bIramulADuchu
kodalu tiTlanE kosaruchunu

nelavulu navvEvu chEtulu chAchEvu
saLuvujUpulanE challEvu

chiDumuDipaDakuve SrIvEMkaTapati 
kaDapa rAyaDayi kayikonenu

Get this widget | Track details | eSnips Social DNA

Saturday, October 08, 2011

756.తినరాని కొనరాని దేవలోకపు పండు - tinarAni konarAni dEvalOkapu paMDu


youtube video link : Explanation by Dr.Patanjali , sung by sri Sattiraju Venumadhav
తినరాని కొనరాని దేవలోకపు పండు
మనసునఁదలచితే మరిగించే పండు


పంటకెక్కి పాలవెల్లి పండిన పాలపండు
తొంటి గొల్లెతల మోవి దొండ పండు
అంటుకొన్న మేనిచాయ అల్లునేరేడుపండు
ముంటిసింహపుగోళ్ళ ముండ్ల పండు


ఇచ్చల వేదశాస్త్రాలు దెచ్చిన పేరీత పండు
తచ్చిన దైత్యమారి దేవదారు పండు
పచ్చిదేర మెరసిన బండిగురువిందపండు
యిచ్చవలెనన్న వారి యింతనంటిపండు


తెమ్మగా మునులపాలి తియ్యని చింతపండు
తె(తి?)మ్మల సిరివలపు తేనెపండు
యిమ్ముల శ్రీవేంకటాద్రి నింటింటిముంగిటిపండు
కొమ్మల పదారువేల గొప్ప మామిడి పండు


tinarAni konarAni dEvalOkapu paMDu
manasuna@MdalachitE marigiMchE paMDu

paMTakekki pAlavelli paMDina pAlapaMDu
toMTi golletala mOvi doMDa paMDu
aMTukonna mEnichAya allunErEDupaMDu
muMTisiMhapugOLLa muMDla paMDu

ichchala vEdaSAstrAlu dechchina pErIta paMDu
tachchina daityamAri dEvadAru paMDu
pachchidEra merasina baMDiguruviMdapaMDu
yichchavalenanna vAri yiMtanaMTipaMDu

temmagA munulapAli tiyyani chiMtapaMDu
te(ti?)mmala sirivalapu tEnepaMDu
yimmula SrIvEMkaTAdri niMTiMTimuMgiTipaMDu
kommala padAruvEla goppa mAmiDi paMdu


Monday, October 03, 2011

755.kAlamulArunu galige nIkunide - కాలములారును గలిగె నీకునిదె

కాలములారును గలిగె నీకునిదె
బాలకి యందే పై పై నీకు


సతికొప్పు విరులు జలజల రాలిన
లతలవసంత కాలము నీకు
కతగా తనమైకాకలు చూపిన
అతివేసవి కాలమప్పుడే నీకు


కాగిటిచెమటల కడు నినుఁ దడిపిన
కాగల తొలుకరి కాలమది
వీగని చూపుల వెన్నెల చల్లిన
రాగినమతికి శరత్కాలంబు


లంచపుఁబులకల లలన నీరతుల
కంచపు హేమంత కాలమది
యెంచగ శ్రీవెంకటెశ వలపుసతి
వంచ శిసిరకాల వైభవమాయ


kAlamulArunu galige nIkunide
bAlaki yaMdE pai pai nIku


satikoppu virulu jalajala rAlina
latalavasaMta kAlamu nIku
katagA tanamaikAkalu chUpina
ativEsavi kAlamappuDE nIku


kAgiTichemaTala kaDu ninu@M daDipina
kAgala tolukari kAlamadi
vIgani chUpula vennela challina
rAginamatiki SaratkAlaMbu


laMchapu@Mbulakala lalana nIratula
kaMchapu hEmaMta kAlamadi
yeMchaga SrIveMkaTeSa valapusati
vaMcha SisirakAla vaibhavamAya

Dr.Patanjali gari vivarana, Sattiraju Venumdhav gari gatram.