Audio link : Sri Balakrishnaprasadచిత్తజగురుడ వో శ్రీనరసింహాబత్తిసేసేరు మునులు పరికించవయ్యా
సకలదేవతలును జయవెట్టుచున్నారుచకితులై దానవులు సమసిరదెఅకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కెప్రకటమైన నీ కోపము మానవయ్యాతుంబురునారదాదులు దొరకొని పాడేరు అంబుజాసనుడభయమడిగీనదెఅంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడిశంబరరిపుజనక శాంతము చూపవయ్యాహత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులుచిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదెయిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యాchittajaguruDa vO SrInarasiMhA
battisEsEru munulu parikiMchavayyA
sakaladEvatalunu jayaveTTuchunnAru
chakitulai dAnavulu samasirade
akalaMkayagu lakshmiyaTu nI toDapai nekke
prakaTamaina nI kOpamu mAnavayyA
tuMburunAradAdulu dorakoni pADEru
aMbujAsanuDabhayamaDigInade
aMbaravIdhi nADEru yachcharalaMdarugUDi
SaMbararipujanaka SAMtamu chUpavayyA
hatti kolichErade yakshulunu gaMdharvulu
chittagiMchu pogaDEru siddhasAdhyulu
sattugA nI dAsulamu SaraNu chochchiti mide
yittala SrIvEMkaTESa yElukonavayyA