Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, April 01, 2009

605.yeMtani nutiyiMtu rAmarAma - యెంతని నుతియింతు రామరామ



Audio link :


యెంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ
పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ

బలుసంజీవికొండ రామరామ బంటుచే తెప్పించితివి రామరామ
కొలదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ
వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ
పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ

శరణంటే విభీషణుని రామరామ చయ్యనగాచితివట రామరామ
బిరుదుల రావణుని రామరామ పీచమడచితివట రామరామ
ధరలో చక్రవాళము రామరామ దాటివచ్చితివట రామరామ
సురలు నుతించిరట రామరామ నీ చొప్పు యిక నదియెంతో రామరామ

సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులు తమ్ములట రామరామ
నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ
శ్రీమంతుడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీద రామరామ
కామితఫలదుడవు రామరామ కౌసల్యానందనుడవు రామరామ
yeMtani nutiyiMtu rAmarAma yiTTi nIpratApamu rAmarAma
paMtAna samudramu rAmarAma baMdhiMchavachchunA rAmarAma

balusaMjIvikoMDa rAmarAma baMTuchE teppiMchitivi rAmarAma
koladilEnivAlini rAmarAma okkakOla nEsitivaTa rAmarAma
velaya nekkuveTTi rAmarAma haruvillu virichitivaTa rAmarAma
peluchu bhUmijanu rAmarAma peMDlADitivaTa rAmarAma

SaraNaMTE vibhIShaNuni rAmarAma chayyanagAchitivaTa rAmarAma
birudula rAvaNuni rAmarAma pIchamaDachitivaTa rAmarAma
dharalO chakravALamu rAmarAma dATivachchitivaTa rAmarAma
suralu nutiMchiraTa rAmarAma nI choppu yika nadiyeMtO rAmarAma

saumitri bharatulu rAmarAma Satrughnulu tammulaTa rAmarAma
nI mahattwamu rAmarAma niMDe jagamulellA rAmarAma
SrImaMtuDa vanniTAnu rAmarAma SrIvEMkaTagirimIda rAmarAma
kAmitaphaladuDavu rAmarAma kausalyAnaMdanuDavu rAmarAma

3 comments:

హర్షోల్లాసం said...

mari chappagaavumdi saahityam kada?

Sravan Kumar DVN said...

annamayya paridhi vistaram.
milanti panditula kosame kakunda , saralamaina bhashalo palle vasulu padukune vidham ga janapadalu kuda chala rasaru. so ee kirtana , janapadalu/bhajana/kolatam category loki vastundi.

Sravan Kumar DVN said...

ade annamayya devedevambhaje, ramamindivara syayam, namonamojagadekanadha lanti samskruta kirtanalu, avadharu raghupati, kolichina varala , ramudu raghavudu lanti chakkani telugu kirtanalu,
ramudu lokabhiramudu, rama dayapara sima , ramachandruditadu lanti saralamaina tleugu lo kiranalu,

inka bhali bhali rama lanti janapadalu kuda rasaru.

http://annamacharya-lyrics.blogspot.com/search/label/Deity%3ARama