609.siridolaMkeDi pagalu - సిరిదొలంకెడి పగలు చీకటా యితడేమి
Audio link : Priya Sisters
సిరిదొలంకెడి పగలు చీకటా యితడేమి
యిరవు దెలిసియు తెలియనియ్య డటుగాన
తలపోయ హరినీలదర్పణంబో ఇతడు
వెలుగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణం బటువలెనె కాబోలు లోకంబు
గలదెల్ల వెలిలోన కనిపించుగాన
మేరమీరిన నీలమేఘమో యితడేమి
భూరిసంపదలతో పొలయుచున్నాడు
కారుణ్యనిధియట్ల కాబోలు ప్రాణులకు
కోరికలు తలపులో కురియు నటుగాన
తనివోని ఆకాశ తత్వమో యితడేమి
అనఘుడీ తిరు వేంకటాద్రివల్లభుడు
ఘనమూర్తి ఆటువలెనెకాబోలు సకలంబు
తనయందె యణగి హుద్భవమందుగానsiridolaMkeDi pagalu chIkaTA yitaDEmi
yiravu delisiyu teliyaniyya DaTugAna
talapOya harinIladarpaNaMbO itaDu
veluguchunnADu bahuvibhavamulatODa
kalaguNaM baTuvalene kAbOlu lOkaMbu
galadella velilOna kanipiMchugAna
mEramIrina nIlamEghamO yitaDEmi
bhUrisaMpadalatO polayuchunnADu
kAruNyanidhiyaTla kAbOlu prANulaku
kOrikalu talapulO kuriyu naTugAna
tanivOni AkASa tatwamO yitaDEmi
anaghuDI tiru vEMkaTAdrivallabhuDu
ghanamUrti ATuvalenekAbOlu sakalaMbu
tanayaMde yaNagi hudbhavamaMdugAna
No comments:
Post a Comment