Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-475 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, February 19, 2009

586.mEDalekki ninnu jUchi - మేడలెక్కి నిన్నుఁ జూచి


Archive link :
Youtube link:


యాలపదాలు - దేసాళం
మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా .. ౧
పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా .. ౨
దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి ముప్పిరి నీ విరహానను - వెంకటేశ నిప్పనుచు భ్రమసితిరా .. ౩
నిండఁ బూచిన మానిపై - గండుఁగోవిల గూయగా నిండిన నీయెలుఁగంటాను - వెంకటేశ అండకు నిన్ను రమ్మంటిరా .. ౪
వుదయచందురుఁ జూచి - అదె నీపంజని సవి యెదురుకోనే వచ్చితిరా - వెంకటేశ బెదరి మారుమోమైతిరా .. ౫
మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ కన్నులంటాఁ జేరఁ బోఁగాను - వెంకటేశ పన్ని మరునమ్ములాయరా .. ౬
ఆనిన తుమ్మిదలు నీ - మేనికాంతిఁ బోలునని పూనిచేతఁ బట్టఁ బోఁగాను - వెంకటేశ సూనాస్త్రుని వేగులాయరా .. ౭
కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని పొంద నిన్నుఁ దలఁచితిరా - వెంకటేశ అంది చొక్కు మందులాయరా .. ౮
బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి నిండుజాగరములుంటిరా - వెంకటేశ యెండలాయ వెన్నెలలు రా ..౯
నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండఁ గలగంటి చద్దివేఁడి వలపాయరా - వెంకటేశ సుద్దులింకా నేమి సేసేవో .. ౧౦
మల్లెపూవు కొనదాకి - ఝల్ల నను బులకించి వుల్లము నీకొప్పించితిరా -వెంకటేశ కల్లగాదు మమ్ముఁ గావరా .. ౧౧
జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా గోడలేని చిత్తరువులై - వెంకటేశ యాడా నామతిఁ బాయవురా .. ౧౨
అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండఁగా కొద్దిలేని కాఁకతోడను - వెంకటేశ పొద్దువోక తమకింతురా ..౧౩
పావురమురెక్కఁ జీటి - నీవొద్దికిఁ గంటియంపి దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ నీవిందు రావలెనంటాను ..౧౪
బంగారు పీఁటపైనుండి - ముంగిటికి నీవురాఁగా తొంగిచూచి నిలుచుండగా - వెంకటేశ యెంగిలిమోవేలడిగేవు ..౧౫
దంతపుఁ బావాలు మెట్టి - పంతాన నేను రాఁగాను యింతలో బలిమిఁ బట్టేవు - వెంకటేశ అంత నీకుఁ బ్రియమైతినా .. ౧౬
పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ దిట్టవు నీయంతవారమా .. ౧౭
కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేఁత సేసి తప్పక నేఁ జూచినంతలో- వెంకటేశ చిప్పిలేల చెమరించేవు ..౧౮
బొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ నిమ్మపంట వేతునటరా ..౧౯
నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి వొత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ కొత్తలైన జాణవౌదువు ..౨౦
వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ కన్నుల పండువలాయరా .. ౨౧
చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ పలుకు రతిరహస్యాలు - వెంకటేశ తలఁచినేఁ దలవూతురా .. ౨౨
నీకు వలచిన వలపు - లాకలొత్తె నామతిని వాకున నేఁ జెప్పఁ జాలరా - వెంకటేశ లోకమెల్లానెరిఁగినదే .. ౨౩
పాయము నీకొక్కనికే - చాయగా మీఁదెత్తితిని యీయెడఁ గై వాలకుండాను - వెంకటేశ మా యింటనే పాయకుండరా .. ౨౪
ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ చిమ్ముఁ జీఁకటెల్లఁ బాయను. ..౨౫
No comments: