Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, February 28, 2009

590.veggalamiMtA vRthA - వెగ్గలమింతా వృథా వృథా






Archive link :

వెగ్గలమింతా వృథా వృథా
తగ్గి పరులతో దైన్యములేల

పెంచగ పెంచగ పెరిగీ నాశలు
తుంచగ తుంచగ తొలగునవి
కంచము కూడును కట్టిన కోకయు
వంచనమేనికి వలసినదింతే

తడవగ తడవగ తగిలీ బంధము
విడువగ విడువగ వీడునవి(ది)
గుడిశలోన నొకకుక్కిమంచమున
వొడలు సగమునకు వుండెడిదింతే

మరవగ మరవగ మాయలే యింతా
మురహరుదలచితే మోక్షము
నిరతి శ్రీవేంకటనిలయుడే కాయపు-
గరిమెల నిలిచిన కాణాచింతే

veggalamiMtA vRthA vRthA
taggi parulatO dainyamulEla

peMchaga peMchaga perigI nASalu
tuMchaga tuMchaga tolagunavi
kaMchamu kUDunu kaTTina kOkayu
vaMchanamEniki valasinadiMtE

taDavaga taDavaga tagilI baMdhamu
viDuvaga viDuvaga vIDunavi(di)
guDiSalOna nokakukkimaMchamuna
voDalu sagamunaku vuMDeDidiMtE

maravaga maravaga mAyalE yiMtA
muraharudalachitE mOkshamu
nirati SrIvEMkaTanilayuDE kAyapu-
garimela nilichina kANAchiMtE

Thursday, February 26, 2009

589.sakala lOkESwarulu - సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు





Intoduction by Dr.Pappu venugopalarao , Flowersathisfeet boot author

Archive link :







సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు
అకలంకముగ పుష్పయాగంబు

వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల దిరువాముడియు నంగనలయాటతో
కవివందినుతులతో కమ్మపూజలతోడ
నవధరించీ పుష్పయాగంబు

కప్పురపుటారతులు ఘనచందనముతోడ
తెప్పలధూపముల తిరువందికాపుతో
వొప్పుగఁ బణ్యారములు వొగి పెక్కు వగలతో
అప్పడందీ పుష్పయాగంబు

తగు చత్రచామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పదిపూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీవేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు

sakala lOkESwarulu sarusa@M jEkonu vADu
akalaMkamuga pushpayAgaMbu

vividha pushpamulatO vEdaghOshamulatO
avala diruvAmuDiyu naMganalayATatO
kavivaMdinutulatO kammapUjalatODa
navadhariMchI pushpayAgaMbu

kappurapuTAratulu ghanachaMdanamutODa
teppaladhUpamula tiruvaMdikAputO
voppuga@M baNyAramulu vogi pekku vagalatO
appaDaMdI pushpayAgaMbu

tagu chatrachAmara tAMbUlamulatODa
pagaTutO nIrIti padipUjalaMdukoni
jigimIre chUDarE SrIvEMkaTESwaruni
agaNitaMbagu pushpayAgaMbu



Sunday, February 22, 2009

588.EmI eruganu nEnu ika nIchittamurA - ఏమీ ఎఱుగను నేను ఇక నీచిత్తమురా






Archive link :
ఏమీ ఎఱుగను నేను ఇక నీచిత్తమురా
దోమటి వయసు నాపై తోసినట్టె తోయరా

తలపెల్లా నీది తమకమే నాది
చెలగి యేమి సేసిన జేయరా నీవు
పలుకు నీతోనే పంతమే నాలోను
చలివలపులు నాపై (జల్లినట్టు చల్లరా

వాలుచూపులు నీపై వడియ(జెమట నాపై
కేల నాచన్నులు పిసికినట్టే పిసుకరా
ఆలకింపు నీకొరకు అలయక నాకొరకుక్
నాలిసేసి నీవు నాతో నవ్వినట్టే నవ్వరా

కాగిలిదె నీకు కళదాకేది నాకు
యేగక నీమోవి నాకు నిచ్చినంతా నియ్యరా
పాగిన శ్రీవేంకటేశ పైకొని కూడితినదె
ఆ(గె నిద్దరి మనసు లంటినట్టె యంటరా



EmI e~ruganu nEnu ika nIchittamurA
dOmaTi vayasu nApai tOsinaTTe tOyarA

talapellA nIdi tamakamE nAdi
chelagi yEmi sEsina jEyarA nIvu
paluku nItOnE paMtamu nAlOnu
chalivalapulu nApai (jallinaTTu challarA

vAluchUpulu nIpai vaDiya(jemaTa nApai
kEla nAchannulu pisikinaTTE pisukarA
AlakiMpu nIkoraku alayaka nAkorakuk
nAlisEsi nIvu nAtO navvinaTTE navvarA

kAgilide nIku kaLadAkEdi nAku
yEgaka nImOvi nAku nichchinaMtA niyyarA
pAgina SrIvEMkaTESa paikoni kUDitinade
A(ge niddari manasu laMTinaTTe yaMTarA

Saturday, February 21, 2009

587.anuchu dEva gaMdharvAdulu - అనుచు దేవ గంధర్వాదులు పలికేరు






Archive link :
అనుచు దేవ గంధర్వాదులు పలికేరు
కనక కశిపు నీవు ఖండించేవేళను

నరసింహా నరసింహా ననుగావు ననుగావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరిరక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ము కృపను

దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు
శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము
భూవనిత నాథ నాథ పొడమె నీప్రతాపము
పావన పావన మమ్ము పాలించవే

జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు
భయహర భయహర పాపమడగె
దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము
దయజూడు దయజూడు దాసులము నేము



anuchu dEva gaMdharvAdulu palikEru
kanaka kaSipu nIvu khaMDiMchEvELanu

narasiMhA narasiMhA nanugAvu nanugAvu
hari hari nAku nAku nabhayamIvE
kariraksha kariraksha gatamairi danujulu
suranAtha suranAtha chUDu mammu kRpanu

dEvadEva vAsudEva dikku nIvE mAku mAku
SrIvaksha SrIvaksha sEvakulamu
bhUvanita nAtha nAtha poDame nIpratApamu
pAvana pAvana mammu pAliMchavE

jaya jaya gOviMda SaraNuchochchEmu nIku
bhayahara bhayahara pApamaDage
dayatO SrIvEMkaTESa tagili kAchiti mammu
dayajUDu dayajUDu dAsulamu nEmu

Thursday, February 19, 2009

586.mEDalekki ninnu jUchi - మేడలెక్కి నిన్నుఁ జూచి


Archive link :
Youtube link:


యాలపదాలు - దేసాళం
మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా .. ౧
పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా .. ౨
దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి ముప్పిరి నీ విరహానను - వెంకటేశ నిప్పనుచు భ్రమసితిరా .. ౩
నిండఁ బూచిన మానిపై - గండుఁగోవిల గూయగా నిండిన నీయెలుఁగంటాను - వెంకటేశ అండకు నిన్ను రమ్మంటిరా .. ౪
వుదయచందురుఁ జూచి - అదె నీపంజని సవి యెదురుకోనే వచ్చితిరా - వెంకటేశ బెదరి మారుమోమైతిరా .. ౫
మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ కన్నులంటాఁ జేరఁ బోఁగాను - వెంకటేశ పన్ని మరునమ్ములాయరా .. ౬
ఆనిన తుమ్మిదలు నీ - మేనికాంతిఁ బోలునని పూనిచేతఁ బట్టఁ బోఁగాను - వెంకటేశ సూనాస్త్రుని వేగులాయరా .. ౭
కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని పొంద నిన్నుఁ దలఁచితిరా - వెంకటేశ అంది చొక్కు మందులాయరా .. ౮
బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి నిండుజాగరములుంటిరా - వెంకటేశ యెండలాయ వెన్నెలలు రా ..౯
నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండఁ గలగంటి చద్దివేఁడి వలపాయరా - వెంకటేశ సుద్దులింకా నేమి సేసేవో .. ౧౦
మల్లెపూవు కొనదాకి - ఝల్ల నను బులకించి వుల్లము నీకొప్పించితిరా -వెంకటేశ కల్లగాదు మమ్ముఁ గావరా .. ౧౧
జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా గోడలేని చిత్తరువులై - వెంకటేశ యాడా నామతిఁ బాయవురా .. ౧౨
అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండఁగా కొద్దిలేని కాఁకతోడను - వెంకటేశ పొద్దువోక తమకింతురా ..౧౩
పావురమురెక్కఁ జీటి - నీవొద్దికిఁ గంటియంపి దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ నీవిందు రావలెనంటాను ..౧౪
బంగారు పీఁటపైనుండి - ముంగిటికి నీవురాఁగా తొంగిచూచి నిలుచుండగా - వెంకటేశ యెంగిలిమోవేలడిగేవు ..౧౫
దంతపుఁ బావాలు మెట్టి - పంతాన నేను రాఁగాను యింతలో బలిమిఁ బట్టేవు - వెంకటేశ అంత నీకుఁ బ్రియమైతినా .. ౧౬
పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ దిట్టవు నీయంతవారమా .. ౧౭
కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేఁత సేసి తప్పక నేఁ జూచినంతలో- వెంకటేశ చిప్పిలేల చెమరించేవు ..౧౮
బొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ నిమ్మపంట వేతునటరా ..౧౯
నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి వొత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ కొత్తలైన జాణవౌదువు ..౨౦
వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ కన్నుల పండువలాయరా .. ౨౧
చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ పలుకు రతిరహస్యాలు - వెంకటేశ తలఁచినేఁ దలవూతురా .. ౨౨
నీకు వలచిన వలపు - లాకలొత్తె నామతిని వాకున నేఁ జెప్పఁ జాలరా - వెంకటేశ లోకమెల్లానెరిఁగినదే .. ౨౩
పాయము నీకొక్కనికే - చాయగా మీఁదెత్తితిని యీయెడఁ గై వాలకుండాను - వెంకటేశ మా యింటనే పాయకుండరా .. ౨౪
ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ చిమ్ముఁ జీఁకటెల్లఁ బాయను. ..౨౫




Monday, February 16, 2009

585.eMtanErupari yIlEma - ఎంతనేరుపరి యీలేమ






Archive link :
ఎంతనేరుపరి యీలేమ
దొంతివెట్టే సంతోసముల

వెలది సెలవులను వెన్నెలగాసీ
చెలులు నీసుద్దులు చెప్పగను
తలపోతలనే దండలు గుచ్చీ
నెలకొని యెదుటను నీవుండగను


వనిత చెక్కులను వానలు గురిసీ
తనియని విరహపు తమకమున
కనుచూపులనే కలువలు చల్లీ
నినుపుల వలపుల నీరాకలకు

తెఱవ పెదవులను తేనెలు చిందీ
మఱి నీవాడిన మాటలను
నెఱి శ్రీవేంకటనిలయ కూడితివి
జఱసీ నీతో జాణతనముల

eMtanErupari yIlEma
doMtiveTTE saMtOsamula

veladi selavulanu vennelagAsI
chelulu nIsuddulu cheppaganu
talapOtalanE daMDalu guchchI
nelakoni yeduTanu nIvuMDaganu

vanita chekkulanu vAnalu gurisI
taniyani virahapu tamakamuna
kanuchUpulanE kaluvalu challI
ninupula valapula nIrAkalaku
te~rava pedavulanu tEnelu chiMdI
ma~ri nIvADina mATalanu
ne~ri SrIvEMkaTanilaya kUDitivi
ja~rasI nItO jANatanamula

Sunday, February 15, 2009

584. talapulOnanE daivamu - తలపులోననే దైవము వీడివో







Archive link :
తలపులోననే దైవము వీడివో
సులభము సులభము సోధించరో

యిదే హరినామము యిదే కొన(స)నాలికె
వదలక తలచితే వైకుంఠము
వెదకగ నేటికి వెడపుణ్యము లింక
సదరము సదరము సాధించరో

కలదు దేహమిదె కలవివె ముద్రలు
వలెనని చేకొన్న వైకుంఠము
వొలసి కర్మములు పొరలగ నేటికి
కలిగెను కలిగెను కైకొనరో

శ్రీవేంకట మదె శ్రీపతి వీడిగో
వావిరి కొలిచిన వైకుంఠము
భావించి చూచిన బ్రహ్మాదులకును
త్రోవయిదె త్రోవయిదె తొలగకురో
talapulOnanE daivamu vIDivO
sulabhamu sulabhamu sOdhiMcharO

yidE harinAmamu yidE kona(sa)nAlike
vadalaka talachitE vaikuMThamu
vedakaga nETiki veDapuNyamu liMka
sadaramu sadaramu sAdhiMcharO

kaladu dEhamide kalavive mudralu
valenani chEkonna vaikuMThamu
volasi karmamulu poralaga nETiki
kaligenu kaligenu kaikonarO

SrIvEMkaTa made SrIpati vIDigO
vAviri kolichina vaikuMThamu
bhAviMchi chUchina brahmAdulakunu
trOvayide trOvayide tolagakurO

Saturday, February 14, 2009

583.sulabhamA manujulaku - సులభమా మనుజులకు హరిభక్తి





సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుడగుట

కొదలేనితపములు కోటానుకోటులు
నదన నాచరించి యటమీద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొని కదా వైష్ణవుడగుట

తనివోనియాగతంత్రములు లక్షల సంఖ్య
అనఘుడై చేసినయటమీద
జననములన్నిట జనియించి పరమపా -
వనుడై మరికదా వైష్ణవుడగుట

తిరిగి తిరిగి పెక్కు తీర్థములన్నియు
న(/అ)రలేక సేవించినటమీద
తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ -
వరదుని కృపగదా వైష్ణవుడగుట

sulabhamA manujulaku haribhakti
valanoMdi marikadA vaishNavuDaguTa

kodalEnitapamulu kOTAnukOTulu
nadana nAchariMchi yaTamIda
padilamaina karmabaMdhamu lanniyu
vadaliMchukoni kadA vaishNavuDaguTa

tanivOniyAgataMtramulu lakshala saMkhya
anaghuDai chEsinayaTamIda
jananamulanniTa janiyiMchi paramapA -
vanuDai marikadA vaishNavuDaguTa

tirigi tirigi pekku tIrthamulanniyu
na(/a)ralEka sEviMchinaTamIda
tiruvEMkaTAchalAdhipuDaina karirAja -
varaduni kRpagadA vaishNavuDaguTa



Friday, February 13, 2009

582.arudarudIgati ahObalESwara - అరుదరుదీగతి అహోబలేశ్వర



Archive Link :

అరుదరుదీగతి అహోబలేశ్వర
పొరి(బొరి దాసుల పొగడుట యెట్టు

యెదుట( జించితివి హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు

ఘనసింహాకృతి గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
పనివడి కంబము పగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్టు

సరవితో వీరరసమున మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు
arudarudIgati ahObalESwara
pori(bori dAsula pogaDuTa yeTTu

yeduTa( jiMchitivi hiraNyakaSipuni
ade prahlAduDu baMTaguTeTlu
kadisina rudruni garva maDachitivi
gudigoni divijula koluchuTa yeTTu

ghanasiMhAkRti gaikonivuMTivi
yanayaMga kari gAchinadeTlu
panivaDi kaMbamu pagula veDalitivi
manujulu pUjiMchi maruguTa yeTTu

saravitO vIrarasamuna miMchitivi
arayaMga SRMgAri vauTeTTu
sirivura mekkenu SrIvEMkaTAdrini
yiravuga nItoDa yekkuTa yeTTu



Get this widget | Track details | eSnips Social DNA

Wednesday, February 11, 2009

581.eMta nEruchukonnadi yIchinnadi - ఎంత నేరుచుకొన్నది యీచిన్నది












Archive link :
ఎంత నేరుచుకొన్నది యీచిన్నది
చెంతనుండే నిన్ను నిట్టె చేకొన్నది

చిగురు పెదవి మీది చిన్నలూ
సగముమాటలతోడి సన్నలూ
నగియేటి సెలవుల నయములూ
బిగిసేటి కాగిటి ప్రియములు

తనివోక చెలులతో తలపోతలూ
ననుపు లేపొద్దు మానని చేతలు
పనివడి నీమీది పాటలూ
మొనసి యెప్పుడు నీతో మొగమోటలు

వద్దనుండి పైజల్లీ వలపులు
అద్దుకొనీ రతిలోని యలపులు
వొద్దికై శ్రీవేంకటేశ వొనగీడితి వీకెను
కొద్దిమీరె బింకముల కూడిన పొంకములు

eMta nEruchukonnadi yIchinnadi
cheMtanuMDE ninnu niTTe chEkonnadi

chiguru pedavi mIdi chinnalU
sagamumATalatODi sannalU
nagiyETi selavula nayamulU
bigisETi kAgiTi priyamulu

tanivOka chelulatO talapOtalU
nanupu lEpoddu mAnani chEtalu
panivaDi nImIdi pATalU
monasi yeppuDu nItO mogamOTalu

vaddanuMDi paijallI valapulu
addukonI ratilOni yalapulu
voddikai SrIvEMkaTESa vonagIDiti vIkenu
koddimIre biMkamula kUDina poMkamulu

Monday, February 09, 2009

580.viSwamella nI virADrUpamu - విశ్వమెల్ల నీ విరాడ్రూపము








Archive link :

విశ్వమెల్ల నీ విరాడ్రూపము
శాశ్వతహరి నీశరణులము

కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ-
పన్నినమోమున బ్రాహ్మణులు
వున్నతి వైశ్యులు వూరువులందును
యెన్నగ శూద్రులు యిదె పాదముల

యింద్రాదిదేవత లీశానబ్రహ్మ ము-
నీంద్రులంగముల నెసగిరదే
సాంద్రలోకములు జఠరంబున నవె
రుంద్రతేజమదె రోమముల

కాలము కర్మము కైవల్యంబును
ఆలోను వెలియు నది నీవు
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర
కోలుముందు నిను గొలిచితిమయ్య
viSwamella nI virADrUpamu
SASwatahari nISaraNulamu

kannula sUryuDu kamalAptuDu nI-
panninamOmuna brAhmaNulu
vunnati vaiSyulu vUruvulaMdunu
yennaga SUdrulu yide pAdamula

yiMdrAdidEvata lISAnabrahma mu-
nIMdrulaMgamula nesagiradE
sAMdralOkamulu jaTharaMbuna nave
ruMdratEjamade rOmamula

kAlamu karmamu kaivalyaMbunu
AlOnu veliyu nadi nIvu
SrIlalanAdhipa SrIvEMkaTESwara
kOlumuMdu ninu golichitimayya

Sunday, February 01, 2009

579.tegaka paramunaku teruvu - తెగక పరమునకు తెరువు లేదు



Archive link :
తెగక పరమునకు తెరువు లేదు
పగయెల్లా విడువక భవమూ పోదు

కన్నులయెదుటనున్న కాంచనము పై మమత
వున్నంతతడవు మోక్షమొనగూడదు
అన్నముతోడి రుచుల యలమట గలదాకా
పన్నిన సుజ్ఞానము పదిలము గాదు


పక్కనున్న కాంతల భ్రమగల కాలము
మిక్కిలి శ్రీహరి భక్తి మెరయలేదు
వెక్కసపు సంసారవిధి నున్నంతతడవు
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు


చిత్తములోపలి పలు చింతలు మానినదాకా
సత్తుగా వైరాగ్యము సమకూడదు
యిత్తల శ్రీవేంకటేశు డేలిన దాసులకైతే
హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు


tegaka paramunaku teruvu lEdu
pagayellA viDuvaka bhavamU pOdu

kannulayeduTanunna kAMchanamu pai mamata
vunnaMtataDavu mOkshamonagUDadu
annamutODi ruchula yalamaTa galadAkA
pannina suj~nAnamu padilamu gAdu


pakkanunna kAMtala bhramagala kAlamu
mikkili SrIhari bhakti merayalEdu
vekkasapu saMsAravidhi nunnaMtataDavu
nikki paramadharmamu nilukaDa gAdu


chittamulOpali palu chiMtalu mAninadAkA
sattugA vairAgyamu samakUDadu
yittala SrIvEMkaTESu DElina dAsulakaitE
hatti vaikuMThapadavi appuDE kaladu


578.rachcha kekkitivi paMDaraMgi - రచ్చ కెక్కితివి పండరంగి విఠలా








రచ్చ కెక్కితివి పండరంగి విఠలా
పచ్చిదేరే వింతలోనే పండరంగివిఠలా

గుట్టుగల దొరవని కొసరి చూచినంతనె
రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా
మట్టుమీరి తమకపు మాటలనె నీవలపు
బట్టబయలె సేసేవు పండరంగి విఠలా

సాగినసబలలోన సన్న సేసినంతలోనే
రాగిదేలించేవు పండరంగి విఠలా
వేగిరపు చేతలనె విరిని(?) నీ మోహమెల్ల
బాగుగా వెళ్ళ వేసేవు పండరంగి విఠలా

సతినీవున్నచోటికి దగ్గర వచ్చినంతనె
రతి( గూడితివి పండరంగి విఠలా
గతియైన శ్రీవేంకటనాథ యేలితివి
పతివై కోవిలకుంట్ల పండరంగి విఠలా
rachcha kekkitivi paMDaraMgi viThalA
pachchidErE viMtalOnE paMDaraMgiviThalA

guTTugala doravani kosari chUchinaMtane
raTTugA navvEvu paMDaraMgi viThalA
maTTumIri tamakapu mATalane nIvalapu
baTTabayale sEsEvu paMDaraMgi viThalA

sAginasabalalOna sanna sEsinaMtalOnE
rAgidEliMchEvu paMDaraMgi viThalA
vEgirapu chEtalane virini(?) nI mOhamella
bAgugA veLLa vEsEvu paMDaraMgi viThalA

tatinIvunnachOTiki daggara vachchinaMtane
rati( gUDitivi paMDaraMgi viThalA a
gatiyaina SrIvEMkaTanAtha yElitivi
pativai kOvilakuMTla paMDaraMgi viThalA



priya sisters :