Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, August 11, 2008

520.sarvESvaruDavu svataMtraDuvu nIvu - సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు

Audio link : Dwaram Lakshmi : Ragam Kanakamgi


Audio link : esnips
ప|| సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు |
సర్వోత్తముడ నన్నిచట కావవే ||

చ|| శక్తిగలిగితే నీ సరుసదేవుడ గాన |
యుక్తి గలిగితే నే నొడలు మోతునా |
యుక్తియు శక్తియు ఒకటే లేక |
భక్తుడనైతి నన్ను పాలింపవే ||

చ|| బహుపుణ్యుడనైతే బ్రహ్మపట్టమేలనా |
సహజ విజ్ఞానినైతే సంసారి నౌదునా |
విహిత పుణ్య జ్ఞాన విముఖుడ గనకనే |
అహిశయనుడ శరణంటి కావవే ||

చ|| శ్రీవేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే |
నీవెరుగనిది లేదు నేరుపు నాయందు నీదే |
భావము లోపల నీవే పైకొని బుద్ధియ్యగాను |
నీవాడ ననుకొంటి నేడు కావవే ||


pa|| sarvESvaruDavu svataMtraDuvu nIvu | sarvOttamuDa nannicaTa kAvavE ||

ca|| SaktigaligitE nI sarusadEvuDa gAna | yukti galigitE nE noDalu mOtunA |
yuktiyu Saktiyu okaTE lEka | BaktuDanaiti nannu pAliMpavE ||

ca|| bahupuNyuDanaitE brahmapaTTamElanA | sahaja vij~jAninaitE saMsAri naudunA |
vihita puNya j~jAna vimuKuDa ganakanE | ahiSayanuDa SaraNaMTi kAvavE ||

ca|| SrIvEMkaTESa nIvu cEsina pratima niMtE | nIveruganidi lEdu nErupu nAyaMdu nIdE |
BAvamu lOpala nIvE paikoni buddhiyyagAnu | nIvADa nanukoMTi nEDu kAvavE ||


No comments: